Namrata Shirodkar Reveals Reasons Behind Why She Quit Acting, Deets Inside - Sakshi
Sakshi News home page

Namrata Shirodkar: అందుకే సినిమాలకు దూరంగా ఉన్నా: నమ్రత

Published Wed, Dec 21 2022 6:49 PM | Last Updated on Wed, Dec 21 2022 7:07 PM

Namrata Shirodkar reveals she quit acting because Of Mahesh Babu Condition - Sakshi

టాలీవుడ్‌ మోస్ట్‌ బ్యూటిఫుల్‌ కపుల్స్‌ మహేశ్‌బాబు-నమ్రత జంట ఒకటి. మిస్‌ ఇండియా కీరిటాన్ని గెలుచుకున్న నమత్ర ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. వంశీ మూవీ సమయంలో ప్రేమలో పడ్డ మహేశ్‌- నమ్రత ఆ తర్వాత పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. ఇక వివాహం అనంతరం సినిమాలకు గుడ్‌బై చెప్పిన నమ్రత తాజాగా ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో తొలిసారి తన వ్యక్తిగత విషయాలపై నోరు విప్పింది. 

ఈ సందర్భంగా పెళ్లి అనంతరం సినిమాల్లో నటించకపోవడంపై ఆమెకు ప్రశ్న ఎదురైంది. దీనికి ఆమె స్పందిస్తూ తమ పెళ్లికి ముందే మహేశ్‌ ఓ కండిషన్‌ పెట్టాడంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. మహేష్ బాబు తనను పని చేయడం వద్దని కోరడంతో సినిమాలకు దూరంగా ఉన్నట్లు వెల్లడించింది. పెళ్లికి ముందే అన్ని షూట్‌లను పూర్తి చేయడానికి మహేశ్ బాబు తన కోసం వేచి ఉన్నాడని కూడా ఆమె చెప్పుకొచ్చింది.

మహేశ్‌తో పెళ్లికి ముందు తాను కూడా ఒక షరతు పెట్టానని నమ్రత తెలిపింది. తాను ముంబైలో పెరిగినందున పెద్ద భవనంలో నివసించడం సౌకర్యంగా లేదని చెప్పడంతో.. మహేశ్ తన కోసం అపార్ట్‌మెంట్‌లోకి మారాడని చెప్పింది. నటన నుంచి తప్పుకున్నందుకు ఎలాంటి బాధ లేదని ఆమె స్పష్టం చేసింది. తన తల్లి కోరిక మేరకే మోడలింగ్ ప్రారంభించానని.. ఆ తర్వాతే మహేశ్‌ను వివాహం చేసుకున్నానని మాజీ మిస్ ఇండియా తెలిపింది. ఒకవేళ నేను నా కెరీర్‌ను సీరియస్‌గా తీసుకున్నట్లయితే.. నా జీవితం ఇప్పుడు ఉన్న దానికంటే చాలా భిన్నంగా ఉండేదని నమ్రత తెలిపారు.


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement