టీవీ నటి టవల్‌ డ్యాన్స్‌.. ఊహించని ట్విస్ట్‌! | Shraddha Arya recently shared a throwback video | Sakshi
Sakshi News home page

Published Tue, Mar 20 2018 5:29 PM | Last Updated on Tue, Mar 20 2018 5:29 PM

Shraddha Arya recently shared a throwback video - Sakshi


న్యూఢిల్లీ: ‘కుండలి భాగ్య’.. ఇప్పుడు హిందీ టీవీ చానెళ్లలో టాప్‌ టీఆర్‌పీ రేటింగ్‌ ఉన్న సీరియల్‌. సీరియల్‌ క్వీన్‌ ఏక్తా కపూర్‌ నిర్మాణ సారథ్యంలో వస్తున్న ఈ సీరియల్‌ చాలా పాపులర్‌ అయింది. ఇంతకముందు సూపర్‌ పాపులార్‌ అయిన ‘‘కుమ్‌కుమ్‌ భాగ్య’ సీరియల్‌ నుంచి కాన్సెప్ట్‌ను డెవలప్‌ చేసి ‘కుండలి భాగ్య’ సీరియల్‌ను తీసుకురావడం.. హిందీ సీరియళ్లలో ఒక కొత్త ఐడియాకు తెరలేపినట్టు అయింది. ఇప్పుడీ సీరియల్‌ గురించి ఉపోద్ఘాతం ఎందుకంటే.. ఈ సీరియల్‌తో బాగా పాపులర్‌ అయిన శ్రద్ధ ఆర్య గురించి చెప్పుకోవడానికే.

‘కుండలి భాగ్య’ సీరియల్‌తో లైమ్‌లైట్‌లోకి వచ్చిన శ్రద్ధ ఆర్య ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పాత వీడియో షేర్‌ చేసుకుంది. ఈ వీడియోలో శ్రద్ధతోపాటు ఆమె స్నేహితులు టవల్‌ కట్టుకొని... రాణి ముఖర్జీ, ప్రీతి జింటా పాట ‘పియా పియా’కు స్టెప్పులు వేశారు. ప్రారంభంలో చూడటానికి ఈ వీడియో క్యూట్‌గా అనిపించినప్పటికీ అంత అనుకున్నట్టు సాగలేదు. ముగ్గురు దగ్గరగా ఉండి.. స్టెప్పులు వేస్తుండటంతో సమన్వయం కొరవడి.. ఒక డ్యాన్సర్‌ చేయి.. గట్టిగా శ్రద్ధ కంటికి తగిలింది. దీంతో తను బాధతో అరవడం.. ఆమె స్నేహితులు కూడా షాక్‌ తినడం వీడియోలో కనిపించింది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్‌ అవుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement