చైతన్య చెపుతున్న నీతి పాఠం | Banam fame chaithanya reveals title of next film | Sakshi
Sakshi News home page

చైతన్య చెపుతున్న నీతి పాఠం

Jan 8 2016 9:49 PM | Updated on Sep 3 2017 3:19 PM

చైతన్య చెపుతున్న నీతి పాఠం

చైతన్య చెపుతున్న నీతి పాఠం

ఇటీవల కాలంలో ఒక్క సినిమాతోనూ సత్తా చాటుతున్న యువ దర్శకులు చాలా మందే ఉన్నారు. అలా తొలి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించిన దర్శకుడు చైతన్య దంతులూరి. నారా రోహిత్ను హీరోగా పరిచేస్తూ...

ఇటీవల కాలంలో ఒక్క సినిమాతోనూ సత్తా చాటుతున్న యువ దర్శకులు చాలా మందే ఉన్నారు. అలా తొలి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించిన దర్శకుడు చైతన్య దంతులూరి. నారా రోహిత్ను హీరోగా పరిచేస్తూ తెరకెక్కించిన బాణం సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు చైతన్య. ఈ సినిమా కమర్షియల్గా ఆకట్టుకోకపోయినా.. సినీ విశ్లేషకుల ప్రశంసలు అందుకుంది. ముఖ్యంగా సిల్వర్ స్క్రీన్ మీద కలెక్షన్ల విషయంలో వెనుకపడిన బాణం, టివి టెలికాస్ట్లో మంచి మార్కులు సాధించింది.

బాణం సినిమా తరువాత బ్రహ్మనందం తనయుడు గౌతమ్ హీరో బసంతి సినిమాను తెరకెక్కించాడు చైతన్య. ఈ సినిమాతో కూడా తన మార్క్ చూపించాడు. అయితే మరోసారి కమర్షియల్గా ఆకట్టుకోలేకపోవటం చైతన్య కెరీర్ను కష్టాల్లో పడేసింది. దీంతో లాంగ్ గ్యాప్ తీసుకున్న ఈ యువ దర్శకుడు మరోసారి తన మార్క్ చూపించడానికి రెడీ అవుతున్నాడు. త్వరలో 'బలవంతుడు నాకేమని' అనే టైటిల్తో సినిమా తెరకెక్కిస్తున్నట్టుగా ప్రకటించాడు.

తన తొలిరెండు సినిమాలు టైటిల్స్ లాగానే బి అనే అక్షరంతోనే మూడో సినిమా టైటిల్ కూడా స్టార్ట్ అయ్యేలా ప్లాన్ చేసుకున్నాడు చైతన్య దంతులూరి. ప్రస్తుతానికి చర్చల దశలోనే ఉన్న..., బలవంతుడు నాకేమని సినిమాలో ఓ స్టార్ హీరో ప్రధాన పాత్రలో నటించే అవకాశం ఉంది. త్వరలోనే పూర్తి వివరాలు వెళ్లడించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement