
కార్తీకదీపం జూన్ 1: కార్తీక్ నిజం తెలుసుకున్న విషయం దీపతో చెప్పి క్షమాపణలు కోరాలనుకుంటాడు. ఇటూ మోనిత.. కార్తీక్, దీపలు విడిపోయే పెద్ద సీక్రేట్‌కు రీవిల్ చేసేందుకు సిద్దమవుతుంది. మరోవైపు కార్తీక్ ఏం చెప్పబోతున్నాడో తెలియక దీప కంగారు పడుతూ ఉంటుంది. ఇన్ని సస్పెన్స్‌ల నడుమ కార్తీక్ దీపకు నిజం చెబుతాడా లేదా అనేది నేటి(జూన్ 1వ) ఎపిసోడ్ ఇక్కడ చదవండి.
మోనిత డాక్టర్ భారతిని ఇంటికి పిలుస్తుంది. తనకు నచ్చిన మైసూర్ పాక్ స్వీట్‌ను ప్రియమణితో స్పెషల్‌గా చేయిస్తుంది. భారతి మోనిత నానా హడావుడి చేస్తూ భారతి స్వీట్ ఇస్తుంది. గదిలోకి వెళ్లి పండ్లు, చీర తీసుకోచ్చి.. దీపను చావు అంచుల నుంచి లాక్కొంచి కార్తీక్ ఆరోగ్యం అప్పగించావ్ కదా అందుకే ఇది ఇస్తున్నా అంటుంది. కానీ భారతి అది తీసుకునేందుకు ఇష్టపడదు. వద్దంటుంటే బలవంతంగా చీర ఇస్తుంది. ఇదంతా చూసి భారతి ఆలోచనలో పడుతుంది. ఇదేంటి మోనిత ఏమైనా కొత్త నాటకానికి తెరలేపిందా అంటు అనుమానంగా ఆలోచిస్తూ వెళ్లిపోతుంది. ఇక ఆమె వెళ్లిపోగానే మోనిత ‘ఇదంత భారతి కార్తీక్‌కు చెబుతుంది, కార్తీక్ వెళ్లి దీప, సౌందర్యలకు చెబుతాడు, ఆ తర్వాత నా ప్లాన్ ఏంటో తెలియక ఆ అత్త-కోడళ్లు తలలు పట్టుకుంటారు. ఇలోపు నేను చేయాల్సిన పని చేసేస్తా’ అని మనసులో అనుకుంటు నువ్వుకుంటుంది.
గదిలో కార్తీక్ ఏం చెప్పాలనుకుంటున్నాడో తెలియక దీప ధీనంగా కూర్చోని ఆలోచిస్తుంది. ఇంతలో సౌందర్య దీప కోసం జ్యూస్ తెచ్చి తాగమంటుంది. కార్తీక్ చెప్పబోయే విషయం ఏంటా అని దీప సౌందర్యతో అంటూ ఉండగా.. కార్తీక్ వచ్చి ‘మమ్మీ మోనిత భారతిని పిలిచి చీర పళ్లు పెట్టిందట.. దీప కోలుకునేలా చేశావ్.. థాంక్యూ.. వాళ్లు ఇప్పుడు ఇదంతా ఆలోచించే సమయంలో ఉండిఉండరు. అందుకే వాళ్ల తరపున నేను ఈ చిరు కానుక ఇస్తున్నాను అంటూ భారతికి చీర పెట్టిందట.. పాపం పిచ్చిది’ అని చెప్పి అక్కడ నుంచి వెళ్లిపోతాడు. ఆ మాటలు విన్న సౌందర్య, దీప షాక్ అవుతారు. మోనితని పాపం పిచ్చిది.. అంటున్నాడు ఈ అమాయకుడు అని సౌందర్య తిట్టుకుంటుంది. దీప మనసులో రేపు ఈయన చెప్పబోయే విషయానికి మోనితకి ఏమైనా సంబంధం ఉందా అని ఆలోచిస్తూ ఉంటుంది.
సరిగ్గా అప్పుడే మోనిత బాల్కనీలో కూర్చుని.. ఈ పాటికి ఆ అత్తాకోడళ్లకు తెలిసే ఉంటుంది. అర్థం కాక జుట్టు పీక్కుంటుంటారు. ఇలాగే నా లక్ష్యం కోసం ఏదొక అడుగు వేస్తూ ఏదోరోజు ఒక అడుగు కార్తీక్ ఇంట్లో వేస్తాను.. వెంటనే మంచి ముహూర్తం ఉంటే చూసిపెట్టుకోవాలి అనుకుంటుంది. వెంటనే ప్రియమణిని పిలిచి తనకు తెలిసిన పంతులు ఫోన్ చేసి ఇవ్వమంటుంది. ప్రియమణి ఫోన్ చేసి ఇవ్వగానే మోనిత నేనొక మంచి పని తలపెడుతున్నాను పంతులుగారు.. మంచి ముహూర్తం ఉంటే చూసి చెప్పండి అని అడుగుతుంది మోనిత. దీంతో ఆ పంతులు రేపు మంచి ముహూర్తం ఉందని, ఆ తర్వా మూడు నెలల దాక మంచి ముహుర్తాలు లేవని చెబుతాడు. దాంతో మోనిత వెంటనే మనసులో ‘రేపే అంటే టైమ్ లేదే.. ఇంత తక్కువ టైమ్‌లో అంత పెద్ద స్కెచ్ వెయ్యడం ఎలా అబ్బా? ఏది ఏమైనా సరే.. రేపటితో నేను అనుకున్నది జరగాలి.. జరిగి తీరాలి..’ అని నిర్ణయించుకుంటుంది.
కార్తీక్ బయటికి వెళ్లబోతుంటే.. దీప డాక్టర్ అని పిలిచి ఆపగా.. ఏం కావాలి, చీరలా, పండ్లా.. ఏం తేవాలి దీపా అని అడుగుతాడు. అవేం కాదు డాక్టర్ బాబు.. మీరు చెబుతానన్న విషయం ఏంటో.. అది అంటుంది దీప. వెంటనే కార్తీక్ రేపు నేను చెప్పబోయే విషయం.. నా జీవితానికి సంబంధించినది అంటాడు. అంటే నా జీవితానికి సంబంధంలేనిదా అని దీప ప్రశ్నించగా.. ‘నా జీవితంతో ముడిపడే కదా నీ జీవితం’ అంటాడు కార్తీక్. ‘నా మనసు ఆగడం లేదు డాక్టర్ బాబు.. మీరు చెప్పబోయే విషయం ఏంటో తెలుసుకోవాలని ఉంది.. ఇప్పుడే చెప్పొచ్చు కదా? నా గుండె దడ తగ్గుతుంది?’ అంటుంది దీప రిక్వస్ట్‌గా. దీంతో కార్తీక్ తాను తప్పు చేశానని, అది నా నోటితో నేను చెప్పడానికి నన్ను నేను సిద్దం చేసుకోవాలంటే దానికి కొంచం టైం కావాలి అంటాడు. రేపు చెబుతాను.. రేపే చెప్పేస్తాను.. అందాక ఆగు దీపా అని చెప్పి కార్తీక్ అక్కడ నుంచి కారులో వెళ్లిపోతాడు. అనంతరం దీప ఆలోచనలో పడుతుంది.
తరువాయి భాగంలో పూజకు అందరు సిద్దంగా ఉంటారు. దీప, సౌందర్య, కార్తీక్ మాట్లాడుకుంటూ ఉంటారు. పిల్లల్ని తీసుకుని డాడీని బయలుదేరమని ఫోన్ చెయ్యి కార్తీక్ అని సౌందర్య చెప్పగా ‘వద్దు మమ్మీ.. నేను కావాలనే వాళ్లని అక్కడ దించి రమ్మన్నాను.. రేపు నేను ఒక ముఖ్యమైన విషయం చెబుతానన్నాను కదా.. ఆ సమయంలో పిల్లలు ఉండకూడదు.. ఆ మాటలు వాళ్ల వినకూడదు..’ అని చెప్పి కార్తీక్ అక్కడ నుంచి వెళ్లిపోతాడు కార్తీక్. ఇక తర్వాత ఏం జరగనుందనేంది రేపటి ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.
Comments
Please login to add a commentAdd a comment