
సాక్షి, పెద్దపల్లి : సింగరేణి బొగ్గు గనిలో ప్రమాదం చోటుచేసుకుంది. రామగుండం డివిజన్ పరిధిలోని వకీల్‌పల్లి భూగర్భ బొగ్గు గనిలో జంక్షన్ కూలిపోవడంతో ఈ ప్రమాదం సంభవించింది. గురువారం సాయంత్రం 66 లెవెల్‌లో 41 డీప్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు కార్మికులు గల్లంతు అయ్యారు. సమాచారం అందుకున్న సింగరేణి యాజమాన్యం సహాయక చర్యలు చేపట్టింది. అయితే స్థానిక అధికారుల ద్వారా ప్రమాదం నుంచి ముగ్గురు కార్మికులు తప్పించుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం రావాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment