సాక్షి, హైదరాబాద్: చలి పులి పంజా విసురుతోంది. రాష్ట్రంలో గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా పతనమవుతున్నాయి. నాలుగైదు రోజులుగా కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా నమోదవుతున్నాయి. గురువారం నాటి ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే ఖమ్మంలో 33.4 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా, కనిష్ట ఉష్ణోగ్రత మెదక్‌లో 11 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యింది.
చాలాచోట్ల సాధా రణ ఉష్ణోగ్రతల కంటే 4 నుంచి 5 డిగ్రీల మేర తక్కువగా నమోదు కావడం రాష్ట్రంలో చలి తీవ్రతను స్పష్టం చేస్తోంది. రా నున్న మూడు రోజులు ఉష్ణోగ్రతలు మరింత తక్కువగా నమోదయ్యే అవకాశాలున్నాయని, తగు జాగ్రత్తలు పాటించాలని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అంతటా తక్కువే..
ప్రస్తుతం సీజన్‌లో నమోదు కావాల్సిన సాధారణ ఉష్ణోగ్రతల కంటే చాలా తక్కువగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. సాధా రణ కనిష్ట ఉష్ణోగ్రతలతో పోలిస్తే గురు వారం హన్మకొండలో 4.4 డిగ్రీల సెల్సియస్ తక్కువగా నమోదైంది. మెదక్‌లో 4.9 డిగ్రీల సెల్సియస్, హైదరాబాద్‌లో 3.5 డిగ్రీల సెల్సియస్, నల్లగొండలో 3.3 డిగ్రీల సెల్సియస్ తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ఇక నిజామాబాద్, అదిలాబాద్, రామగుండంలోనూ సాధారణం కంటే రెండు డిగ్రీల మేర తక్కువ ఉష్ణోగ్రత నమోదయ్యింది. జాగ్రత్తగా ఉండాలి.. రాష్ట్రానికి ఈశాన్య దిశ నుంచి తక్కువ ఎత్తు లో వేగంగా గాలులు వీస్తున్నాయి. కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గడానికి తోడు ఈశాన్య దిశల నుంచి వచ్చే గాలులతో చలి తీవ్రత పెరుగుతోంది. ఈ పరిస్థితుల్లో వృద్ధులు జాగ్రత్తలు పాటించాలని వాతావరణ శాఖ సూచించింది. దూర ప్రయాణాలు చేసేవారు, దీర్ఘకాలిక వ్యాధులున్న వారు, హృద్రోగులు, గర్భిణులు, చిన్నపిల్లలు కూడా జాగ్రత్తగా ఉండాలని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment