
సాక్షి, గోదావరిఖని : సోషల్ మీడియాలో తప్పుడు పోస్టింగ్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రామగుండం పోలీస్ కమిషనర్ వి.సత్యనారాయణ అన్నారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ సోషల్ మీడియాలో తప్పుడు పోస్టింగ్‌లు చేసిన ముగ్గురిపై కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. సోషల్ మీడియాను వేదికలుగా చేసుకొని వాట్సాప్, ఫేస్‌బుక్, ట్విట్టర్‌లలో కొందరు వ్యక్తులు ఇతర మతాలను కించపరిచేలా సందేశాలు అప్‌లోడ్ చేయడం, సమాజంలో పరువు ప్రతిష్ఠ కలిగిన వ్యక్తులు, వ్యవస్థలపై దుమ్మెత్తి పోయడం బురద చల్లడమే లక్ష్యంగా చెలరేగిపోతున్నారని అన్నారు. ప్రజలు సోషల్ మీడియాలో వచ్చే వదంతువులను నమ్మొద్దని కోరారు. పోస్ట్ చేసే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించి పోస్ట్ చేయాలని సీపీ సూచించారు.
ముగ్గురిపై కేసు
ప్రధాన మంత్రి నరేంద్రమోదీ గురించి తప్పుగా, కించపరిచేలా పోస్టింగ్ చేసిన ముగ్గురిపై కేసులు నమోదు చేసినట్లు సీపీ తెలిపారు. ధర్మారం పోలీస్‌స్టేషన్ ప రిధిలోని దొంగతురి్తకి చెందిన జుంజిపల్లి శంకరయ్య అలియాస్ శేఖర్, గోదావరిఖని టూటౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని యైటింక్లయిన్‌కాలనీకి చెందిన యాకుల తిరుపతియాదవ్, పెద్దపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఉయ్యంకర్ సాయి కిరణ్‌పై కేసు నమోదు చేశామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment