
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రం మంగళవారం మండిపోయింది. అత్యధికంగా రామగుండంలో 44.8డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఆదిలాబాద్‌లో 43.8డిగ్రీలు నమోదైంది. ఇతర ప్రాంతాల్లోనూ అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కాగా, తూర్పు మధ్యప్రదేశ్ నుంచి విదర్భ, తెలంగాణల మీదుగా రాయలసీమ వరకు సగటు సముద్ర మట్టం నుంచి 0.9 కిలోమీటర్ల వద్ద ఉపరితల ద్రోణి ఏర్పడింది.
దీంతో బుధ, గురువారాల్లో రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అలాగే రాగల మూడు రోజులు అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది.