
సాగర్‌లో టీవీ సీరియల్ షూటింగ్
నాగార్జునసాగర్,న్యూస్‌లైన్ : మల్లెబాల బ్యానర్‌పై నిర్మిస్తున్న ‘మనసు-మమత’ డెయిలీ తెలుగు టీవీ సీరియల్ షూటింగ్ శనివారం నాగార్జున సాగర్‌లో జరిగింది.
దీనికి అనిల్‌కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. నటీనటులు ప్రీతం-లలిత, నాగార్జున-శృతిలపై పలు సన్నివేశాలను సాగర్ కొత్త బ్రిడ్జి, శివాలయం, పాతబ్రిడ్జి, లాంచీ స్టేషన్ ప్రాంతాల్లో చిత్రీకరించారు. అసిస్టెంట్ డెరైక్టర్ కృష్ణ, కో-డెరైక్టర్లు శ్రీను, వాసు తదితరులు పాల్గొన్నారు.