
రామగుండం : మద్యానికి బానిసై జీవితంపై విరక్తి చెందిన ఓ యువకుడు తన చావుకు ఎవరూ కారణం కాదని చేతిపై రాసుకుని రైలు కిందపడి ఆత్మహత్యకు చేసుకున్నాడు. ఘటన రామగుండం జీఆర్పీ ఔట్‌పోస్టు ఇన్‌చార్జి పోపర్ల వేణుగోపాల్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. రామగుండం పట్టణంలోని మహబూబ్‌సూబాని నగర్‌కు చెందిన మహ్మద్ ఫిరోజ్ ఖాన్(30) కొద్ది రోజులు లారీ డ్రైవర్‌గా పనిచేశాడు. తర్వాత ఎలాంటి పనికి వెళ్లకుండా మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలో జీవితంపై విర క్తి చెంది పట్టణంలోని రైల్వే వంతెన సమీపంలోని కి.మీ.నెం.273/5 వద్ద గుర్తు తెలియని రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ద్విచక్ర వాహనంపై వచ్చి రైలు కింద పడినట్లు ఘటన స్థలాన్ని బట్టి తెలుస్తుంది. మృతుడి ఎడమ చేతిపై ‘నా చావుకు ఎవరు కారణం కాదు’ అని రాసుకున్నాడు. మృతుడి భార్య ఆసియాబేగం తొమ్మిది నెలల గర్భిణి. ఈ క్రమంలో ఇలాంటి అఘాయిత్యం చేసుకోవడంతో కుటుంబంలో విషాదం నెలకొంది. మృతదేహాన్ని గోదావరిఖని ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతుడి భార్య ఫిర్యాదు మే రకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు జీఆర్పీ ఇన్‌చార్జి తెలిపారు.