నేడు హైదరాబాద్‌కు నిర్మలా సీతారామన్
సాక్షి, హైదరాబాద్: కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత తొలిసారి శనివారం హైదరాబాద్‌కు రానున్నారు. ఆమె ఉదయం ఎనిమిదిన్నర గంటలకు శంషాబాద్ విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడి నుంచి బీజేపీ నాయకులు ఆమెను ర్యాలీగా నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి తీసుకెళతారు. అక్కడ నిర్మలా సీతారామన్‌కు సన్మానం జరుగుతుంది.
ఆ తరువాత విలేకరుల సమావేశంలో పాల్గొని సీతారామన్ అనంతరం బర్కత్‌పురలోని బీజేపీ నగర కార్యాలయాన్ని సందర్శిస్తారు. ఇదిలా ఉంటే కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు జి. కిషన్‌రెడ్డి శుక్రవారం రాత్రి ఫోన్‌లో మాట్లాడారు. తెలంగాణకు ప్రత్యేకంగా హైకోర్టును సాధ్యమైనంత త్వరగా ఏర్పాటు చేయాల్సిందిగా కోరారు.