Mahesh Babu Says About Sitara, Gautham's Reaction After Watching SVP - Sakshi
Sakshi News home page

Mahesh Babu: ‘సర్కారు వారి పాట’ చూసిన సితార పాప రియాక్షన్‌ ఏంటంటే..

Published Tue, May 17 2022 8:53 AM | Last Updated on Tue, May 17 2022 10:58 AM

Mahesh Babu About Sitara, Gautham Reaction After Watching SVP in Kurnool - Sakshi

Mahesh Babu About Sitara Reaction After Watching SVP: సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు, కీర్తి సురేష్‌ జంటగా నటించిన తాజా చిత్రం​ 'సర్కారు వారి పాట'. పరశురామ్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా మే 12న థియేటర్లోకి వచ్చింది. విడుదలైన తొలి రోజు నుంచే హిట్‌టాక్‌తో దూసుకుపోతూ బాక్సాఫీస్‌ వద్ద రికార్డు స్థాయిలో వసూళ్లను రాబడుతోంది. విడుదలైన రెండు రోజుల్లోనే ఈ మూవీ రూ.103 కోట్ల గ్రాస్‌ని సాధించి బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ను సొంతం చేసుకుంది.

చదవండి: వేదికపై మహేష్‌బాబు డ్యాన్స్‌

ఈ నేపథ్యంలో కర్నూల్‌ ఎస్టీబీసీ కళాశాల మైదానంలో సోమవారం రాత్రి సర్కారు వారి పాట సక్సెస్‌ మీట్‌ను చాలా గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ వేడుకలో పాల్గొన్న మహేశ్‌ బాబు మాట్లాడుతూ ఎమోషనల్‌ అయ్యాడు. ‘సర్కారు వారి పాట సినిమా ఫస్ట్‌ మా ఫ్యామిలీతో కలిసి చూసినప్పుడు మా అబ్బాయి(గౌతమ్‌ ఘట్టమనేని) షేక్‌ హ్యాండ్‌ ఇచ్చి గట్టిగా హగ్‌ చేసుకున్నాడు. ఇక​ సితార అయితే అన్ని సినిమాల్లో కన్నా ఈ సినిమాలో చాలా బాగా నటించావు నాన్న, ఇందులో చాలా అందంగా కూడా ఉన్నావు అని కితాబు ఇచ్చింది’ అంటూ మహేశ్‌ మురిసిపోయాడు.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

చదవండి: మీడియా ముందుకు కరాటే కల్యాణి: నేను ఎక్కడికీ పారిపోలేదు

అలాగే ఈ సినిమా చూసిన మహేశ్‌ తండ్రి, సూపర్‌ స్టార్‌ కృష్ణ రియాక్షన్‌ ఏంటని యాంకర్‌ అడగ్గా.. ఆయన సినిమా చూడగానే ఈ సినిమా పోకిరి, దూకుడు కంటే సూపర్‌ హిట్‌ అవుతుందని చెప్పారన్నాడు. కాగా మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో సముంద్రఖని, వెన్నెల కిషోర్‌, సుబ్బరాజు, అజయ్‌ తదితరులు నటించిన సంగతి తెలిసిందే. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement