
కార్తీకదీపం.. ప్రస్తుతం బుల్లితెరను ఏలుతున్న ఈ సీరియల్ అత్యధిక టీఆర్‌పీ రేటింగ్‌తో దూసుకుపోతోంది. ప్రస్తుతం 1057వ ఎపిసోడ్‌కు చేరుకున్న ఈ ధారా వాహిక ఎన్నో ట్వీస్ట్‌లతో ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచి టీవీలకే అతుక్కుపోయేలా చేస్తుంది. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు ఈ సీరియల్‌కు అభిమానులు అయిపోయారు. అంతగా ప్రేక్షక ఆదరణ పొందిన ఈ సీరియల్.. లీడ్ పాత్రల మధ్య గొడవలు పెట్టించి గత రెండున్నారేళ్లుగా వారిని కలపకుండా థీమ్ దర్శకుడు సాగతీస్తున్నాడు.
‘అబ్బబ్బా.. ఇదేం సీరియల్‌రా బాబూ.. ఇలా సాగదీస్తున్నారు. ఇక వంటలక్క, డాక్టర్ బాబును కలిపేయచ్చు కదా, ఆ వంటలక్కను ఇంకేన్నాళ్లు బాధపెడతారు’ అంటూ అందరు డైరెక్టర్‌పై మండపడ్డారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఆయన కనిపిస్తే కొట్టేయాలన్నంతా కసితో నెటిజన్లు కామెంట్స్ పెట్టెవాళ్లు. అంతలా సీరియల్‌పై విసుగు తెప్పించిన డైరెక్టర్ ఒక్కసారిగా అనుకోని ట్వీస్టులతో సీరియల్‌ను రక్తికట్టించాడు. అయితే ఈ సీరియల్‌ని అభిమానించేవాళ్లు ఎంతమంది ఉన్నారో తిట్టుకుంటూ చూసేవాళ్లు కూడా అంతేమంది ఉన్నారు. అయితే కార్తీక్‌దీపం డైరెక్టర్ ఎవరనేది ఇప్పటికి చాలా మందికి తెలియదు.
తాజాగా ఈ సీరియల్ ఫేం ప్రేమి విశ్వనాథ్(దీప) దర్శకుడు కాపుగంటి రాజేంద్రతో కలిసి దిగిన ఫొటోను షేర్ చేసింది. అది చూసిన బుల్లితెర ప్రేక్షకులు, నెటిజన్లు తమదైన శైలిలో డైరెక్టర్‌పై విరుచుకుపడుతున్నారు. ‘ఆ మహానుభావుడివి నువ్వేనా సామీ. అబ్బా సీరియల్‌ని ఏం తిప్పారు సర్ మీరు సూపర్. ఇంతవరకూ డాక్టర్ బాబు వంటలక్కని నమ్మలేదు.. ఇప్పుడు వంటలక్క డాక్టర్ బాబుని నమ్మదు.. ఇప్పుడు ఈ కథతో సీరియల్‌ను నడపబోతున్నారా?’ , ‘మళ్లీ మోనిత ప్రెగ్నెంట్ ట్విస్ట్ ఏంటి సారూ.. ఖచ్చితంగా రేటింగ్స్ పడిపోవడం ఖాయం’ అంటు కౌంటర్ ఇస్తున్నారు.
కాగా దర్శకుడు కాపుగంటి రాజేంద్ర గతంలో ‘అందం, బంగారు బొమ్మ’ వంటి సీరియల్స్‌తో పాపులర్ అయ్యాడు. ఇక ఆయన దర్శకత్వంలో పలు సినిమాలు కూడా వచ్చాయి. రవిరాజా పినిశెట్టి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన ఆయన.. మోహన్ బాబు ‘శివ్ శంకర్’, అల్లరి నరేష్ ‘రాంబాబు గాడి పెళ్లాం’ చిత్రాలకు దర్శకత్వం వహించాడు. ఆ సినిమాలు పెద్దగా ఆడకపోవడంతో కార్తీకదీపం సీరియల్‌తో మళ్లీ దర్శకత్వ బాధతల్ని చేపట్టి బుల్లితెరపై భారీ సక్సెస్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment