
లోక్‌సభ అభ్యర్థుల ఎంపికపై బీజేపీ కసరత్తు
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపికపై బీజేపీ కసరత్తు ప్రారంభిం చింది. పార్టీ నేతలు రెండు బృందాలుగా ఏర్పడి బుధవారమిక్కడ తెలంగాణకు చెందిన ఎనిమిది జిల్లాల కమిటీల నుంచి ప్రతిపాదిత అభ్యర్థుల పేర్లను సేకరించారు.
సాక్షి, హైదరాబాద్: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపికపై బీజేపీ కసరత్తు ప్రారంభించింది. పార్టీ నేతలు రెండు బృందాలుగా ఏర్పడి బుధవారమిక్కడ తెలంగాణకు చెందిన ఎనిమిది జిల్లాల కమిటీల నుంచి ప్రతిపాదిత అభ్యర్థుల పేర్లను సేకరించారు. పార్టీ నేతల ప్రాథమిక సమా చారం మేరకు అత్యంత గోప్యంగా జరుగుతున్న ఈ కసరత్తులో ఓ బృం దానికి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి నాయకత్వం వహిస్తుండగా, మరోబృందానికి బండారు దత్తాత్రేయ నాయకత్వం వహిస్తున్నారు.
కిషన్‌రెడ్డి, డాక్టర్ కె.లక్ష్మణ్, మంత్రి శ్రీనివాస్ బృందం ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో భేటీ అయి ఖమ్మం, కరీంనగర్, నల్లగొండ, ఆదిలాబాద్ జిల్లాల పేర్లను సమీక్షిం చింది. బండారు దత్తాత్రేయ, సీహెచ్ విద్యాసాగరరావు, నల్లు ఇంద్రసేనారెడ్డి, రవీంద్రరాజు బర్కత్‌పురా పార్టీ కార్యాలయంలో భేటీ అయి వరంగల్, నిజామాబాద్, మెదక్, మహబూబ్‌నగర్ జిల్లాల జాబితాను పరిశీలించారు. వీటి తర్వాత రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలలో పోటీ చేసే వారి జాబితాను ఖరారు చేయనున్నారు. పొత్తులు, ఎత్తులతో నిమిత్తం లేకుండా ఎ,బి కేటగిరీలుగా మొత్తం 17 లోక్‌సభ నియోజకవర్గాలకు అభ్యర్థుల జాబితాను రూపొందిస్తున్నారు.
డబ్బులుంటే టిక్కెట్లిస్తారా?
నిజామాబాద్ జిల్లా బాల్కొండ నేతలు పార్టీ నాయకుడు, ఎన్నికల కమిటీ సభ్యుడు మంత్రి శ్రీనివాస్‌పై స్థానిక నేతలు మండిపడ్డారు. డబ్బులున్నోళ్లకే టిక్కెట్లు ఇచ్చేటట్లయితే ఇక తామెందుకని ప్రశ్నించారు. ఇటీవలి వరకు టీఆర్‌ఎస్‌లో ఉండి ఎన్నికల వేళ పార్టీలో చేరిన సునీల్‌రెడ్డిని బాల్కొండ నియోజకవర్గ ఇన్‌చార్జిగా ఎలా నియమిస్తారని నిలదీశారు. దీంతో బిత్తరపోయిన మంత్రిశ్రీనివాస్ వారిని సముదాయించే ప్రయత్నం చేశారు.
14న సదస్సు, గడ్కరీ రాక
‘తెలంగాణ అభివృద్ధిలో బీజేపీ పాత్ర’ అనే అంశంపై పార్టీ లీగల్ సెల్ ఈనెల 14న హైదరాబాద్‌లో నిర్వహించే సదస్సు కు పార్టీ జాతీయ మాజీ అధ్యక్షుడు నితిన్‌గడ్కరీ హాజరవుతున్నట్టు కార్యవర్గ సభ్యుడు ఎన్.రామచంద్రరావు తెలిపారు.
ప్రాథమిక సమాచారం ప్రకారం పార్టీ నాయకత్వం సూచించిన పేర్లు ఇలా ఉన్నాయి!
ఎ-కేటగిరి : సికింద్రాబాద్: దత్తాత్రేయ, డాక్టర్ లక్ష్మణ్
మల్కాజ్‌గిరి : ఇంద్రసేనారెడ్డి, ఎన్.రామచంద్రరావు
మహబూబ్‌నగర్: నాగం జనార్దన్‌రెడ్డి
భువనగిరి : కె.ప్రతాప్‌రెడ్డి, ఇంద్రసేనారెడ్డి, శ్రీరాం
నిజామాబాద్: యెండల లక్ష్మీనారాయణ
కరీంనగర్ : సీహెచ్ విద్యాసాగరరావు, పి.మురళీధర్‌రావు, గుజ్జుల రామకృష్ణారెడ్డి
బి-కేటగిరి : చేవెళ్ల: బద్దం బాల్‌రెడ్డి, శైలేష్‌రెడ్డి, డాక్టర్ ప్రేంరాజ్
హైదరాబాద్ : సతీష్ అగర్వాల్, నంద బిలాల్ వ్యాస్, రాజాసింగ్
మెదక్ : సీహెచ్ నరేంద్రనాథ్
జహీరాబాద్ : ఆలే భాస్కర్, పటేల్,
పెదపల్లి : ఎస్.కుమార్, బోడ జనార్దన్
వరంగల్ : ఆర్.పరమేష్, చింతా సాంబమూర్తి,వి.జైపాల్
మహబూబాబాద్: కృష్ణవేణి నాయక్, చందా లింగయ్య దొర, ఉషాకిరణ్
ఖమ్మం : డాక్టర్ విజయ, కపిలవాయి రవీందర్
నల్లగొండ : వెదిరే శ్రీరాం, జి.మధుసూదన్‌రెడ్డి
నాగర్‌కర్నూల్ : శృతి, పుష్పలీల
ఆదిలాబాద్ : శ్రీ
రాం నాయక్