
కార్తీకదీపం 10 మే: సౌందర్య సలహా మేరకు కార్తీక్ అసలు నిజం దీపకు చెప్పాలని నిర్ణయించుకుని డాక్టర్ భారతిని తన క్లినిక్‌కు పిలుస్తాడు. భారతితో దీపకు అసలు నిజం చెప్పే సమయం వచ్చిందనడంతో ఆమె షాక్ అవుతుంది. ఒక పెషేంట్‌తో స్వయంగా బ్రతకని చెప్పడం ప్రమాదం. డాక్టరుగా ఆ పని నువ్వు నేను ఇద్దరం చేయలేం అంటుంది. పెషేంట్ టెన్షనతో నరాలు చిట్లిపోతాయి, తట్టుకొలేరు దానివల్ల ఇంకా ప్రమాదమని భారతి కార్తీక్‌తో అంటుంది. కానీ దీప వినడం లేదు ఎంత వద్దని చెప్పినా పట్టుబట్టి వంటగదిలోనే ఉంటుంది. వంటచేస్తానంటోందని కార్తీక్ చెప్పడంతో.. అయితే చెప్పాల్సిందే అంటుంది భారతి.
దీంతో కార్తీక్ ఈ విషయం నువ్వే దీపతో చెప్పాలనడంతో భారతి కంగుతింటుంది. దీపతో నేను చెప్పడం కంటే నువ్వు చెప్పడమే కరెక్ట్ కార్తీక్ అంటుంది భారతి. నువ్వు చెప్తేనే ఇన్నాళ్లు నువ్వు అలా ప్రవర్తించడానికి కారణం దీప అర్థం చేసుకుందుటుందని, దీంతో మీ మధ్య ఉన్న మనస్పర్థలు తొలగిపోతాయని భారతి కార్తీక్‌తో చెబుతుంది. ఇక అక్కడి నుంచి భారతి మోనిత ఇంటికి వెళుతుంది. దానికంటే ముందు మోనిత సీరియస్‌గా దీప రీపోర్ట్స్ చూసి, ఆ తర్వాత అక్కడే ఓ పక్కన పెడుతుంది. భారతి రాగానే మోనితతో తలనొప్పిగా ఉందని, టీ కావాలంటుంది. ఒకే ఇప్పుడే తెస్తానంటూ టీ తీసుకురావడానికి వెళ్తుంది మోనిత.
ఆ తర్వాత భారతి పాపం ఇన్నాళ్లు మోనిత ఒంటరిగా ఉండటమంటే గ్రేట్ అంటు మనసులో అనుకుటుండగా.. ఇంతలో ఎదురుగా ఉన్న మెడికల్ రిపోర్ట్స్ ఫైల్ భారతి కంట పడతాయి. అవి వెళ్లి చూసేసరికి ఏంటి నా హాస్పిటల్ రిపోర్ట్స్‌లా ఉన్నాయి ఇక్కడికి ఎలా వచ్చాయని అనుకుంటు రిపోర్ట్స్‌తెరిచి చూసేసరికి భారతి షాక్ అవుతుంది. ‘దీప రీపోర్ట్స్ ఏంటి ఇక్కడ ఉన్నాయి, మరో కాపి తీసుకుని ఉంటుందా? అడిగితే నేనే ఇచ్చేదాన్ని కదా, ఈ రెడ్ మార్స్ ఏంటి, దీప వెనక మోనితా ఎమైనా కుట్ర చేస్తోందా’ అనుకుంటూ మోనితా రావడం గమనించి మళ్లీ అక్కడే పెట్టెస్తోంది. ఇక మోనిత టీ ఇవ్వగానే ఆలోచనలో పడుతుంది భారతి. ఏమైంది చెప్పు అంటూ భారతి నుంచి కార్తీక్ పిలిచిన విషయం గురించి ఆరా తీస్తుంది మోనిత.
దీంతో భారతి.. కార్తీక్ తన భార్య ఆరోగ్యంపై బాగా దిగులు పెంచుకున్నాడు. అంటూ జరిగిన విషయం చెబుతుంది. దీంతో నువ్వు నా ప్రేమకు సపోర్టు చేయకుండా భార్యభర్తులు ఇద్దరూ కలిసే సలహాలు ఇస్తావేంటని భారతిపై మోనిత మండిపడుతుంది. దీంతో ‘భార్య భర్త విషయం ప్రతిసారి నీతో మాట్లాడే కుసంస్కారం నాకు లేదని, ఇక నుంచి నీ ప్రేమకు నేను సాయం కాదు కదా కనీసం మద్దతు కూడా ఇవ్వనంటుంది. అంతేగాక దీప రిపోర్ట్స్ ఎందుకు ఇక్కడ ఉన్నాయని నిలదీస్తుంది. నీది ప్రేమ కాదు, ఉన్మామని, ఆ ఉన్మాదనం వల్ల నీకే ప్రమాదం జాగ్రత్త’ అంటూ మోనితను హెచ్చరించి అక్కడి నుంచి వెళ్లిపోతుంది భారతి. దీప తిరిగి శ్రీరాంనగర్ బస్తీకి వెళుతుంది. మళ్లీ డబ్బావాలాగా మారడం కాకుండా పెళ్లిళ్లకు, శుభాకార్యాలకు వంటలు చేయాలని నిర్ణయించుకుంటుంది. ఇక ఆ తర్వాత ఏం జరుగుతుందనేది రేపటి ఎపిసోడ్ తెలుసుకుందాం.
Comments
Please login to add a commentAdd a comment