ఎవరీ బసంతి? | 'basanthi' movie is based on terrorism | Sakshi
Sakshi News home page

ఎవరీ బసంతి?

Published Sat, Dec 7 2013 12:12 AM | Last Updated on Sat, Sep 2 2017 1:20 AM

ఎవరీ బసంతి?

ఎవరీ బసంతి?

కళాశాల నేపథ్యం, ఉగ్రవాదం ఈ రెండింటి నేపథ్యంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘బసంతి’. ‘బాణం’ ఫేం దంతులూరి చైతన్య స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న ఈ చిత్రంలో బ్రహ్మానందం తనయుడు గౌతమ్ హీరోగా నటిస్తున్నారు. అలీషాబేగ్ కథానాయిక. చిత్రీకరణ పూర్తయి, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమా గురించి చైతన్య మాట్లాడుతూ -‘‘బసంతి చుట్టూనే ఈ కథ తిరుగుతుంది. వినోదం, విలువలు రెండూ ఉన్న సినిమా ఇది. సాంకేతికంగా అందర్నీ ఆకట్టుకుంటుందీ సినిమా. ఈ నెలలోనే పాటల్ని విడుదల చేస్తాం’’ అని తెలిపారు. ఇందులో తాను విద్యార్థిగా నటిస్తున్నానని గౌతమ్ చెప్పారు.
 
  తనికెళ్ల భరణి, రణధీర్ గట్ల, నవీనా జాక్సన్, సయాజీ షిండే, ధన్‌రాజ్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి మాటలు: శ్రీకాంత్ విస్సా, కెమెరా: అనిల్ బండారి, కూర్పు: మార్తాండ్ కె.వెంకటేష్, సంగీతం: మణిశర్మ, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: వివేక్ కూచిభొట్ల.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement