సింగరేణి: 6 ఏళ్లు, 14 వేల ఉద్యోగాలు | 14 Thousand Youth Employed In Singareni Collieries Company | Sakshi
Sakshi News home page

సింగరేణికి యువరక్తం: ఆరేళ్లలో వేలాది మంది చేరిక

Published Sun, Apr 4 2021 8:08 PM | Last Updated on Sun, Apr 4 2021 8:08 PM

14 Thousand Youth Employed In Singareni Collieries Company - Sakshi

వారసత్వ ఉద్యోగాలు అందుకుంటున్న కార్మికుల పిల్లలు

సాక్షి, గోదావరిఖని(రామగుండం): రాష్ట్రంలో అతిపెద్ద ప్రభుత్వరంగ సంస్థ సింగరేణిలో యువరక్తం ఉరకలేస్తోంది. తండ్రుల మెడికల్‌ ఇన్‌వ్యాలిడేషన్, డిపెండెంట్‌ ఉద్యోగాలతో యువత పెద్ద ఎత్తున సంస్థలో చేరుతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గడిచిన ఆరేళ్లలో 14 వేలకుపైగా యువకులు సంస్థలో ఉద్యోగాలు సాధించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో నడుస్తున్న సింగరేణి సంస్థలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తీసుకున్న నిర్ణయంతో మెడికల్‌ ఇన్‌వ్యాలిడేషన్‌కు అనుమతిస్తున్నారు. 2014లో వారసత్వ ఉద్యోగాల పేరుతో సింగరేణిలో భర్తీ కొనసాగినప్పటికీ కొందరు దీనిపై హైకోర్టుకు వెళ్లడంతో నిలిచిపోయింది. 2018, మార్చి 9న సంస్థలో తిరిగి కారుణ్య నియామకాల పేరుతో సింగరేణి వారసులకు ఉద్యోగాల భర్తీ పక్రియ ప్రారంభమైంది. మహిళా కారి్మకులకు కూడా సింగరేణి సంస్థలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది.

ఆరేళ్లలో 11,051 మంది..
సంస్థ వ్యాప్తంగా 41,557 మంది కార్మికులు పనిచేస్తుండగా అందులో 11,051 మంది యువ కారి్మకులు కారుణ్య నియాకాల ద్వారా ఉద్యోగాల్లో చేరారు. సింగరేణి సంస్థ ఆరేళ్లలో 68 మెడికల్‌ బోర్డులు నిర్వహించి అనారోగ్య కారణాలతో ఉద్యోగం చేయలేని కారి్మకులను అన్‌ఫిట్‌ చేసి వారి స్థానంలో వారసులకు ఉద్యోగాలను కల్పించింది. అలాగే ఎక్స్‌టర్నల్‌ నోటిఫికేషన్ల ద్వారా 3,101 మంది సింగరేణి ప్రభావిత జిల్లాలకు చెందిన నిరుద్యోగులు ఉద్యోగాలు సాధించారు. సంస్థలో ఉద్యోగుల వయోభారం పెరుగుతుండగా, రాష్ట్ర ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయంతో సింగరేణి కుటుంబాల్లో యువతకు ఉద్యోగాలు లభించడం వరంగా మారింది.

గతంతో బొగ్గు గనుల్లో కేవలం పురుషులకే అవకాశం ఉండగా, తాజాగా సింగరేణిలో కారి్మకులు ఆడపిల్లలకు కూడా ఉద్యోగావకాశం కలి్పస్తూ నిర్ణయం తీసుకోవడంతో మహిళా ఉద్యోగుల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు సైతం సింగరేణి వైపు దృష్టి సారించారు. క్వార్టర్, వైద్యం, సంక్షేమం.. ఇలా పలు విధాలుగా సింగరేణి సౌకర్యాలు కలి్పస్తుండటంతో సంస్థలో చేరేందుకు అనేకమంది ఆసక్తి కనబర్చుతున్నారు. అలాగే ప్రభుత్వరంగ సంస్థల్లో ఎక్కడా లేనివిధంగా లాభాల్లో ఉద్యోగులకు వాటా చెల్లిస్తుండటంతో అనేకమంది సింగరేణిపైపు చూస్తున్నారు. సంస్థ తాజాగా ఉద్యోగాల భర్తీకి ఎక్స్‌టర్నల్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది.

184 మంది మహిళా ఉద్యోగులు.. 
గతంతో బొగ్గు గనుల్లో పురుషులకే వారసత్వ ఉద్యోగాలు ఇచ్చేవారు. తాజాగా సింగరేణిలో కార్మికుల కూతుళ్లకు కూడా వారసత్వ ఉద్యోగాలు ఇస్తున్నా రు. కారుణ్య నియామకాలకింద ఇప్పటి వరకు 184 మంది మహిళలు ఉద్యోగం పొందారు.

ఎక్స్‌టర్నల్‌ నోటిఫికేషన్‌ ద్వారా 3,101 మందికి
సింగరేణì యాజమాన్యం ఎక్స్‌టర్నల్‌ నోటిఫికేషన్‌ ద్వారా 3,101 మంది నిరుద్యోగులకు ఉద్యోగావశాలు కలి్పంచింది. 2014 నుంచి 2020 వరకు 47 ఎక్స్‌టర్నల్‌ నోటిఫికేషన్లు జారీ చేసి రాత పరీక్ష ద్వారా అర్హులకు ఉద్యోగాలు కలి్పంచింది. తెలంగాణలో బొగ్గు గనులు విస్తరించి ఉన్న ఉమ్మడి జిల్లాల నిరుద్యోగ యువతకు ఈ నోటిఫికేషన్లలో అవకాశం కలి్పంచారు. పరీక్షలు నిర్వహించిన రోజునే ఫలితాలు వెల్లడించి పైరవీలకు తావు లేకుండా ఉద్యోగాల పక్రియ నిర్వహించారు.

ఉద్యోగం రావడం సంతోషంగా ఉంది..
సింగరేణిలో ఉద్యోగం రావడం సంతోషంగా ఉంది. నాన్న మెడికల్‌ ఇన్‌వ్యాలిడేషన్‌ ద్వారా కారుణ్య నియామకం కింద సింగరేణిలో ఉద్యోగం లభించింది. సంస్థ అభివృద్ధి కోసం అహరి్నశలు శ్రమిస్తా. 
– పులిపాక సతీశ్, గోదావరిఖని

బాధ్యతగా భావిస్తా.. 
మామయ్య ఉద్యోగం నాకు వచి్చంది. మెడికల్‌ ఇన్‌వ్యాలిడేషన్‌ ద్వారా దిగిపోవడంతో కూతురిని ఇచ్చి ఉద్యోగం పెట్టించాడు. మైనింగ్‌ డిప్లొమా పూర్తి చేసిన నాకు, చదువుకు తగిన ఉద్యోగం లభించింది. సంస్థలో ఉద్యోగం సాధించడం బాధ్యతగా భావించి అభివృద్ధిలో పాలు పంచుకుంటా.  
– ముత్యాల పవన్‌కల్యాణ్, తురకలమద్దికుంట, పెద్దపల్లి

చదవండి: చేయని తప్పునకు గల్ఫ్‌లో జైలు పాలై..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement