
ప్రతీకాత్మక చిత్రం
రామగుండం: గోదావరిఖని సీతానగర్‌లో కిరాణం షాప్ నిర్వహించే కురుము అనూష అనే గర్భిణిపై ఆదివారం అదే ప్రాంతానికి చెందిన దాసరి శ్రీకాంత్ అలియాస్ పింటూ అనే యువకుడు కత్తితో దాడికి యత్నించాడు. వన్‌టౌన్ పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. అనూషకు చెందిన కిరాణా షాపులో శ్రీకాంత్ సామాన్లు తీసుకెళ్లి వాటి మొత్తాన్ని చెల్లించే విషయంలో బాకీ పడ్డాడు. ఆదివారం షాపు దగ్గరికి వెళ్లి ఉద్దెర అడగగా పాత బాకీ చెల్లించకుండా ఇచ్చేది లేదని అనూష తేల్చిచెప్పింది.
దీంతో శ్రీకాంత్ కత్తి చూపించి తననే డబ్బు చెల్లించమని అడుగుతావా అంటూ బెదిరించడంతో బాధితురాలి భర్త శ్రీనివాస్ ఇంట్లో నుంచి బయటికి వచ్చి అడ్డుకున్నాడు. ఈ క్రమంలో జరిగిన తోపులాటలో ఆమె కిందపడడంతో స్వల్పగాయాలయ్యాయి. సంఘటనా స్థలానికి ఎస్సై ఉమాసాగర్ చేరుకొని విచారణ జరిపి బాధితుల ఫిర్యాదు మేర కు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment