రామగుండం: అది పెద్దపల్లి జిల్లా రామగుండం రైల్వేస్టేషన్ ప్లాట్‌ఫాం.. ప్రయాణికులు ప్లాట్‌ఫాంపై ఉన్నారు. ఇంతలో ఓ వ్యక్తి ప్లాట్‌ఫాంపై నుంచి రైలుపట్టాలపైకి దూకాడు. ప్రయాణికులందరూ వద్దని వారి స్తున్నారు.. అంతలోనే బెంగళూరు వైపు వెళ్తున్న రాజధాని సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు రావడం.. అతడిని ఢీకొనడం.. క్షణాల్లో జరిగిపోయాయి. జీఆర్పీ ఔట్‌పోస్టు ఇన్‌చార్జి సురేశ్‌గౌడ్ కథనం ప్రకారం.. ఒడిశా రాష్ట్రం బాలేశ్వర్ జిల్లా కైరా గ్రామానికి చెందిన సంజయ్‌కుమార్ బెహ్రా (27) హైదరాబాద్‌లోని తన చిన్నాన్న ఇంట్లో ఉంటూ ఓ హార్డ్‌వేర్ షాపులో గుమాస్తాగా పనిచేసేవాడు.
మూడేళ్ల క్రితం మతిస్థిమితం కోల్పోగా.. కుటుంబసభ్యులు సొంత గ్రామానికి తీసుకెళ్లారు. చికిత్స ఇప్పించి తిరిగి హైదరాబాద్ పంపించారు. నాలుగురోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతున్న అతడు.. ఆదివారం ఉదయం ఆరుగంటలకు ఇంట్లో నుంచి రైలులో బయల్దేరాడు. రామగుండం రైల్వేస్టేషన్‌లో రైలుపట్టాలపైకి చేరాడు. అదే సమయంలో న్యూఢిల్లీ నుంచి వస్తున్న రాజధాని సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు ఎదురుగా నిలబడి ఆత్మహత్య చేసుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment