Mahesh Babu Wife Namrata Shirodkar Shares Pics From Scotland Tour, Goes Viral On Social Media - Sakshi

Namrata Shirodkar Trip Photos: స్కాట్లాండ్‌లో మహేశ్ బాబు ఫ్యామిలీ.. నమ్రత పోస్ట్ వైరల్!

Aug 5 2023 6:29 PM | Updated on Aug 5 2023 7:06 PM

Namrata Shirodkar Shares Pics From Scotland Tour - Sakshi

టాలీవుడ్ మోస్ట్ బ్యూటీఫుల్ కపుల్స్‌లో మహేశ్ బాబు, నమ్రత శిరోద్కర్ జంట ఒకటి. టాలీవుడ్ ప్రిన్స్‌ను లవ్ మ్యారేజ్ చేసుకున్న నమ్రత ఎప్పటికప్పుడు అభిమానులతో టచ్‌లో ఉంటున్నారు. ఇటీవలే కుటుంబంతో కలిసి లండన్‌ వెళ్లిన నమ్రత సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేస్తూ అలరిస్తోంది. ప్రస్తుతం ఫ్యామిలీతో స్కాట్లాండ్‌లో టూర్‌ ఎంజాయ్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను నమ్రత తన ఇన్‌స్టాలో షేర్ చేయడంతో వైరల్‌గా మారాయి.

(ఇది చదవండి: హీరోయిన్‌గా మారిన ‘విక్రమార్కుడు’ చైల్డ్‌ ఆర్టిస్ట్‌)

స్కాట్లాండ్‌లోని అతి పురాతనమైన రాయల్ స్కాట్స్ అండ్ ది రాయల్ రెజిమెంట్ మ్యూజియాన్ని సందర్శించారు. చారిత్రాత్మక మ్యూజియంలో తన పిల్లలు సితార, గౌతమ్‌తో దిగిన ఫోటోలను నమ్రత పంచుకుంది. కాగా.. ప్రస్తుతం త్రివిక్రమ్ డైరెక్షన్‌లో గుంటూరు కారం చిత్రంలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో మహేశ్ సరసన పెళ్లి సందడి భామ శ్రీలీల కనిపించనుంది. అంతకుముందు పూజా హెగ్డేను ఎంపిక చేయగా.. పలు కారణాలతో ఆమె ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది. 

(ఇది చదవండి: మిమ్మల్ని ఇలా చూస్తుంటే సంతోషంగా ఉంది: నమ్రత పోస్ట్ వైరల్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement