
భవిష్యత్తు ఎన్నో కలలను చూపిస్తుంది. ఎన్నో ఆశలను నేర్పిస్తుంది. ఏదో సాధించగలమన్న నమ్మకాన్ని ఇస్తుంది. ఈ కథతో స్టార్ మా ప్రారంభిస్తున్న సరికొత్త సీరియల్ "పలుకే బంగారమాయెనా". పుట్టుకతోపరాజితులే గానీ పట్టుదలతో ఇద్దరూ విజేతలుగా ఎలానిలబడ్డారు అనే విలక్షణ మైన కథ తో ఆగష్టు 21 నుంచి మ.1.30 గంటలకు స్టార్ మా ప్రేక్షకులను అలరించబోతోంది ఈ సీరియల్.
‘గెలుపే గమ్యమైన ఇద్దరి ప్రయాణం లో ఎన్ని మలుపులు, ఎన్నిమజిలీలు ఉంటాయో.. ఎన్ని అవరోధాలు, అడ్డంకులు ఉంటాయో చెప్పిన ఇన్స్పిరేషనల్ స్టోరీ ఇది. ఏదో సాధించాలనేతపన ఉన్నా తన లోపం వల్ల ఆమె ముందడుగు వేయలేనినిస్సహాయ పరిస్థితి. అయితే, ఆమె జీవితం లోకి అతని రాక ఒకమలుపు కాదు.. అనుకోని మజిలీ. అతని ప్రేమ, ప్రేరణ ఆమెఆశయాన్ని ప్రతిక్షణం కంటికి రెప్పలా కాపాడాయి. పెంచి పెద్దచేసాయి. అతని సహాయ సహకారాలు ఈ అమ్మాయి అనుకున్నఉన్నత స్థానానికి ఎలా తీసుకువెళ్లాయి అనేది "పలుకేబంగారమాయెనా" కథ’ అని సీరియల్ బృందం పేర్కొంది.