
నా ఉనికికి కారణం తను : మహేష్
సూపర్ స్టార్ మహేష్ బాబు తనయుడు ఘట్టమనేని వారసుడు గౌతమ్ పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు గౌతమ్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. మహేష్ కూడా తన వారసుడికి ఓ హార్ట్ టచింగ్ ట్వీట్ తో పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. 'నా ఉనికికి కారణం అతనే, నన్ను నడిపించే శక్తి, నా కొడుకు, నా జీవితం, నా సంతోషం. హ్యాపి బర్త్ డే గౌతమ్' అంటూ ట్వీట్ చేశారు.
ప్రస్తుతం స్పైడర్ సినిమా షూటింగ్ కోసం రొమానియాలో ఉన్న మహేష్, ఈ షెడ్యూల్ తో స్పైడర్ షూటింగ్ పూర్తి చేయనున్నారు. హైదరాబాద్ తిరిగొచ్చాక ఇప్పటికే ప్రారంభమైన కొరటాల శివ సినిమాతో బిజీ కానున్నారు. మురుగదాస్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న స్పైడర్ సెప్టెంబర్ 27న భారీగా రిలీజ్ కానుంది.
He is the reason for my existence.. my driving force.. my son.. my world.. my happiness.. Happy Birthday, Gautam Stay blessed!
— Mahesh Babu (@urstrulyMahesh) 31 August 2017