basanthi
-
‘ఆగడు’లో గౌతమ్
-
గౌతమ్ చాలా బాగున్నాడు - మహేష్
‘‘గౌతమ్ చాలా బాగున్నాడు’’ అంటున్నారు మహేష్‌బాబు. ఆయన చెబుతున్నది తన తనయుడు గౌతమ్ గురించి కాదు. డా. బ్రహ్మానందం తనయుడు రాజా గౌతమ్ గురించి. ప్రస్తుతం గౌతమ్ హీరోగా ‘బసంతి’ అనే చిత్రం నిర్మితమవుతోంది. రాజా గౌతమ్, అలీషా బేగ్ జంటగా స్టార్ట్ కెమెరా పిక్చర్స్ పతాకంపై స్వీయదర్శకత్వంలో చైతన్య దంతులూరి రూపొందిస్తున్నారు. ఈ ప్రచార చిత్రాన్ని ఆవిష్కరించిన అనంతరం.. ‘‘ఈ ట్రైలర్ చాలా బాగుంది. ఈ సినిమా విజయం సాధించాలని కోరుకుంటున్నాను’’ అని మహేష్‌బాబు అన్నారు. మహేష్‌తో ‘ఆగడు’ చిత్రంలో నటిస్తున్న తమన్నా, చిత్రదర్శకుడు శ్రీను వైట్ల ఈ ప్రచార చిత్రం వేడుకలో పాల్గొన్నారు. ట్రైలర్ చూస్తుంటే టెక్నికల్‌గా సినిమా బాగుంటుందనిపిస్తోందని, చాలా కొత్తగా ఉందని శ్రీను వైట్ల అన్నారు. ట్రైలర్ కాన్సెప్ట్ బాగుందని, సినిమా చూడాలని చాలా ఆసక్తిగా ఉందని తమన్నా చెప్పారు. ‘బసంతి’లో కీలక పాత్ర చేస్తున్నానని తనికెళ్ల అన్నారు. ఈ వేడుకలో రాజా గౌతమ్, సహనిర్మాత వివేక్ కూచిభొట్ల తదితరులు పాల్గొన్నారు. -
25న బసంతి ఆడియో విడుదల
-
ఎవరీ బసంతి?
కళాశాల నేపథ్యం, ఉగ్రవాదం ఈ రెండింటి నేపథ్యంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘బసంతి’. ‘బాణం’ ఫేం దంతులూరి చైతన్య స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న ఈ చిత్రంలో బ్రహ్మానందం తనయుడు గౌతమ్ హీరోగా నటిస్తున్నారు. అలీషాబేగ్ కథానాయిక. చిత్రీకరణ పూర్తయి, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమా గురించి చైతన్య మాట్లాడుతూ -‘‘బసంతి చుట్టూనే ఈ కథ తిరుగుతుంది. వినోదం, విలువలు రెండూ ఉన్న సినిమా ఇది. సాంకేతికంగా అందర్నీ ఆకట్టుకుంటుందీ సినిమా. ఈ నెలలోనే పాటల్ని విడుదల చేస్తాం’’ అని తెలిపారు. ఇందులో తాను విద్యార్థిగా నటిస్తున్నానని గౌతమ్ చెప్పారు. తనికెళ్ల భరణి, రణధీర్ గట్ల, నవీనా జాక్సన్, సయాజీ షిండే, ధన్‌రాజ్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి మాటలు: శ్రీకాంత్ విస్సా, కెమెరా: అనిల్ బండారి, కూర్పు: మార్తాండ్ కె.వెంకటేష్, సంగీతం: మణిశర్మ, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: వివేక్ కూచిభొట్ల. -
బసంతి కళాశాలలో...
కళాశాలలో అడ్మిషన్ తీసుకోగానే ప్రతి విద్యార్థికీ ఓ గుర్తింపు వస్తుంది. అలాగే... కళాశాల.. విద్యార్థి బాధ్యతను కూడా గుర్తు చేస్తుంది. అందుకే కళాశాల జీవితం ప్రతి విద్యార్థికీ ప్రత్యేకం. ఆ రోజులనాటి మాధుర్యాన్ని గుర్తు చేసే కథాంశంతో రూపొందుతోన్న చిత్రం ‘బసంతి’. ప్రసిద్ధ హాస్యనటుడు బ్రహ్మానందం తనయుడు గౌతమ్, అలీషాబేగ్ జంటగా నటించిన ఈ చిత్రాన్ని ‘బాణం’ఫేం దంతలూరి చైతన్య స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్‌లుక్ గురువారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా దంతలూరి చైతన్య మాట్లాడుతూ -‘బాణం’ కథ కంటే ముందే సిద్ధం చేసుకున్న కథ ఇది. బసంతి కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్‌లో చదివే విద్యార్థుల నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న సంఘటనల ఆధారంగా ఈ కథ తయారు చేశాం. సాంకేతికంగా కూడా సినిమా బాగుంటుంది. షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది. నవంబర్‌లో పాటల్ని, డిసెంబర్లో సినిమాను విడుదల చేస్తాం’’ అని తెలిపారు. రణధీర్ గట్ల, నవీనా జాక్సన్, తనికెళ్ళ భరణి, సమాజీ షిండే, ఆనంద్, ధన్‌రాజ్, తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి మాటలు: శ్రీకాంత్ నాయుడు విస్సా, కూర్పు: మార్తాండ్ కె.వెంకటేష్, కెమెరా: అనిల్ బండారి, పి.కె.వర్మ, సంగీతం: మణిశర్మ, ఎగ్జిక్యూటివ్ నిర్మాత : వివేక్ కూచిభొట్ల.