
బొమ్మనహళ్లి : చందనసీమ ప్రిన్స్ ధ్రువసర్జా, ఆయన బాల్య స్నేహితురాలు ప్రేరణ శంకర్ వివాహం ఆదివారం బెంగళూరులో ఘనంగా జరిగింది. ఇక్కడి జేపీ నగరలోని సంస్కృత బృందవనలోని కన్వెన్షన్ హాల్లో ఆదివారం ఉదయం ఉదయం 7.15 గంటల నుంచి 7.45 గంటల మధ్య వృశ్చిక లగ్నంలో ధ్రువసర్జా, ప్రేరణలు దాంపత్య జీవితంలోకి అడుగు పెట్టారు. గౌడ సాంప్రదాయ పద్దతిలో వివాహం జరిగింది. వేడుకల్లో ధ్రువసర్జా కుటుంబ సభ్యులతో పాటు ప్రేరణ కుటుంబ సభ్యులు, బంధువులు పెద్ద సంఖ్యలో హాజరై నూతన జంటను ఆశీర్వదించారు. వివాహానికి నటుడు అర్జున్ సర్జా, నటి తారా అనురాధ కుటుంబ సభ్యులు, దర్శకుడు నందకిశోర్, దర్శకుడు ఏపీ అరుఉ్జన్‌తో పాటు పునీత్ రాజ్‌కుమార్, రాఘవేంద్ర రాజ్ కుమార్ దంపతులు హాజరై ఆశీర్వదించారు.