బ్రహ్మానందం, ఆయన తనయుడు రాజా గౌతమ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘బ్రహ్మా ఆనందం’. ప్రియా వడ్లమాని, ఐశ్వర్యా హోలక్కల్ హీరోయిన్లుగా చేశారు. ఈ చిత్రం ద్వారా ఆర్‌వీఎస్ నిఖిల్ దర్శకునిగా పరిచయమవుతున్నారు. ‘మళ్లీ రావా, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, మసూద’ వంటి హిట్ చిత్రాలు తీసిన స్వధర్మ్ ఎంటర్‌టైన్ మెంట్ బ్యానర్‌పై రాహుల్ యాదవ్ నక్కా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా త్వరలో విడుదల కానుంది.
శాండిల్య పీసపాటి సంగీతం అందించిన ‘బ్రహ్మా ఆనందం’ నుంచి ‘ఆనందమానందమాయే...’ లిరికల్ సాంగ్‌ను విడుదల చేశారు మేకర్స్. సాయి కిరణ్ సాహిత్యం అందించిన ఈ పాటని మనీషా ఈరబత్తిని, యశ్వంత్ నాగ్ ఆలపించారు. ‘‘ఆనందమానందమాయే...’ క్యూట్ లవ్ సాంగ్. హీరోపై తన ప్రేమను హీరోయిన్ అందంగా వివరిస్తుంటే, హీరో మాత్రం తనకు డబ్బు మీదున్న ప్రేమ, అవసరాన్ని పాటగా పాడుకుంటున్నారు’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి కెమేరా: మితేష్ పర్వతనేని.
Comments
Please login to add a commentAdd a comment