సినిమా లేదా సీరియల్ షూటింగ్ చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. అన్ని సమకూర్చుకుని స్టూడియోల్లో షూటింగ్ చేస్తుంటారు. హైదరాబాద్‌లో చాలాచోట్ల ఇలానే జరుగుతుంటాయి. ముంబయిలో మాత్రం చిత్రీకరణలో పాల్గొంటున్న యాక్టర్స్ తెగ భయపడిపోతున్నారు. దానికి కారణం.. సెట్‌లోకి పాములు, కొండచిలువ, చిరుతల్లాంటివి ఎంట్రీ ఇస్తున్నాయి. ఇప్పుడూ అలాంటి సంఘటనే జరిగింది.
(ఇదీ చదవండి: 'బ్రో' ఫ్యాన్స్ అందరికీ బ్యాడ్ న్యూస్!)
ముంబైలోని గోరేగావ్ ఫిల్మ్ సిటీలో చిరుతపులి బీభత్సం సృష్టించింది. 'సుఖ్ మాంజే కాయ్ ఆస్తా' అనే మరాఠీ సీరియల్ షూటింగ్ మంగళవారం జరుగుతుండగా, సాయంత్రం 4 గంటల టైంలో చిరుతపులి సెట్‌లోకి వచ్చింది. చిన్న చిరుత పిల్లతో కలిసి అటు ఇటు తిరుగుతూ యాక్టర్స్‌తో పాటు మిగతా అందరినీ భయపెట్టింది. దీంతో అక్కడున్న దాదాపు 200 మంది ప్రాణభయంతో పరుగెత్తారు. ఈ విషయాన్ని ఆల్ ఇండియన్ సినీ వర్కర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సురేష్ శ్యామ్‌లాల్ గుప్తా మీడియాకు చెప్పారు.
గత 10 రోజుల్లో ఇలా చిరుతలు సెట్ లోకి రావడం ఇది నాలుగోసారి అని సురేష్ శ్యామ్ లాల్ ఆందోళన వ్యక్తం చేశారు. గతంలోనూ ఈయన ఇదే విషయాన్ని చెప్పినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని.. ఇప్పుడు జరిగిన సంఘటనతో అర్థమవుతోంది. గతంలో ఇలానే 'అజుని' సీరియల్ షూటింగ్ జరుగుతుండగా చిరుతపులి వచ్చింది, 'గుమ్ హై కిసీ కే ప్యార్ మే' షో జరుగుతుండగా ఏకంగా కొండచిలువ ప్రత్యక్షమైంది. ఇలా వరస సంఘటనలు జరుగుతున్న నేపథ్యంలో ప్రతిఒక్కరూ బెదిరిపోతున్నారు.
#WATCH | A leopard, along with its cub, entered the sets of a Marathi TV serial in Goregaon Film City, Mumbai yesterday.
— ANI (@ANI) July 27, 2023
All Indian Cine Workers Association president Suresh Shyamlal Gupta says, "More than 200 people were present at the set, someone could have lost life. This… pic.twitter.com/m1YgSXARl6
(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి 22 సినిమాలు)
Comments
Please login to add a commentAdd a comment