బడాయి బడ్జెట్ ఇది
ఈ బడ్జెట్ వాస్తవ విరుద్ధంగా ఉంది. ఇది భారీ బడ్జెట్ కాదు... బడాయి బడ్జెట్. నిధులు ఎలా సమకూర్చుకుంటారో చెప్పలేదు. మిషన్ భగీరథ, రెండు పడక గదుల ఇండ్ల నిర్మాణం, దళితులకు మూడెకరాల భూమి పంపిణీకోసం నామమాత్రంగా నిధులు కేటాయించారు. కొత్త జిల్లాల్లో మౌలిక సదుపాయాలు, ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణానికి నిధులు కేటాయించడంలో నిర్లక్ష్యం వహించింది.
రాష్ట్రం బాకీల తెలంగాణగా మారుతోంది. టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చాక రూ.77వేల కోట్ల అప్పు పెరిగింది. ఏటా రూ.16వేల కోట్లు వడ్డీలు, అప్పులకే సరిపోతోంది. తెలంగాణ ఏర్పాటైన తర్వాత రూ.3 లక్షల కోట్లు ఖర్చు చేసినట్లు చెప్పారు. వాటి వివరాలు వెల్లడించాలి.