నవ్వులే నవ్వులు | Brahma Anandam Glimpse: Exceedingly Humorous | Sakshi
Sakshi News home page

నవ్వులే నవ్వులు

Published Tue, Aug 20 2024 12:15 AM | Last Updated on Tue, Aug 20 2024 12:15 AM

Brahma Anandam Glimpse: Exceedingly Humorous

‘పద్మశ్రీ’ బ్రహ్మానందం కీలక పాత్రలో ఆయన తనయుడు రాజా గౌతమ్‌ హీరోగా నటిస్తున్న చిత్రం ‘బ్రహ్మ ఆనందం’. ఆర్‌వీఎస్‌ నిఖిల్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ప్రియా వడ్లమాని, ఐశ్వర్య హోలక్కల్‌ హీరోయిన్లుగా నటì స్తున్నారు. సావిత్రి, ఉమేష్‌ యాదవ్‌ సమర్పణలో స్వధర్మ్‌ ఎంటర్‌టైన్ మెంట్‌పై రాహుల్‌ యాదవ్‌ నక్కా నిర్మిస్తున్నారు.

సోమవారం రక్షా బంధన్  సందర్భంగా ఈ సినిమాని డిసెంబర్‌ 6న విడుదల చేయనున్నట్లు ప్రకటించి, గ్లింప్స్‌ రిలీజ్‌ చే శారు మేకర్స్‌. ‘‘బ్రహ్మానందం, రాజా గౌతమ్‌ నటిస్తున్న ఔట్‌ అండ్‌ ఔట్‌ ఎంటర్‌టైనర్‌ ‘బ్రహ్మ ఆనందం’. ఈ మూవీలో తాత, మనవడుగా వారు అలరించబోతున్నారు. రాజా గౌతమ్‌ స్నేహితుని పాత్రలో ‘వెన్నెల’ కిశోర్‌ ఫుల్‌ లెంగ్త్‌ రోల్‌లో కనిపిస్తారు’’ అని చిత్రయూనిట్‌ పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement