సాక్షి, రామగుండం: అతడు పుట్టు మూగ.. నాలుగేళ్ల రైల్వే రిక్రూట్‌మెంట్‌బోర్డు నిర్వహించిన పరీక్ష ద్వారా రైల్వేలో ఉద్యోగం సాధించాడు. రామగుండం రైల్వే రెగ్యులర్ ఓవర్‌హాలింగ్‌షెడ్డులో టెక్నికల్ అసిస్టెంట్‌గా చేరాడు. మూడేళ్ల క్రితం మూగ యువతినే వివాహమాడి ఆదర్శంగా నిలిచాడు. వీరికి కూతురు ఉంది. కరోనా నేపథ్యంలో భార్య, కూతురును పుట్టింటికి పంపించి విధులు నిర్వహిస్తున్నాడు. వ్యక్తి మూగ అయినా అందరితో కలిసి ఉండే అతడి హృదయం గురువారం విధినిర్వహణలోనే ఆగింది. వరంగల్ రూరల్ జిల్లా మడికొండకు చెందిన బండి రంజిత్‌కుమార్(35) గురువారం విధుల్లో ఉండగా గుండెలో నొప్పి రావడంతో కుప్పకూలిపోయాడు. తోటి ఉద్యోగులు రైల్వే డిస్పెన్సరీకి తరలించారు. పరిస్థితి విషమంగా ఉందనడంతో కరీంనగర్‌లోని ప్రైవేటుఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు.
రేపు కూతురు తొలి జన్మదిన వేడుకలు..
రంజిత్ కూతురు మొదటి పుట్టిన రోజు శనివారం ఉంది. కరోనా దృష్ట్యా పుట్టింటికి వెళ్లిన భార్య, కూతురును శుక్రవారం రామగుండం రావాలని ఫోన్‌చేసి చెప్పాడు. ఇంతలోనే గుండెపోటుతో మృతిచెందడంతో భార్య కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment