గౌతమ్ చాలా బాగున్నాడు - మహేష్
గౌతమ్ చాలా బాగున్నాడు - మహేష్
Published Mon, Feb 3 2014 2:20 AM | Last Updated on Sat, Sep 2 2017 3:17 AM
‘‘గౌతమ్ చాలా బాగున్నాడు’’ అంటున్నారు మహేష్‌బాబు. ఆయన చెబుతున్నది తన తనయుడు గౌతమ్ గురించి కాదు. డా. బ్రహ్మానందం తనయుడు రాజా గౌతమ్ గురించి. ప్రస్తుతం గౌతమ్ హీరోగా ‘బసంతి’ అనే చిత్రం నిర్మితమవుతోంది. రాజా గౌతమ్, అలీషా బేగ్ జంటగా స్టార్ట్ కెమెరా పిక్చర్స్ పతాకంపై స్వీయదర్శకత్వంలో చైతన్య దంతులూరి రూపొందిస్తున్నారు. ఈ ప్రచార చిత్రాన్ని ఆవిష్కరించిన అనంతరం..
‘‘ఈ ట్రైలర్ చాలా బాగుంది. ఈ సినిమా విజయం సాధించాలని కోరుకుంటున్నాను’’ అని మహేష్‌బాబు అన్నారు. మహేష్‌తో ‘ఆగడు’ చిత్రంలో నటిస్తున్న తమన్నా, చిత్రదర్శకుడు శ్రీను వైట్ల ఈ ప్రచార చిత్రం వేడుకలో పాల్గొన్నారు. ట్రైలర్ చూస్తుంటే టెక్నికల్‌గా సినిమా బాగుంటుందనిపిస్తోందని, చాలా కొత్తగా ఉందని శ్రీను వైట్ల అన్నారు. ట్రైలర్ కాన్సెప్ట్ బాగుందని, సినిమా చూడాలని చాలా ఆసక్తిగా ఉందని తమన్నా చెప్పారు. ‘బసంతి’లో కీలక పాత్ర చేస్తున్నానని తనికెళ్ల అన్నారు. ఈ వేడుకలో రాజా గౌతమ్, సహనిర్మాత వివేక్ కూచిభొట్ల తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement