
సౌందర్య పిల్లపై కోపపడుతుంది. నా కొడుకు మిమ్మల్ని వదిలి వెళ్లిపోతాడని ఎలా అనుకున్నారే అంటు కాస్త కోపం చూపిస్తుంది. దీంతో హిమ, శౌర్యలు సారీ చెబుతారు. ఆ తర్వాత పిల్లలు నాన్న, అమ్మ ఇద్దరు అసలు సరిగా ఉండటం లేదని చెప్పడంతో సౌందర్య పిల్లలకు అర్థమయ్యే భాషలో వారి మధ్య ఉన్న సమస్య గురించి వివరిస్తుంది. మీ అమ్మకు నాన్నకు మధ్యలో కాలుష్యం ఉందని, అది తొలగిపోతే అంతా సంతోషమే అంటు చెప్పు కొస్తుంది. తర్వాత పిల్లల్ని గుండెలకు హత్తుకుని. ‘మీ అమ్మని ఎంత ఖర్చు అయినా సరే బతికించుకుని తీరాలి’ అని తనలో తనే అనుకుంటు కన్నీరు పెట్టుకుంటుంది సౌందర్య.
ఇదిలా ఉండగా డాక్టర్ ద్వారా నిజం తెలుసుకున్న కార్తీక్.. కారు డ్రైవ్ చేస్తూ వెళ్తూ.. డాక్టర్ చెప్పిన నిజం గురించి ఆలోచించుకుంటూ ఉంటాడు. మీరు అబద్దం అనేది నిజం.. మీరు నిజం అనుకునేదే అబద్దం.. ఈ నిజానికి అబద్దానికి మధ్య ఉన్న తేడా చెరిగిపోవాలంటే కావాల్సింది నా మీద నమ్మకమని దీప వాదించిన మాటలను, దీప నిప్పురా.. విహారీకి పిల్లలే పుట్టరని తెలిశాక ఇక దీప తప్పు లేనట్లే కదా అన్న సౌందర్య మాటలను గుర్తు చేసుకుంటూ కారు సడన్‌గా ఆపేస్తాడు. ఏడుస్తూ కారు దగ్గర దీప, అమ్మ ఎన్ని చెప్పిన నేను వినలేదు అంటూ పశ్చాత్తాప పడుతాడు కార్తీక్. దీప ఇల్లు వదిలి వెళ్లిపోయినప్పటి తర్వాత తనకు ఇద్దరు కవలలు పుట్టారనే నిజం తెలుసుకున్న దీప, ఆ విషయాన్ని కార్తీక్‌తో సంతోషంగా చెప్పుకుంటుంది.
వారిని నీ కన్న బిడ్డలుగా అక్కున చేర్చుకొమ్మని వారిని అనాథలను చేయకండంటు కార్తీక్ కాళ్లు పట్టుకుని ఏడ్చిన సన్నివేశాన్ని గుర్తు చేసుకుంటాడు. ఆ తర్వాత కార్తీక్ ‘విహారి గాడితో ఇద్దరు పిల్లలను కని, వాడిని అన్న అని పిలిచేంతగా దిగాజారావా.. నీతి మాలిన దానా.. అవతలికి పో’ అంటు దీపను కాలితో తన్నిన ఆ సన్నివేశాన్ని తలచుకుంటు కుమిలిపోతాడు. అంతేగాక ‘మమ్మీ నేను తప్పు చేశాను మమ్మీ.. నువ్వు ఎంత చెప్పినా నమ్మకుండా దీపకు నరకం చూపించాను మమ్మీ.. చిత్రవధ చేశాను.. గాయపడిన మనసుకు మళ్లీ మళ్లీ ఎన్నో సార్లు గాయం చేశాను.. నిజంగా దీపా భూదేవి లాంటిదే మమ్మీ.. అది దీప కాబట్టి.. ఇంకా ఇంకా నన్ను ప్రేమిస్తోనే ఉంది. మారతానన్న నమ్మకంతోనే ఉంది’ అని ఏడుస్తూ చాలా మదనపడతాడు.
‘ఎంతో మంది పతివ్రతలు శీల పరీక్ష కోసం అగ్ని ప్రవేశం చేశారు.. అది ఒక్కసారే.. కానీ నేను పదేళ్లగా అగ్ని ప్రవేశం చేస్తూనే ఉన్నా డాక్టర బాబు’ అని దీప అన్న మాటల్ని తలుచుకుని ఏడుస్తూ అక్కడే కుప్పకూలిపోతాడు కార్తీక్. ‘దీపా.. ఎప్పటికైనా మీకు నిజం తెలుస్తుందని.. ఆ రోజు నీకంటే నేనే ఎక్కువ బాధపడతానని ఎన్నో సార్లు అన్నావ్.. అది నిజం దీపా.. నాకు నిజం తెలిసింది. కానీ ఈ నిజం నిప్పులా నా గుండెల్ని కాల్చేస్తుంది. నా అహంకారాన్ని బూడిద చేస్తోంది. నేను తప్పు చేశాను.. ఘోరమైన పాపం చేశాను.. అమానుషంగా ప్రవర్తించాను.. నిన్నే కాదు.. మన బిడ్డల్ని కూడా పరాయివాళ్లలా చూశాను.. నీ మాతృత్వాన్ని చాలా అవమానించాను.. ఏం చేస్తే.. ఈ పాపనికి ప్రాయశ్చిత్తం దొరుకుతుంది? నా చదువు, నా సంస్కారం, నా సర్వస్వం ఇవన్నీ ఎందుకు పనికి రాకుండా పోయాయని లోలోపల విలపిస్తాడు.
ఇవన్ని నన్ను పేదవాడ్ని చేశాయి దీప, ఉత్త చేతులతో నీ ముందు నిలబడతాను వస్తున్నాను దీపా.. నీ దగ్గరకు వస్తున్నాను’ అంటూ కార్తీక్ కారు స్టార్ట్ చేసి బయలుదేరతాడు. ఇక తరువాయి భాగంలో దీప కళ్లు తిరగిపడిపోవడం, తాను చనిపోతే డాక్టర్ బాబు మోనితను పెళ్లి చేసుకుంటాడా అత్తయ్యా అని దీప భయపడుతుంది. చిన్నప్పుడు నేను సవతి తల్లి దగ్గర పెరిగి నరకం చూశాను అత్తయ్యా.. నా బిడ్డలకు ఆ నరకం వద్దు అంటునే సోఫాలో కుప్పకూలిపోతుంది. ఆ తర్వాత కార్తీక్, పిల్లలు, సౌందర్య, మురళీ కృష్ణ దీపను లేపే ప్రయత్నం చేస్తారు. కానీ దీప లేవదు, కార్తీక్ నీళ్లు తాగించిన ఆ నీరు బయటకు రావడంతో కార్తీక్ షాకవుతున్నట్లు చూపిస్తారు. ఆ తర్వాత ఏమైందనేది రేపటి ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.
Comments
Please login to add a commentAdd a comment