రామగుండంలో 800 మెగావాట్ల పవర్‌ ప్లాంట్‌: భట్టి విక్రమార్క | Deputy Cm Bhatti Vikramarka Comments At Ramagundam Tour | Sakshi
Sakshi News home page

రామగుండంలో 800 మెగావాట్ల పవర్‌ ప్లాంట్‌: భట్టి విక్రమార్క

Published Sat, Aug 31 2024 2:56 PM | Last Updated on Sat, Aug 31 2024 3:04 PM

Deputy Cm Bhatti Vikramarka Comments At Ramagundam Tour

సాక్షి,పెద్దపల్లిజిల్లా: రామగుండంలో 800 మెగావాట్ల జెన్‌కో పవర్‌ప్లాంట్‌ ఏర్పాటు చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. శనివారం(ఆగస్టు31) భట్టి విక్రమార్క రామగుండం ప్రాంతంలో పర్యటించారు. పర్యటనలో భాగంగా రామగుండంలో ఇప్పటికే ఉన్న పాత జెన్‌కో పవర్‌ప్లాంట్‌ను పరిశీలించారు. 

ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ ‘భవిష్యత్తులో సింగరేణి సంస్థ, జెన్‌కో సహకారంతో పవర్‌ ప్లాంట్ ఏర్పాటు చేస్తాం. ఇక్కడ ఉన్న పాత ప్లాంటు 50 ఏళ్లుగా రాష్ట్రానికి వెలుగులు ఇచ్చింది. ఈ ప్రాంతంలో పర్యటించిన సమయంలో నేను ఇచ్చిన మాటకు అనుగుణంగా ఈ ప్రభుత్వంలో ప్లాంటు ప్రారంభించి మాట నిలబెట్టుకుంటా. వీలైనంత త్వరగా ప్లాంట్‌ నిర్మాణం ప్రారంభిస్తాం’అని భట్టి తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement