గిరి దాటని ‘ఖాకీ’లు | Police People Not Interested Transfers In Ramagundam | Sakshi
Sakshi News home page

గిరి దాటని ‘ఖాకీ’లు

Published Thu, Oct 3 2019 11:08 AM | Last Updated on Thu, Oct 3 2019 11:14 AM

Police People Not Interested Transfers In Ramagundam - Sakshi

రామగుండం పోలీస్‌ కమిషనరేట్‌ కార్యాలయం

సాక్షి, రామగుండం: రామగుండం పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలోని కొన్ని పోలీస్‌స్టేషన్లలో పనిచేసే కొందరు ‘ఖాకీ’లు రెండుమూడు ఠాణాల పరిధిలోనే దీర్ఘకాలికంగా గిరిదాటకుండా విధులు నిర్వహిస్తున్నారు. ఒక ఠాణాలో పనిచేస్తూనే మరొక ఠాణాలో అటాచ్డ్‌గా.. విధులను అదనంగా నిర్వహిస్తున్నారు.  వీరిలో కొందరు పోలీసుల క్రిందిస్థాయి సిబ్బంది..  ఈ అటాచ్డ్‌ విధుల కోసం ప్రత్యేకంగా ఆయా ఠాణాల్లోనే అటాచ్డ్‌ విధులను కొనసాగిస్తున్నారు. ఆ కొందరికి మాత్రమే ఈ అటాచ్డ్‌ విధులను అప్పగించడం వెనుక ఆంతర్యమేమిటో అని మిగతా పోలీస్‌ సిబ్బంది చెవులు కొరుక్కుంటున్నారు. కొద్ది రోజుల క్రితం కమిషనరేట్‌ పరిధిలో పోలీసుల బదిలీలు అనేకం జరిగినప్పటికీ.. ఆ కొందరు మాత్రం యథావిధిగా ఆయా ఠాణాల్లోనే బదిలీలు లేకుండా, కాకుండా ఎప్పటిలాగే విధులు నిర్వర్తిస్తున్నారు. అనేక మంది పోలీస్‌ సిబ్బంది పలు పోలీస్‌స్టేషన్లకు బదిలీలు అయినా ఆ వారు మాత్రం బదిలీలు వచ్చినప్పటికీ, బదిలీ కాకపోవడం వెనుక మతలబు ఏమిటో అంతుచిక్కడం లేదు.

రాజకీయంలో జోక్యం.. 
కమిషనరేట్‌ పరిధిలోని కొందరు పోలీస్‌ సిబ్బంది రాజకీయ పలుకుబడితో తమకు నచ్చిన ఠాణాలకు బదిలీ చేయించుకుంటున్నారనే ఆరోపణలు సైతం వినవస్తున్నాయి. అదేవిధంగా మరి కొంతమంది పోలీసులు విధులు నిర్వర్తిస్తున్న పోలీస్‌స్టేషన్‌లోనే కొనసాగేలా రాజకీయ పలుకుబడి ఉపయోగిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఏదిఏమైనా దీర్ఘకాలంగా పనిచేసే కొందరు సిబ్బందిని, అదేవిధంగా చాలా రోజులుగా ఒక ఠాణాలో పనిచేస్తూ మరొక ఠాణాలో అటాచ్డ్‌గా విధులు నిర్వర్తించే వారిపై సైతం ఉన్నత స్థాయి పోలీస్‌ అధికారులు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. 

దీర్ఘకాలికంగా ఒకే చోట విధులు.. 
రామగుండం కమిషనరేట్‌ పరిధిలో ముఖ్యంగా కమిషనరేట్‌ ఉన్న ప్రాంతంలోని రెండు ఠాణాల్లో పని చేసే కొందరు కిందిస్థాయి పోలీస్‌ సిబ్బంది దీర్ఘకాలికంగా ఒకే చోట విధులు నిర్వర్తిస్తున్నారనే ఆరోపణలు వినవస్తున్నాయి. రెండు సంవత్సరాలకు ఒకసారి పోలీసులు బదిలీలు జరుగుతున్పప్పటికీ కొందరు మాత్రం ఆయా ఠాణాల్లో పనిచేస్తూ ఇక్కడిక్కడే మరొక ఠాణాలో అటాచ్డ్‌గా పనిచేస్తున్నారు. ఆ కొందరి సిబ్బందికి అడ్డూ.. అదుపు లేకుండా ఇక్కడిక్కడే ఏళ్లతరబడి పనిచేస్తున్నారు.  

95 శాతం బదిలీలు..  
ఇటీవల జరిగిన పోలీసుల బదిలీల్లో రామగుండం పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో 95 శాతం సిబ్బందికి బదిలీలు అయ్యాయి. జిల్లా మొత్తంలో పదుల సంఖ్యలో మాత్రమే బదిలీలు ఆగాయి. ఇటీవల జరిగిన గణేశ్, నవరాత్రోత్సవాలు, మొహర్రం పండుగల నేపథ్యంలో ఆయా సిబ్బంది స్టేషన్లలో విధుల నిమిత్తం ఉంచడం జరిగింది. కొంత మందికి మాత్రం కుటుంబసభ్యులు అనారోగ్యం కారణంగా, త్వరలో పదవీ విరమణ పొందే వారికి మాత్రం బదిలీలు ఆపే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ డివిజన్‌ నుంచి మరో డివిజన్‌కు బదిలీ చేశాం. దీర్ఘకాలికంగా ఒకే చోట అటాచ్డ్‌గా ఎక్కువ కాలం విధులు నిర్వహిస్తున్న వారిపై దృష్టి సారిస్తాం. ప్రజలకు ఇబ్బంది కలిగించే వారిపై చర్యలు తీసుకుంటాం. దీర్ఘకాలంగా కొనసాగుతున్న సిబ్బందిని గుర్తించి బదిలీ అయ్యేలా చూస్తాం.  – టి.సుదర్శన్‌గౌడ్, పెద్దపల్లి డీసీపీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement