Tollywood Hero Mahesh Babu and Namrata Shirodkar’s Love Story Details in Telugu - Sakshi
Sakshi News home page

Mahesh Babu- Namrata Shirodkar: మహేశ్‌ - నమ్రత లవ్ మొదలైంది అక్కడే!

Published Tue, Aug 8 2023 9:04 PM | Last Updated on Wed, Aug 9 2023 1:07 PM

Tollywood Hero Mahesh Babu Namrata Shirodkar  - Sakshi

వెండితెరపై హీరో, హీరోయిన్లుగా నటించి.. నిజ జీవితంలో పెళ్లిబంధంతో ఒక్కటైన టాలీవుడ్‌ జంటల్లో మహేశ్‌బాబు-నమ్రత ఒకరు. టాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్‌ కపుల్‌గా ఈ జంటకు పేరుంది. వీరి రీల్‌ అండ్‌ రియల్‌ లవ్‌ మొదలైంది వంశీ సినిమాతోనే! ఈ మూవీ షూటింగ్‌లోనే వీరికి పరిచయం ఏర్పడింది. 2000లో ఎన్నో అంచనాల మధ్య విడుదలైన వంశీ బాక్స్‌ఫీస్‌ వద్ద అంతగా మెప్పించలేకపోయింది. కానీ వీరి మనసులు ఒక్కటయ్యేలా చేసింది. ఆగస్టు 9న మహేశ్ బాబు బర్త్‌ డే సందర్బంగా ఈ జంట ప్రేమకథపై ఓ లుక్కేద్దాం. 

అక్కడే ప్రేమ చిగురించింది
వంశీ అవుట్‌డోర్‌ షూటింగ్‌లో భాగంగా చిత్ర యూనిట్‌ న్యూజిలాండ్‌ వెళ్లింది. దాదాపు 25 రోజుల పాటు అక్కడే షూట్‌ చేశారు. ఆ సమయంలోనే వీరి పరిచయం స్నేహంగా, అది కాస్తా ప్రేమగా మారింది. అయితే న్యూజిలాండ్‌ నుంచి తిరిగి వచ్చాక ఫస్ట్ నమ్రతనే ప్రపోజ్ చేసింది. అప్పటికే నమ్రత అంటే మహేశ్‌కు ఎంతో ఇష్టం ఉండటంతో మరోమారు ఆలోచించకుండా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. కానీ వీరి ప్రేమను మహేష్‌ కుటుంబం మొదట్లో అంగీకరించకపోవడం లవ్‌ జర్నీకి బ్రేక్‌ పడింది. నమ్రతనే  తన భార్యగా ఊహించుకున్న మహేశ్‌ తన సోదరి మంజుల సహాయం తీసుకున్నారట. ఇకపోతే నమ్రత మహేశ్‌ కంటే నాలుగేళ్లు పెద్ద. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టడానికి ముందే ఆమె మిస్‌ ఇండియా పోటీల్లో గెలుపొందింది. 

(ఇది చదవండి: సౌత్‌ నుంచి ఒకేఒక్కడు.. ఏ హీరో టచ్‌ చేయలేని రికార్డ్‌ మహేష్‌ సొంతం)

మంజులదే కీలకపాత్ర
నమ్రత-మహేశ్‌ల పెళ్లి జరగడంలో మంజుల కీ రోల్ ప్లే చేసింది. దాదాపు ఐదేళ్ల ప్రేమాయణం అనంతరం 2005 ఫిబ్రవరి 10న నమ్రత-మహేశ్‌లు మూడుముళ్ల బంధంలో అడుగుపెట్టారు. తెలుగు సాంప్రదాయం ప్రకారం చాలా సింపుల్‌గా వీరి పెళ్లి జరిగింది. అంతేకాకుండా పెళ్లికి ముందు రోజు రాత్రి వరకు కూడా షూటింగ్‌లో పాల్గొని ముంబై వెళ్లి మరీ వివాహం చేసుకున్నారు మహేశ్‌. 

పెళ్లి తర్వాత సినిమాలకు గుడ్‌బై

పెళ్లి తర్వాత మహేశ్‌ కెరీర్‌ మరింత స్పీడ్‌ అందుకుంది. సినిమా ప్రమోషన్స్‌ నుంచి కాస్ట్యూమ్స్‌ వరకు అన్నీ నమ్రతే దగ్గరుండి చూసుకుంటుందని మహేశ్‌ గతంలో వెల్లడించాడు. కానీ నమ్రత సినిమాలకు గుడ్‌ బై చెప్పేసింది. బాలీవుడ్‌లో వరుస ఆఫర్లు వస్తున్న సమయంలోనే యాక్టింగ్‌ కెరీర్‌కు ఫుల్‌స్టాప్‌ పెట్టేసింది. ఇదే విషయంపై ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'టాప్‌ హీరోయిన్‌ అవ్వాలన్న కోరిక ఎప్పుడూ లేదు. మహేశ్‌ని పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడే సినిమాలను వదులుకోవాలనుకున్నా' అని చెప్పుకొచ్చింది నమ్రత. కాగా.. ఈ జంటకు ఇద్దరు పిల్లలున్నారు. సితార, గౌతమ్‌తో కలిసి విదేశాలకు వెకేషన్‌ వెళ్తూ ఉంటారు మహేశ్ దంపతులు. సినిమాల్లో ఎంజ బిజీగా ఉన్నా సరే.. ఫ్యామిలీ కోసం సమయం కేటాయిస్తు చిల్ అవుతుంటారు టాలీవుడ్ ప్రిన్స్. 

(ఇది చదవండి: మనవరాలికి మెగాస్టార్ దంపతుల స్పెషల్ గిఫ్ట్.. అదేంటో తెలుసా?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement