ప్రభాస్ 'ఆదిపురుష్' సినిమా విడుదలై పదిరోజులు దాటిపోయింది. కలెక్షన్స్ డ్రాప్ అయ్యాయి. జనాలు ఈ చిత్రం గురించి మాట్లాడుకోవడం మెల్లగా తగ్గించేస్తున్నారు. కానీ వివాదాలు మాత్రం వదలట్లేదు. తాజాగా అలహాబాద్ హైకోర్ట్ చిత్రబృందంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. డైలాగ్స్ విషయంలో అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇదలా ఉండగానే 'రామాయణ్' మరోసారి విడుదలకు సిద్ధమైంది. డేట్ కూడా ఫిక్స్ చేస‍్తూ అధికారికంగా ప్రకటించారు.
వివాదాలే వివాదాలు!
'ఆదిపురుష్' సినిమాని రామాయణంలోని అరణ్యకాండ, యుద్ధకాండ ఆధారంగా తీశారు. టీజర్ విడుదలైనప్పుడు రావణుడి గెటప్ వల్ల విపరీతంగా విమర్శలు వచ్చాయి. దీంతో ట్రైలర్స్ లో అతడిని అస్సలు చూపించలేదు. థియేటర్లలోకి సినిమా వచ్చిన తర్వాత రావణుడి కంటే.. గ్రాఫిక్స్, డైలాగ్స్ కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్ అయిపోయాయి. ఇది కాదన్నట్లు డైలాగ్ రైటర్ మనోజ్.. 'ఈ సినిమా రామాయణం కాదు', 'హనుమంతుడు దేవుడు కాదు' లాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల‍్లో నిలిచారు.
(ఇదీ చదవండి: ప్రభాస్ 'ప్రాజెక్ట్- కె'.. ఆ విషయంలో ఆదిపురుష్‌ను దాటేయనుందా?)
'రామాయణ్' మరోసారి
మనోభావాలు దెబ్బతీసే విధంగా వ్యాఖ్యలు చేశాడని 'ఆదిపురుష్' డైలాగ్ రైటర్ మనోజ్‌ని చంపేస్తామని కొందరు బెదిరించారు. రామాయణాన్ని వక్రీకరించి ఈ సినిమా తీశారని కొందరు కేసు వేశారు. ఇలా 'ఆదిపురుష్' సినిమాపై లెక్కలేనంత నెగిటివిటీ వచ్చింది. ఈ క్రమంలోనే దయానంద్ సాగర్ 'రామాయణ్' సీరియల్ ని మరోసారి టీవీల్లో స్ట్రీమింగ్ చేసేందుకు సిద్ధమయ్యారు.
ప్రతిరోజూ రాత్రి!
బాక్సాఫీస్ దగ్గర 'ఆదిపురుష్' కాస్త తగ్గిన నేపథ్యంలో 'రామాయణ్' సీరియల్ ని ఆ ఛానెల్ లో జూలై 3 నుంచి ప్రతిరోజూ రాత్రి 7:30 గంటలకు ప్రసారం చేయనున్నట్లు ప్రకటించారు. గతంలో పలుమార్లు ఈ సీరియల్ రీ రిలీజ్ చేస్తే ప్రేక్షకులు చాలా బాగా ఆదరించారు. లాక్‌డౌన్‌లోనూ ప్రసారం చేస్తే అప్పుడు విశేషాదరణ దక్కింది. 'ఆదిపురుష్' ఎఫెక్ట్ నేపథ్యంలో ఇప్పుడు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందనేది చూడాలి?
(ఇదీ చదవండి: 'విరూపాక్ష' డైరెక్టర్‌కి కాస్ట్‌లీ కారు గిఫ్ట్.. ఎన్ని లక్షలో తెలుసా?)
Comments
Please login to add a commentAdd a comment