banam
-
అదే గెటప్‌లో.. నాలుగోసారి..!
రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్‌కు భిన్నంగా ఆసక్తికర కథలతో ఆకట్టుకుంటున్న హీరో నారా రోహిత్. కెరీర్ స్టార్టింగ్ నుంచి ఇదే బాటలో నడుస్తున్న రోహిత్.. ఎక్కువగా సీరియస్ పాత్రల్లోనే కనిపించాడు. అది కూడా ఎక్కువగా పోలీస్ గెటప్‌లోనే. ఇప్పటికే మూడు సినిమాల్లో పోలీస్ డ్రస్ వేసుకున్న రోహిత్ ఇప్పుడు మరోసారి అదే గెటప్‌లో కనిపించేందుకు రెడీ అవుతున్నాడు. తొలి సినిమా బాణంలో పోలీస్ ఆఫీసర్‌గా కనిపించిన నారా రోహిత్ తరువాత రౌడీఫెలో, అసుర సినిమాల్లో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న అప్పట్లో ఒకడుండేవాడు సినిమాలో మరోసారి పోలీస్ గెటప్‌లో కనిపించనున్నాడు. గతంలో రోహిత్ పోలీస్‌గా నటించిన సినిమాలన్నీ మంచి విజయాలు సాధించగా మరోసారి అదే సెంటిమెంట్ రిపీట్ అవుతుందన్న నమ్మకంతో ఉన్నారు యూనిట్. -
చైతన్య చెపుతున్న నీతి పాఠం
ఇటీవల కాలంలో ఒక్క సినిమాతోనూ సత్తా చాటుతున్న యువ దర్శకులు చాలా మందే ఉన్నారు. అలా తొలి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించిన దర్శకుడు చైతన్య దంతులూరి. నారా రోహిత్‌ను హీరోగా పరిచేస్తూ తెరకెక్కించిన బాణం సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు చైతన్య. ఈ సినిమా కమర్షియల్‌గా ఆకట్టుకోకపోయినా.. సినీ విశ్లేషకుల ప్రశంసలు అందుకుంది. ముఖ్యంగా సిల్వర్ స్క్రీన్ మీద కలెక్షన్ల విషయంలో వెనుకపడిన బాణం, టివి టెలికాస్ట్‌లో మంచి మార్కులు సాధించింది. బాణం సినిమా తరువాత బ్రహ్మనందం తనయుడు గౌతమ్ హీరో బసంతి సినిమాను తెరకెక్కించాడు చైతన్య. ఈ సినిమాతో కూడా తన మార్క్ చూపించాడు. అయితే మరోసారి కమర్షియల్‌గా ఆకట్టుకోలేకపోవటం చైతన్య కెరీర్‌ను కష్టాల్లో పడేసింది. దీంతో లాంగ్ గ్యాప్ తీసుకున్న ఈ యువ దర్శకుడు మరోసారి తన మార్క్ చూపించడానికి రెడీ అవుతున్నాడు. త్వరలో 'బలవంతుడు నాకేమని' అనే టైటిల్‌తో సినిమా తెరకెక్కిస్తున్నట్టుగా ప్రకటించాడు. తన తొలిరెండు సినిమాలు టైటిల్స్ లాగానే బి అనే అక్షరంతోనే మూడో సినిమా టైటిల్ కూడా స్టార్ట్ అయ్యేలా ప్లాన్ చేసుకున్నాడు చైతన్య దంతులూరి. ప్రస్తుతానికి చర్చల దశలోనే ఉన్న..., బలవంతుడు నాకేమని సినిమాలో ఓ స్టార్ హీరో ప్రధాన పాత్రలో నటించే అవకాశం ఉంది. త్వరలోనే పూర్తి వివరాలు వెళ్లడించనున్నారు. -
ఎవరీ బసంతి?
కళాశాల నేపథ్యం, ఉగ్రవాదం ఈ రెండింటి నేపథ్యంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘బసంతి’. ‘బాణం’ ఫేం దంతులూరి చైతన్య స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న ఈ చిత్రంలో బ్రహ్మానందం తనయుడు గౌతమ్ హీరోగా నటిస్తున్నారు. అలీషాబేగ్ కథానాయిక. చిత్రీకరణ పూర్తయి, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమా గురించి చైతన్య మాట్లాడుతూ -‘‘బసంతి చుట్టూనే ఈ కథ తిరుగుతుంది. వినోదం, విలువలు రెండూ ఉన్న సినిమా ఇది. సాంకేతికంగా అందర్నీ ఆకట్టుకుంటుందీ సినిమా. ఈ నెలలోనే పాటల్ని విడుదల చేస్తాం’’ అని తెలిపారు. ఇందులో తాను విద్యార్థిగా నటిస్తున్నానని గౌతమ్ చెప్పారు. తనికెళ్ల భరణి, రణధీర్ గట్ల, నవీనా జాక్సన్, సయాజీ షిండే, ధన్‌రాజ్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి మాటలు: శ్రీకాంత్ విస్సా, కెమెరా: అనిల్ బండారి, కూర్పు: మార్తాండ్ కె.వెంకటేష్, సంగీతం: మణిశర్మ, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: వివేక్ కూచిభొట్ల. -
ఉగ్రవాద బసంతి...
కళాశాల నేపథ్యంలో ఇప్పటివరకూ చాలా సినిమాలు వచ్చాయి. కానీ ఈ నేపథ్యానికి ఉగ్రవాద సమస్యను జత చేసి ఎవ్వరూ సినిమా చేయలేదు. ‘బసంతి’ చిత్రం ఆ తరహాలోనే రూపొందుతోంది. ‘బాణం’ చిత్రంలో నక్సలిజం సమస్యని తండ్రీకొడుకుల మధ్య సంఘర్షణగా సున్నితంగా తెరకెక్కించిన చైతన్య దంతులూరి ‘బసంతి’ని స్వీయదర్శకత్వంలో నిర్మిస్తున్నారు. ప్రసిద్ధ హాస్యనటుడు బ్రహ్మానందం తనయుడు గౌతమ్ ఇందులో కథానాయకుడు. అలీషా బేగ్ నాయిక. చిత్రీకరణ మొత్తం పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. చైతన్య దంతులూరి మాట్లాడుతూ -‘‘కథా కథనాలు, సంభాషణలు, సంగీతం, ఛాయాగ్రహణం నవ్యరీతిలో ఉంటాయి. ఈ నెలలో పాటలను, వచ్చే నెలలో చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అని తెలిపారు. ఈ సినిమా తనకు మంచి బ్రేక్‌నిస్తుందని గౌతమ్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ చిత్రానికి కెమెరా: అనిల్ బండారి, పి.కె.వర్మ, సంగీతం: మణిశర్మ, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: వివేక్ కూచిభొట్ల.