
తెలంగాణ స్విమ్మింగ్ సంఘం ఆధ్వర్యంలో జరిగిన అంతర్ జిల్లా జూనియర్, సబ్ జూనియర్ చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్ స్విమ్మర్ గౌతమ్ శశివర్ధన్ ఐదు స్వర్ణ పతకాలతో అదరగొట్టాడు. విక్కీ స్విమ్మింగ్ అకాడమీలో శిక్షణ తీసుకుంటున్న 14 ఏళ్ల గౌతమ్ బరిలోకి దిగిన ఐదు ఈవెంట్లలోనూ విజేతగా నిలిచాడు.
గ్రూప్–2 వయో విభాగంలో గౌతమ్ 50, 100, 200 మీటర్ల బ్రెస్ట్‌స్ట్రోక్, 200, 400 మీటర్ల వ్యక్తిగత మెడ్లీ ఈవెంట్లలో పసిడి పతకాలు గెలిచాడు. ఈ ప్రదర్శనతో గౌతమ్ ఈనెల 27 నుంచి 29 వరకు బెంగళూరులో జరిగే జాతీయ జూనియర్ స్విమ్మింగ్ చాంపియన్íÙప్‌లో పాల్గొనే తెలంగాణ జట్టులోకి ఎంపికయ్యాడు.
Comments
Please login to add a commentAdd a comment