Nuvvu Nenu Prema New Telugu Serial Telecast on Star MAA - Sakshi
Sakshi News home page

Nuvvu Nenu Prema: "నువ్వు నేను ప్రేమ" అంటున్న స్టార్ మా!

Published Mon, May 16 2022 1:48 PM | Last Updated on Thu, Jun 9 2022 6:13 PM

Nuvvu Nenu Prema New Telugu Serial To Telecast On Star Maa - Sakshi

ఇద్దరు మనుషులు ప్రేమగా ఎదురుపడితే, ఒకరినొకరు ఇష్టపడితే ప్రేమ పుడుతుంది. సాధారణంగా జరిగేది ఇదే. కానీ అస్సలు  ఇష్టపడే ఛాన్స్ లేని ఓ అమ్మాయి, ఓ అబ్బాయి మధ్య ప్రేమ ఎలా పుడుతుంది? ఇదే స్టార్‌ మా సరికొత్త సీరియల్ కథ. అదే "నువ్వు నేను ప్రేమ". ఇద్దరి మధ్య శత్రుత్వం సంధించే చాలా కష్టమైన ప్రశ్నలకు అర్ధవంతమైన సమాధానాలు ఇవ్వబోతోంది ఈ  సీరియల్ "నువ్వు నేను ప్రేమ".

జీవితాన్ని ఆస్వాదించాలి అనుకునే అమ్మాయి, జీవితం అంటే డబ్బు సంపాదించడమే అనుకునే అబ్బాయికి మధ్య ఒక బంధం ఏర్పడితే వాళ్ళ జీవితం ఎలా ఉంటుంది అనేదే సింపుల్ గా ఈ సీరియల్ కథ. విభిన్నమైన మనస్తత్వాల మధ్య మొదలయ్యే సంఘర్షణ ఎటు దారితీస్తుందో తెలియని ప్రయాణం చేస్తున్న ఇద్దరి మనుషుల కథ ఇది. స్టార్ మా లో ఈరోజు సాయంత్రం 06.30 గంటలకు ఈ సీరియల్ ప్రారంభం అవుతుంది.ప్రతివారం సోమవారం నుంచి శనివారం వరకు ఈ సీరియల్ బ్రాడ్ కాస్ట్‌ అవుతుంది.
(అడ్వర్టోరియల్‌)

"నువ్వు నేను ప్రేమ" ప్రోమో👇

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement