సాక్షి, హైదరాబాద్ : సింగరేణి రామగుండం ఓపెన్ కాస్ట్ గనిలో జరిగిన ప్రమాదంపై విచారణ జరిపించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. డైరెక్టర్ జనరల్ ఆఫ్ కోల్ మైన్స్ సేఫ్టీ అధికారులు తక్షణమే విచారణ జరిపి నివేదిక ఇవ్వాలన్నారు. మృతి చెందిన కార్మికులకు నష్టపరిహారం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.
సింగరేణిలో అధికారులకు ప్రైవేట్ ఓబీ కాంట్రాక్టర్లు అక్షయ పాత్రగా మారారని బండి సంజయ్ మండిపడ్డారు. సింగరేణి అధికారులు కాంట్రాక్టు కేటాయించి పనులపై పర్యవేక్షణ పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కమీషన్లకు కక్కుర్తి పడి నిబంధనలను గాలికి వదిలి వేయటంతోనే ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. సింగరేణిలో ఓబీ పనుల్లో అధికార పార్టీ నేతలు బినామీలతో కాంట్రాక్టు పనులు చేయిస్తున్నారని నిప్పులు చెరిగారు. సింగరేణి ప్రమాద విషయంలో కేంద్ర మంత్రులకు పిర్యాదు చేస్తానన్నారు. మృతి చెందిన కుటుంబాలకు కంపెనీలో ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. (ఓపెన్‌కాస్ట్ ప్రమాదం : వైఎస్ జగన్‌లా ఆదుకోవాలి)
Comments
Please login to add a commentAdd a comment