
బుల్లితెరపై కార్తీక దీపం సీరియల్‌కు ఉన్న క్రేజ్ గురించి అందరికి తెలిసిందే. ఇంటిల్లిపాదికి వినోదాన్ని పంచుతున్న ఈ సీరియల్ ఇప్పటికే వందల ఎపిసోడ్లను పూర్తిచేసుకుంది. తాజాగా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ప్రముఖ నటుడు వెన్నెల కిషోర్ ఈ సీరియల్‌కి సంబంధించి ట్విటర్‌లో ఓ పోస్ట్ చేశాడు. ‘ఎందుకమ్మా అంత మంచి డాక్టర్ బాబుకి ఇంత మంచి వంటలక్క అంటే కోపం’ అని ఓ డైలాగ్‌ను ప్రస్తావించాడు. దీంతో ఆ ట్వీట్ కొద్ది సేపట్లోనే వైరల్‌గా మారింది. కిషోర్ ట్వీట్‌పై ‘స్టార్ మా’ చానల్ కూడా స్పందించింది. (నెపోటిజమ్‌కు కేరాఫ్‌గా సడక్-2 )
‘త్వరలోనే డాక్టర్ బాబు వంటలక్క మంచితనాన్ని అర్ధం చేసుకుంటారని కోరుకుందాం కిషోర్ గారు’ అంటూ ట్వీట్ చేసింది. కాగా, 'స్టార్ మా'లో ప్రసారమయ్యే కార్తీక దీపం సీరియల్‌కు చాలా మంది ప్రముఖులు సైతం అభిమానులున్న సంగతి తెలిసిందే. (ఈ రెండింటిలో.. ఏ ఫొటోలో కంగన బాగుంది!? )
త్వరలోనే డాక్టర్ బాబు వంటలక్క మంచితనాన్ని అర్ధం చేసుకుంటారని కోరుకుందాం కిషోర్ గారు 😀😀#KarthikaDeepam #StarMaaSerials https://t.co/SL31NmTdM8
— starmaa (@StarMaa) July 2, 2020
Comments
Please login to add a commentAdd a comment