
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు, నమ్రతల ముద్దుల కూతురు సితార సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో అందరికి తెలిసిందే. డ్యాన్స్ వీడియోలు, అన్నయ్య గౌతమ్‌తో చేసే అల్లరి వీడియోలు షేర్ చేస్తూ నెటిజన్లను అలరిస్తుంది. కానీ గౌతమ్ మాత్రం అంత యాక్టివ్‌గా ఉండదు. చెల్లెలు మాదిరి అల్లరి వీడియోలను షేర్ చేయడు. సోషల్ మీడియాలోనే కాదు బయట కూడా సైలెంట్‌గానే ఉంటాడు గౌతమ్.
అయితే స్కూల్‌లో మాత్రం చాలా యాక్టివ్‌గా ఉంటాడట. చదువు మాత్రమే కాదు ఇతర ప్రొగ్రామ్స్‌లో కూడా చురుగ్గా పాల్గొంటాడట. తాజాగా గౌతమ్ తన స్కూల్లో స్నేహితులతో కలిసి నాటకం వేశాడు. స్టేజిపైన యాక్టివ్‌గా డ్యాన్స్ చేశాడు. హైస్కూల్‌లో గౌతమ్ వేసిన మొదటి నాటకం వీడియోను నమ్రత శిరోద్కర్ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది కాస్త వైరల్ అయింది.
గౌతమ్ ఇప్పటికే నాన్న మహేశ్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్న సంగతి తెలిసిందే. మహేశ్-సుకుమార్ కాంబోలో వచ్చిన వన్ నేనొక్కడినే చిత్రంలో గౌతమ్ నటించాడు. ఆ తర్వాత మళ్లీ తెరపై కనిపించలేదు. కానీ ఈ వీడియో చూశాక.. గౌతమ్‌లో గొప్ప నటుడు ఉన్నాడని, తండ్రి మాదిరే ఆయన కూడా భవిష్యత్తులో స్టార్ హీరో అవుతాడని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment