Telangana bugjet-2017-18
-
బీసీ సబ్‌ప్లాన్ ప్రస్తావన ఏదీ?
సాక్షి, హైదరరాబాద్: బడ్జెట్లో బీసీ సబ్‌ప్లాన్ గురించి ఎక్కడా ప్రస్తావిం చలేదని టీడీపీ ఎమ్మెల్యే, బీసీ సంఘం నేత ఆర్.కృష్ణయ్య విమర్శిం చారు. సోమవారం ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్ దగ్గర మాట్లాడుతూ.. బీసీ సంక్షేమా నికి కేటాయింపులు ఏమూలకూ సరిపోవన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంటు కోసం కేటాయించిన నిధులు పాతబకాయిలకే సరిపోవన్నారు. ఎంబీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామంటున్న ప్రభుత్వం, ఏయే కులాలు ఎంబీసీ పరిధిలోకి వస్తాయో చెప్పడంలేదన్నారు. బీసీ కార్పొరేష న్కు రూ.1000 కోట్లు కేటాయించి, ఉపాధి కోసం రుణాలను ఇవ్వాలని డిమాండ్ చేశారు. 45వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నా, ఉద్యోగాల భర్తీ ప్రస్తావన లేదన్నారు. ఖాళీగా ఉన్న 2లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయా లని కోరారు. అంకెల్లో భారీగా ఉన్నా అభివృద్ధి, సంక్షేమంలో రాష్ట్రం అడుగున ఉందన్నారు. -
అన్నిరంగాలకు మోసం
బడ్జెట్లో అన్ని రంగాల వారికి మోసం జరిగింది. ప్రజలకు టోపీ పెట్టారు. అబద్ధాలు తప్ప ఏమీ లేవు. గత బడ్జెట్లో కేటాయించిన నిధులను పూర్తిస్థాయిలో ఖర్చు చేయలేదు. కేసీఆర్ సభను మోసం చేశారు. వ్యవసాయ రంగానికి బడ్జెట్ తగ్గిస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ లకోసం కేటాయించిన నిధులు 60 శాతం కూడా ఖర్చు కాలేదు. ఎన్నారైల సంక్షేమం ఊసే లేదు. – షబ్బీర్ అలీ, మండలిలో విపక్ష నేత -
ఆదాయం పెరిగితే రుణమాఫీ చేయరెందుకు!
పేదలకు కాదు.. పెట్టుబడిదారుల బడ్జెట్: రేవంత్‌రెడ్డి సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం పెరిగితే రైతులకు రుణమాఫీ ఎందుకు చేయడంలేదని టీటీడీఎల్పీనేత ఎ.రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యతో కలిసి సోమవారం అసెంబ్లీ మీడియా పాయింట్లో మాట్లాడుతూ... ‘రూ.1.09 లక్షల ఆదాయం వస్తే రుణమాఫీ చేయకుండా రైతులను ఎందుకు వేధిస్తున్నారు. కేసీఆర్ అబద్ధాలకు, అంకెలు, మాటల గారడీకి ఈ బడ్జెట్ పరాకాష్ట. ఫీజు రీయింబర్సుమెంటుకు రూ.4,300 కోట్లు అవసరమైతే రూ.1,900 కోట్లు మాత్రమే కేటాయించారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు కేటాయింపుల్లేవు. దళితులకు మూడెకరాల భూమి ఇవ్వాల్సి ఉండగా.. ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. ఇది పేదల కోసం కాదు.. పెట్టుబడిదారుల కోసం రూపొందించిన బడ్జెట్. -
బడాయి బడ్జెట్ ఇది
ఈ బడ్జెట్ వాస్తవ విరుద్ధంగా ఉంది. ఇది భారీ బడ్జెట్ కాదు... బడాయి బడ్జెట్. నిధులు ఎలా సమకూర్చుకుంటారో చెప్పలేదు. మిషన్ భగీరథ, రెండు పడక గదుల ఇండ్ల నిర్మాణం, దళితులకు మూడెకరాల భూమి పంపిణీకోసం నామమాత్రంగా నిధులు కేటాయించారు. కొత్త జిల్లాల్లో మౌలిక సదుపాయాలు, ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణానికి నిధులు కేటాయించడంలో నిర్లక్ష్యం వహించింది. రాష్ట్రం బాకీల తెలంగాణగా మారుతోంది. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక రూ.77వేల కోట్ల అప్పు పెరిగింది. ఏటా రూ.16వేల కోట్లు వడ్డీలు, అప్పులకే సరిపోతోంది. తెలంగాణ ఏర్పాటైన తర్వాత రూ.3 లక్షల కోట్లు ఖర్చు చేసినట్లు చెప్పారు. వాటి వివరాలు వెల్లడించాలి. -
రెండంకెల రంకె...
జాతీయ వృద్ధి రేటును మించి నమోదు చేస్తున్న రాష్ట్రం ⇒ రికార్డు స్థాయిలో పెరిగిన తలసరి ఆదాయం ∙పుంజుకుంటున్న వ్యవసాయ రంగం ⇒ 54 శాతం మందికి ఉపాధి వ్యవసాయం, అనుబంధ రంగాల్లోనే.. ⇒ ప్రతి ఐదుగురు యువతలో ఒకరు నిరుద్యోగే! ∙తెలంగాణ ఆర్థిక–సామాజిక సర్వేలో వెల్లడి వృద్ధి రేటులో తెలంగాణ ఉరకలేస్తోంది. వరుసగా మూడో ఏడాది జాతీయ సగటును అధిగమించింది. తొలిసారిగా రెండంకెల వృద్ధిరేటు నమోదు చేసింది. 2016–17 ఆర్థిక సంవత్సరంలో జాతీయ వృద్ధి రేటు 7.1 శాతంగా నమోదు కాగా రాష్ట్రం 10.1 శాతం వృద్ధి రేటు సాధించడం గమనార్హం. వరుస కరువులతో గతేడాది వరకు కుంగిపోయిన వ్యవసాయ రంగం ఈ ఏడాది బాగా పుంజుకుంది. పరిశ్రమలు, విద్యుత్, వ్యాపారం, స్థిరాస్తి, సేవా రంగాలు మళ్లీ దూకుడు ప్రదర్శించాయి. గత ఆర్థిక సంవత్సరంతో పోల్చితే ఈ ఏడాది రాష్ట్ర జీఎస్డీపీ(స్థిర ధరల వద్ద) విలువ రూ.4.64 లక్షల కోట్ల నుంచి రూ.5.11 లక్షల కోట్లకు పెరిగింది. ప్రస్తుత ధరల ప్రకారం అంచనా వేస్తే.. రాష్ట్రం 13.7 శాతం వృద్ధితో రూ.6.54 లక్షల కోట్ల జీడీపీని నమోదు చేయనుంది. ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ సోమవారం శాసనసభలో ప్రవేశపెట్టిన సామాజిక ఆర్థిక సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. వృద్ధి రేటు దూకుడులో ప్రథమ, ద్వితీయ రంగాలు కీలక పాత్ర పోషించాయి. – సాక్షి, హైదరాబాద్ వ్యవసాయ అనుబంధ రంగాల్లోనే ఉపాధి రాష్ట్రంలో ఉపాధి కల్పనలో వ్యవసాయ రంగమే అండగా నిలుస్తోంది. రాష్ట్ర జీఎస్డీపీలో వ్యవసాయం, దాని అనుబంధ రంగాల వాటా 14.7 శాతమే అయినా 54 శాతం మందికి జీవనోపాధి కల్పిస్తోంది. జీఎస్డీపీలో 62 శాతం వాటా కలిగిన సేవల రంగం 28 శాతం మందికి ఉపాధినిస్తోంది. పట్టణ ప్రాంతాల్లో సేవల రంగం, గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ రంగం ఉపాధి కల్పనలో అగ్రస్థానంలో ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయంపై ఆధారపడి 73 శాతం మంది, పట్టణ ప్రాంతాల్లో సేవల రంగంపై ఆధారపడి 64 శాతం మంది ఉన్నారు. ఆర్థికాభివృద్ధి, ప్రజల జీవన ప్రమాణాలకు సూచిక అయిన తలసరి ఆదా యంలో రాష్ట్రం దూసుకుపోతోంది. గతేడాది రూ.1,40,683 తో పోల్చితే ఈ ఏడాది 12.6% వృద్ధితో రూ.1,58,360గా నమోదైంది. గతేడాది జాతీయ తలసరి ఆదాయం రూ.94,178కాగా.. ఈసారి 10.2% వృద్ధితో రూ.1,03,818కు చేరనుంది. 2015–16 గణాంకాల ప్రకారం హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో తలసరి ఆదాయం రూ.రెండు లక్షలకుపైగా... సంగారెడ్డి, మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లాలు రూ.లక్షకు పైగా తలసరి ఆదాయాన్ని నమోదు చేశాయి. 18 జిల్లాలు లక్ష లోపు, మరో 14 జిల్లాలు జాతీయ సగటు అయిన రూ.94,178 కన్నా తక్కువగా తలసరి ఆదాయాన్ని నమోదు చేశాయి. యువతలో ఐదింటఒకరు నిరుద్యోగే! రాష్ట్రంలోని పట్టణాల్లో నిరుద్యోగం అధికంగా ఉంది. రాష్ట్రంలో నిరుద్యోగిత సగటు 2.7 శాతం ఉండగా... పట్టణ ప్రాంతాల్లో గరిష్టంగా 6.1 శాతం, గ్రామీణ ప్రాంతాల్లో 1.2 శాతంగా ఉంది. రాష్ట్ర జనాభాలో 30 శాతంగా ఉన్న యువతలో ఐదుగురిలో ఒకరు నిరుద్యోగిగా ఉండడం ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్రంలోని 96 శాతం యువతకు ఎలాంటి సాంకేతిక విద్య లేదు. పనిచేస్తున్న యువతలో 44 శాతం వ్యవసాయం, 15 శాతం ఉత్పత్తి, 11 శాతం వ్యాపారం, హోటళ్లు, రెస్టారెంట్ రంగాల్లో ఉపాధి పొందుతున్నారు. రాష్ట్ర రుణ ప్రణాళిక లెక్కలు ఇవీ.. రాష్ట్రంలో 2015–16లో మొత్తంగా రూ.78,776.4 కోట్ల రుణాలివ్వాలని లక్ష్యంగా పెట్టుకోగా.. రూ.1,36,855.7 (174శాతం) కోట్లు ఇచ్చారు. రూ.27,800 కోట్ల పంట రుణాల జారీ లక్ష్యంగా పెట్టుకోగా రూ.23,400 కోట్లను మాత్రమే ఇచ్చారు. ఇక 2016–17లో మొత్తం రూ.90,776 కోట్ల రుణాలు ఇవ్వాలని రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ నిర్ణయించింది. ఇందులో రూ.29,101 కోట్లు (33 శాతం) పంట రుణాలున్నాయి. గాడిన పడ్డ వ్యవసాయం కరువుతో వరు సగా రెండేళ్ల పాటు రుణాత్మక (మైనస్) వృద్ధి సాధించిన వ్యవసాయం రంగం ఈ ఏడాది 26.3 శాతం వృద్ధితో మెరిసింది. 2012–13 తర్వాత వ్యవసాయ రంగంలో ఇదే అత్యధిక వృద్ధి రేటు. పనిచేసే వయసున్న జనాభాయే అధికం సకుటుంబ సర్వే ప్రకారం రాష్ట్రంలో 2.39 కోట్ల మంది ఉపాధి వివరాలను వెల్లడించారు. అందులో 8.3 లక్షల మంది ఎలాంటి ఉపాధి, ఉద్యోగం లేదని తెలపగా.. మరో 18.89 లక్షల మంది విద్యార్థులు, 17.7 లక్షల మంది గృహిణులు ఉన్నారు. 15–19 వయసు గల జనాభాలో 8.84 లక్షల మంది ఎలాంటి పనిచేయడం లేదు. అయితే 85.5 లక్షల మంది తాము ఏయే రంగంలో ఉపాధి, ఉద్యోగం చేస్తున్నామనే వివరాలను వెల్లడించలేదు. పోస్టు గ్రాడ్యుయేట్లు 4 శాతమే సకుటుంబ సర్వే–2014 ప్రకారం రాష్ట్ర జనాభాలో పోస్టు గ్రాడ్యుయేషన్ (పీజీ), ఆపై విద్య అభ్యసించిన వారు 4 శాతమే. గ్రాడ్యుయేషన్ (డిగ్రీ స్థాయి) పూర్తి చేసినవారు 14 శాతం ఉన్నారు. 10 శాతం ఇంటర్మీడియట్, మరో 29 శాతం పదో తరగతి వరకు చదువుకున్నారు. 7 శాతం ప్రాథమిక విద్య పూర్తి చేయగా.. 2 శాతం మంది డిప్లొమా కోర్సులు చేశారు. మిగతావారు చదువుకోనివారు లేదా ప్రాథమిక విద్య పూర్తి చేయనివారు. రూ.51,358 కోట్ల పెట్టుబడులు.. 2.12 లక్షల మందికి ఉపాధి! నూతన పారిశ్రామిక విధానం ‘టీఎస్ ఐపాస్’ద్వారా గత జనవరి 24 వరకు రాష్ట్రంలో 3,327 పరిశ్రమలకు అనుమతులు ఇచ్చారు. రూ.51,358 కోట్ల పెట్టుబడులతో ఏర్పాటు కానున్న ఈ పరిశ్రమలతో 2,12,033 మందికి ఉపాధి లభించనుంది. ఇప్పటికే 1,138 పరిశ్రమలు ఉత్పత్తి ప్రారంభించగా.. 405 పరిశ్రమల ఏర్పాటు చివరి దశలో ఉంది. అత్యధికంగా 361 ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు ఉన్నాయి. 8,618 పరిశ్రమలు ఖాయిలా.. రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ నివేదిక ప్రకారం 2016–17లో రాష్ట్రంలో 8,618 పరిశ్రమలు ఖాయిలా పడ్డాయి. ఇందులో 632 (7 శాతం) యూనిట్లను పునరుద్ధరించేందుకు అవకాశాలు ఉండగా.. మిగతా వాటి పునరుద్ధరణ సాధ్యం కాదని తేల్చారు. -
దాచిన అప్పు.. 10 వేల కోట్లు!
సాక్షి, హైదరాబాద్: అప్పులు, వడ్డీల భారం రాష్ట్రాన్ని వణికిస్తోంది. సర్కారును సైతం ఆందోళనకు గురి చేస్తోంది. అందుకే.. ఈసారి బడ్జెట్లో కొంతమేరకు అప్పులను దాచి పెట్టింది. 2017–18 ఆర్థిక సంవత్సరంలో అప్పుల కుప్ప రూ.1.40 లక్షల కోట్లకు చేరుతుందని బడ్జెట్లో ప్రస్తావించింది. కానీ ఇది రూ.1.50 లక్షల కోట్లు దాటే అవకాశాలున్నట్లు స్పష్టమవుతోంది. దాదాపు రూ.10 వేల కోట్ల అప్పును ప్రభుత్వం దాచిపెట్టినట్టు తెలుస్తోంది. ఇటీవలే కేంద్రం అమలు చేస్తున్న ఉదయ్ పథకంలో రాష్ట్ర ప్రభుత్వం చేరింది. దీంతో విద్యుత్ పంపిణీ సంస్థల (డిస్కం) అప్పులన్నీ రాష్ట్ర ఖజానాకు బదిలీ అయ్యాయి. దీంతో రూ.8,924 కోట్ల అప్పు రాష్ట్ర ఖాతాకు చేరింది. ఇటీవలే రిజర్వ్ బ్యాంకు మార్కెట్ బాండ్లను వేలం వేసి ప్రభుత్వం ఈ అప్పులను తీర్చింది. కానీ.. బడ్జెట్లో ప్రభుత్వం ఈ విషయాన్ని ఎక్కడా ప్రస్తావించలేదు. వీటితోపాటు మార్చి నెలలో ప్రభుత్వం తీసుకున్న రుణాలనూ ఇందులో చూపించలేదు. 2016–17 బడ్జెట్ సవరణల ప్రకారం.. రూ.1.14 లక్షల కోట్ల అప్పులున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. వీటికితోడు కొత్త బడ్జెట్లో ప్రస్తావించిన రూ.26 వేల కోట్ల ద్రవ్యలోటు మేరకు చేసే అప్పులన్నీ కలిపి.. రూ.1.40 లక్షల కోట్లుగా లెక్క తేల్చింది. కానీ ఇందులో జమ చేయకుండా వదిలేసిన అప్పులు కలిపితే రూ.1.50 లక్షల కోట్లకు చేరనుంది. రాష్ట్ర విభజన సమయంలో రూ.70 వేల కోట్లతో మొదలైన తెలంగాణ రుణ ప్రస్థానం మూ డేళ్లలోనే రెండింతలు దాటిపోయింది. వీటికి తోడు కార్పొరేషన్ల పేరిట బడ్జెట్‌తో సంబంధం లేకుండా ప్రభుత్వం చేస్తున్న అప్పులు రాష్ట్ర భవిష్యత్ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేయనున్నాయి. బడ్జెటేతర అప్పులు రూ.40 వేల కోట్లకు పైనే.. బడ్జెటేతర వనరుల ద్వారా గొర్రెల పెంపకం, చేపల పెంపకం, మైక్రో ఇరిగేషన్ పథకాలు, మిషన్ భగీరథ, డబుల్ బెడ్రూం ఇళ్లు, ఆసుపత్రుల నిర్మాణం చేపట్టనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వ పూచీకత్తుతో వివిధ కార్పొరేషన్ల పేరుతో అప్పులు సమీకరించి వీటికి ఖర్చు చేయాలనేది లక్ష్యం. ఇప్పటికే ప్రభుత్వం ఇచ్చిన పూచీకత్తు రుణాల చిట్టా రూ.31,453 కోట్లకు చేరింది. ఈ ఏడాది కొత్తగా రూ.40 వేల కోట్ల పూచీకత్తు రుణాలు తీసుకునే అవకాశముంది. ప్రభుత్వం నేరుగా తమపై భారం పడకుండా కార్పొరేషన్ల ద్వారా అప్పులు తీసుకున్నప్పటికీ.. వడ్డీ సహా అప్పులు తీర్చే బాధ్యత ప్రభుత్వంపైనే ఉంటుంది. దీంతో వడ్డీల చెల్లింపులు ఏటేటా భారీగా పెరిగిపోతున్నాయి. తలసరి అప్పు రూ.42,857 కోట్లు వడ్డీల చెల్లింపులు వచ్చే ఏడాది నుంచి సర్కారుకు తలకు మించిన భారంగా మారనున్నాయి. గత ఏడాది అప్పులపై వడ్డీలకు ప్రభుత్వం రూ.7,700 కోట్లు చెల్లించింది. 2017–18లో అప్పులపై చెల్లించే వడ్డీలకు రూ.11,138 కోట్లు అవసరమని ఖర్చుల పద్దులో ప్రస్తావించింది. ప్రస్తుతం రాష్ట్రంలో 3.50 కోట్ల జనాభా ఉంది. ఈ లెక్కన రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పులను పంచితే తలసరి అప్పు రూ.42,857 ఉంటుంది. కార్మిక, ఉపాధి, శిక్షణకు రూ.625 కోట్లు సాక్షి, హైదరాబాద్: కార్మిక సంక్షేమం, ఉపాధి, శిక్షణ కార్యక్రమాలకు 2017– 18 బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వం రూ.625.58 కోట్లు కేటాయించింది. ఇందులో నిర్వహణ పద్దు నిమిత్తం రూ.310.22 కోట్లు, ప్రగతి పద్దు కింద రూ.315.36 కోట్లు ఇచ్చింది. ఇందులో కార్మిక ఉపాధి కల్పన కోసం 155.94 కోట్లు, సామాజిక సర్వీసుల కోసం రూ.6.5 కోట్లు కేటాయించింది. కార్మికుల బీమా, వైద్య సేవల నిమిత్తం రూ.87.66 కోట్లు నిర్దేశించింది. ఐటీఐ(పారిశ్రామిక శిక్షణ సంస్థ)ల కోసం రూ.8.35 కోట్లు, స్కిల్ డెవలప్మెంట్ మిషన్ కోసం రూ.39.28 కోట్లు కేటాయించింది. ఐటీఐ విద్యార్థుల కోసం తలపెట్టిన సంకల్ప్ పథకానికి రూ.24.20 కోట్లు కేటాయించింది. సివిల్ సప్లైస్‌కు కోత సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పౌరసరఫరాల శాఖకు ఈ సారి బడ్జెట్ కేటాయింపులు తగ్గాయి. తాజా బడ్జెట్లో ఈ శాఖకు నిర్వహణ పద్దు కింద రూ.27.21 కోట్లు, ప్రగతి పద్దు కింద రూ.1732.69 కోట్లు మాత్రమే కేటాయించింది. గత బడ్జెట్లో ప్రభుత్వం రూ.2,200 కోట్లు కేటాయించింది. అంతకు మందు 2015–16 బడ్జెట్లో సైతం ఇదే మొత్తంలో బడ్జెట్ కేటాయించినా విడుదల మాత్రం అంతంత మాత్రంగానే ఉండింది. కాగా ఖర్చు మాత్రం బడ్జెట్ అంచనాలను దాటిపోయింది. రాష్ట్ర వ్యాప్తంగా బీపీఎల్ కుటుంబాలకు ఒక్కో కుటుంబంలో ఒక్కొక్కరికి 6 కేజీల చొప్పున ఈ శాఖ రేషన్ బియ్యం సరఫరా చేస్తోంది. 2015–16 బడ్జెట్లో కేటాయించింది రూ.2,200 కోట్లు కాగా, ఆ ఏడాది ఏకంగా రూ.3,800 కోట్లు ఖర్చయ్యాయి. -
సంక్షేమానికి పెద్దపీట
బడ్జెట్లో రూ.30,592.46 కోట్లు గతేడాదితో పోల్చితే 39 శాతం పెరిగిన కేటాయింపులు సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం 2017–18 బడ్జెట్లో సంక్షేమానికి పెద్దపీట వేసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, వికలాంగ, మహిళాశిశు సంక్షేమ శాఖలకు కలిపి ఏకంగా రూ.30,592.46 కోట్లు కేటాయించింది. ఈ శాఖలకు గత బడ్జెట్ కేటాయింపులు రూ.21,949.64 కోట్లు కాగా.. తాజాగా 8,642.82 కోట్లు (39.37 శాతం) అదనంగా ఇచ్చారు. కొత్తగా ఎస్సీ ప్రత్యేక అభివృద్ధి నిధి బడ్జెట్లో మార్పుల నేపథ్యంలో షెడ్యుల్డ్ కులాల (ఎస్సీ) సబ్‌ప్లాన్ స్థానంలో.. ఎస్సీ ప్రత్యేక అభివృద్ధి నిధి(ఎస్సీఎస్డీఎఫ్) విధానాన్ని అమలు చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. సమగ్ర అభివృద్ధి చర్యల్లో భాగంగా ఈ కొత్త పథకాన్ని ప్రవేశపెడుతున్నామని, దీనికి కేటాయించిన నిధులను పూర్తిస్థాయిలో ఖర్చు చేస్తామని.. నిధులు మిగిలితే వచ్చే ఏడాదికి క్యారీ ఫార్వర్డ్ చేస్తామని స్పష్టం చేసింది. తాజా బడ్జెట్లో ఎస్సీల కోసం రూ.14,375.12 కోట్లు కేటాయించారు. 43 ప్రభుత్వ శాఖల ద్వారా ఈ నిధులను ఖర్చు చేసి ఎస్సీల సమగ్ర అభివృద్ధికి పాటుపడతామని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ అసెంబ్లీలో ప్రకటించారు. గతేడాది బడ్జెట్లో ఎస్సీ ఉప ప్రణాళిక కింద కేటాయించినది రూ.10,483.96 కోట్లుకాగా.. ఈ సారి కేటాయింపులు రూ.3,891.16 కోట్లు అదనం. గిరిజనాభివృద్ధికి పెరిగిన నిధులు గిరిజన ఉప ప్రణాళిక (సబ్ ప్లాన్) స్థానంలో కొత్తగా గిరిజన ప్రత్యేక అభివృద్ధి నిధి(ఎస్టీఎస్డీఎఫ్)ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. గిరిజనుల సమగ్ర అభివృద్ధి కోసం కొత్త పథకాల్ని ప్రవేశపెడతామని, వారికి కేటాయించిన నిధులను పూర్తిస్థాయిలో ఖర్చు చేస్తామని, మిగిలితే వచ్చే ఏడాదికి క్యారీ ఫార్వర్డ్ చేస్తామని ప్రకటించింది. తాజా బడ్జెట్లో ఎస్టీఎస్డీఎఫ్కు రూ.8,165.87 కోట్లు కేటాయించింది. ఇందులో కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాల కింద రూ.1,766.16 కోట్లు అందుతాయని అంచనా వేసింది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలకు రూ.5,579.5 కోట్లు, గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ధి నిధికి రూ.9.28 కోట్లు కేటాయించింది. 2016–17 బడ్జెట్లో ఎస్టీ సబ్‌ప్లాన్ కింద ప్రభుత్వం రూ. 6,171.15 కోట్లు కేటాయించగా.. ఈ సారి రూ.1,994.72 కోట్లు అదనంగా ఇచ్చారు. బీసీలకు నిధులు డబుల్ రాష్ట్రంలో వెనుకబడిన తరగతుల సంక్షేమానికి నిధులను భారీగా పెంచింది. గతేడాది ఈ శాఖకు రూ. 2,537.51 కోట్లు మాత్రమే ఇవ్వగా.. తాజా బడ్జెట్లో అంతకు రెండింతలుగా రూ.5,070.36 కోట్లు కేటాయించారు. బీసీ సంక్షేమ శాఖ పరిధిలో కొత్తగా ఎంబీసీ (అత్యంత వెనుకబడిన కులాలు) కార్పొరేషన్ ఏర్పాటు చేస్తూ.. దానికి రూ.1,000 కోట్లు కేటాయించారు. కొత్తగా ప్రారంభం కానున్న బీసీ గురుకుల పాఠశాలల కోసం రూ. 161 కోట్లు ఇచ్చారు. బీసీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు రూ.753.31 కోట్లు, ఈబీసీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు రూ.252 కోట్లు కేటాయించారు. మహిళా, శిశు అభివృద్ధికి కొంతే ఊరట మహిళా, శిశు, వికలాంగ సంక్షేమ శాఖకు గతేడాది బడ్జెట్లో రూ.1,552.58 కోట్లు ఇవ్వగా.. ప్రస్తుతం రూ.1,731.50 కోట్లు కేటాయించారు. నిర్వహణ పద్దు కింద రూ.881.77 కోట్లు, ప్రగతి పద్దు కింద రూ.849.72 కోట్లు కేటాయించారు. మహిళల సామాజిక భద్రత, సంక్షేమం కోసం రూ.106.36 కోట్లు, పౌష్టికాహార పంపిణీకి రూ.675.02 కోట్లు ఇచ్చారు. ఐసీడీఎస్ పథకానికి రూ.12 కోట్లు, గర్ల్ చైల్డ్ పరిరక్షణ పథకానికి రూ.10 కోట్లు కేటాయించారు. మైనార్టీలకు అంతంతే! మైనారిటీ సంక్షేమ శాఖకు గతేడాది రూ. 1,204.44 కోట్లు ఇవ్వగా.. తాజాగా రూ. 1,249.66 కోట్లు కేటాయించారు. తాజా కేటాయిం పుల్లో మైనారిటీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ కోసం రూ.180 కోట్లు, బ్యాంకుల ద్వారా ఇచ్చే రాయితీ రుణాలకు రూ.150 కోట్లు, ఉర్దూ అకాడమీకి రూ.23 కోట్లు, వక్ఫ్ బోర్డుకు రూ.50 కోట్లు కేటాయించారు. మైనారిటీ గురుకులాల కోసం రూ.425 కోట్లు, దావత్ ఏ ఇఫ్తార్, క్రిస్మస్కు రూ.30 కోట్లు, ఓవర్సీస్ విద్యానిధి పథకం కింద రూ.40 కోట్లు కేటాయించారు. -
రోడ్లు భవనాలకు మోస్తరే...
► బడ్జెట్లో రూ. 3,800 కోట్ల కేటాయింపు ► కొత్త సచివాలయానికి రూ.50 కోట్లు సాక్షి, హైదరాబాద్: పెట్టుబడులను ఆకట్టు కోడానికి మెరుగైన రహదారి వ్యవస్థ ఉండాలని భావిస్తున్న ప్రభుత్వం.. నిధుల కేటాయింపులో మాత్రం ఔదార్యం చూపలేదు. గత బడ్జెట్లో తక్కువ నిధులే కేటాయించింది. ఈసారి ఇంచుమించు అంతే నిధులతో సరిపెట్టింది. రవాణా, రోడ్లు భవనాల నిర్మాణానికి సంబంధించి తాజా బడ్జెట్లో రూ.5,033 కోట్లు కేటాయిస్తున్నట్లు పద్దుల్లో చూపింది. అందులో రోడ్ల నిర్మాణానికి సంబంధించిన నిధులు మాత్రం రూ.2700 కోట్లు మాత్రమే. జిల్లా రహదారులకు రూ.725 కోట్లు, మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు రెండు లేన్ల రోడ్ల కు రూ.350 కోట్లు, కోర్ నెట్వర్క్ రోడ్లకు రూ.320 కోట్లు, వంతెనలకు రూ.295 కోట్లు కేటాయించారు. గజ్వేల్, ఇతర అనుసంధాన రహదారుల ప్రాంత అభివృద్ధి అథారిటీకి రూ.50 కోట్లు, రేడియల్ రోడ్స్‌కు రూ.100 కోట్లు కేటాయించారు. భవనాల విభాగానికి రూ.1,100 కోట్లు కేటాయించారు. కొత్త సచివాలయంలో ఆచితూచి.. కొత్త సచివాలయం నిర్మాణాన్ని ప్రస్తుతానికి ప్రభుత్వం పక్కనపెట్టినట్టు కనిపిస్తోంది. తాజా బడ్జెట్లో కొత్త సచివాలయం కోసం రూ.50 కోట్లు కేటాయించారు. గత బడ్జెట్లోనూ ఇంతే కేటాయించారు. ఇక కొత్త జిల్లా కేంద్రాల్లో సమీకృత కలెక్టరేట్ భవనాల నిర్మాణాలకు బడ్జెట్లో రూ.600 కోట్లు కేటాయించారు. ఎమ్మెల్యేల ఇళ్లకు రూ.30 కోట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం భవనం కోసం రూ.కోటి, తెలంగాణ జర్నలిస్టుల భవనాల కోసం రూ.10 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వ అతిథి గృహ నిర్మాణం కోసం రూ.25 లక్షలు, తెలంగాణ కళాభారతి భవనానికి రూ.10 కోట్లు, సీనియర్ అధికారుల కొత్త నివాస గృహాల క్వార్టర్లకు రూ.122 కోట్లు కేటాయించారు. ఎమ్మెల్యేల ఇళ్ల కోసం రూ.30 కోట్లు, రాజ్‌భవన్‌లో కొత్త భవనాల కోసం రూ.40 కోట్లు కేటాయించారు. -
సాగు.. ఏం బాగు?
వ్యవసాయానికి గతేడాది కంటే తగ్గిన బడ్జెట్ కేటాయింపులు ►గత బడ్జెట్ రూ.6,758 కోట్లు ►ఈసారి బడ్జెట్లో రూ. 5,942 కోట్లే ►ఇందులో రుణమాఫీకి కేటాయించిన నిధులే రూ.4 వేల కోట్లు ►మిగిలిన రూ.1,942 కోట్లే వ్యవసాయానికి వాస్తవ కేటాయింపులు ►ఉద్యాన శాఖకు కోతలు.. పాలీహౌస్‌కు రూ.70 కోట్లు మాత్రమే ►యాంత్రీకరణకు 300 కోట్లు.. పశుసంవర్థక శాఖకు రూ.594 కోట్లు ►గొర్రెల పంపిణీకి బడ్జెట్లో కేటాయింపులు లేవు హైదరాబాద్: ఒకవైపు కాలం కలసి రావడం.. మరోవైపు ఎన్నడూ లేనంతగా భారీగా పంటలు సాగవుతున్న నేపథ్యంలో రైతుకు చేయూతనివ్వాల్సిన రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగంపై శీతకన్ను వేసింది. 2016–17 బడ్జెట్లో వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ రంగాలకు రూ.6,758 కోట్లు కేటాయించగా.. 2017–18 బడ్జెట్లో రూ.5,942 కోట్లకు కుదించింది. గతం కంటే ఈసారి రూ.816 కోట్లు తగ్గిపోవడం గమనార్హం. ఈ కేటాయింపుల్లోనూ రూ.4 వేల కోట్లు రుణమాఫీకే పోతుంది. మిగిలిన రూ.1,942 కోట్లు మాత్రమే వ్యవసాయ రంగానికి వాస్తవ కేటాయింపుగా భావించాల్సి ఉంటుంది. రుణమాఫీ నిధులు, కేంద్ర ప్రభుత్వ పథకాల నిధులతో కలిపి వ్యవసాయ శాఖకు రూ.4,823 కోట్లు కేటాయించారు. ఇక ఉద్యాన శాఖకు రూ.207 కోట్లు మాత్రమే కేటాయించారు. 2015–16లో పాలీహౌస్‌ల నిర్మాణానికి రూ.250 కోట్లు.. 2016–17లో రూ.200 కోట్లు కేటాయించగా.. ఈసారి ఏకంగా రూ.70 కోట్లకు కుదించారు. అంటే పాలీహౌస్ను ప్రభుత్వం నిరుత్సాహపరచాలని భావిస్తున్నట్లు అర్థమవుతోంది. ఈసారి బట్జెట్‌లో ప్రభుత్వం వెయ్యి ఎకరాల్లో పాలీహౌస్ నిర్మాణాలు చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది. సూక్ష్మ సేద్యాన్ని ప్రోత్సహించేందుకు నాబార్డు నుంచి రూ.వెయ్యి కోట్లు రుణంగా పొందినందున ఉద్యాన శాఖకు తక్కువ కేటాయిం పులు జరిపినట్లు అధికారులు చెబుతున్నారు. రెండేళ్లుగా పాలీహౌస్‌లకు బకాయిలు రూ.200 కోట్ల వరకు పేరుకు పోవడంతో ఆ సొమ్ము ఎలా ఇవ్వాలో అంతుబట్టడంలేదని అధికారులు అంటున్నారు. ఇక వ్యవసాయ యాంత్రీకరణకు గత బడ్జెట్ కంటే అధిక నిధులు ఇచ్చారు. 2016–17 బడ్జెట్లో రూ.250 కోట్లుండగా.. ఈసారి రూ.300 కోట్లు కేటాయించారు. మార్కెటింగ్ శాఖకు రూ.457.29 కోట్లు కేటాయించారు. పశుసంవర్థక శాఖకు రూ.594 కోట్లు ప్రగతి, నిర్వహణ పద్దుల కింద పశుసంవర్థక శాఖకు రూ.594.74 కోట్లు కేటాయించారు. ఇందులో నిర్వహణ పద్దు కింద రూ.333 కోట్లు, ప్రగతి పద్దు కింద రూ.261 కోట్లు కేటాయించారు. ప్రగతి పద్దులో వెటర్నరీ ఆసుపత్రులు, డిస్పెన్సరీలకు రూ.25 కోట్లు.. కోళ్లు, పశువుల ఉత్పత్తి ప్రోత్సాహకాలకు రూ.43 కోట్లు.. పీవీ నర్సింహారావు వెటర్నరీ వర్సిటీకి రూ.21.25 కోట్లు కేటాయించారు. అయితే విజయ డెయిరీకి పాలు పోసే రైతులకు ఇస్తున్న ప్రోత్సాహకపు సొమ్మును బడ్జెట్లో ప్రత్యేకంగా ప్రస్తావించలేదు. కాగా, రాష్ట్ర ప్రభుత్వం కీలకంగా భావిస్తోన్న గొర్రెల పంపిణీకి బడ్జెట్లో కేటాయింపులు లేవు. వాటిని జాతీయ సహకారాభివృద్ధి సంస్థ(ఎన్సీడీసీ) ద్వారా అప్పు తీసుకుని ఇవ్వాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. అందువల్లే బడ్జెట్లో ప్రస్తావించలేదని భావిస్తున్నారు. మత్స్య శాఖ అభివృద్ధికి.. రూ.60.50 కోట్లు.. సహకార శాఖకు రూ.5.58 కోట్లు కేటాయించారు. ముఖ్య కేటాయింపులివీ.. ►వ్యవసాయ యాంత్రీకరణకు రూ.300 కోట్లు ► సన్నచిన్నకారు రైతుల పంటల బీమాకి రూ.200 కోట్లు ►వడ్డీలేని రుణాలు, పంటల బీమాకు రూ.250 కోట్లు ► రైతులకు సబ్సిడీపై విత్తనాల పంపిణీకి 126.61 కోట్లు ► ప్రొ.జయశంకర్ వ్యవసాయ వర్సిటీకి 85.50 కోట్లు ►శ్రీకొండా లక్ష్మణ్ ఉద్యాన వర్సిటీకి రూ.12.60 కోట్లు ►ఉద్యాన శాఖ కార్యకలాపాలకు రూ.17 కోట్లు ►వేర్‌హౌసింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు రూ.349.88 కోట్లు ► సూక్ష్మసేద్యం కోసం రూ.56 కోట్లు ►బ్లూ రెవెల్యూషన్ కోసం రూ.19.54 కోట్లు -
బడ్జెట్ బాట.. వరాల మూట
గ్రామీణ ఆర్థిక ప్రగతి లక్ష్యంగా ప్రవేశపెట్టిన బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వం ఈసారి.. భారీగా వరాల జల్లు కురిపించింది. అందులోని ముఖ్యాంశాలివీ... ♦ రెండేళ్లలో 4 లక్షల యాదవ కుటుంబాలకు 84 లక్షల గొర్రెల పంపిణీ. అర్హత గల కుటుంబానికి 20 గొర్రెలు, ఒక పొట్టేలు 75 శాతం సబ్సిడీతో పంపిణీ. పొరుగు రాష్ట్రాల నుంచి గొర్రెల కొనుగోలు. గొర్రెల మేతకు అనువుగా అటవీ భూముల్లో స్టైలో గ్రాస్ పెంపకం. ♦ రాష్ట్రవ్యాప్తంగా చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాల అభివృద్ధి. పెంపకంతోపాటు నిర్వహణ వ్యయాన్ని ప్రభుత్వమే భరిస్తుంది. మార్కెటింగ్ సౌకర్యాలతోపాటు రిటైల్ మార్కెట్లను నిర్మిస్తుంది ♦ కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల ద్వారా పేదింటి ఆడపిల్లల పెళ్లికి ప్రభుత్వం ఇచ్చే ఆర్థిక సాయం రూ.51 వేల నుంచి రూ.75,116కు పెంపు ♦ ఎంబీసీలకు (అత్యంత వెనుకబడిన కులాలు) ప్రత్యేక కార్పొ రేషన్. ఎంబీసీల అభివృద్ధి, సంక్షేమానికి రూ.1000 కోట్లు ♦ రజక, నాయి బ్రాహ్మణుల పథకాలకు రూ.500 కోట్లు. నాయిబ్రాహ్మణులు ఆధునిక క్షౌరశాలలు ఏర్పాటు చేసుకు నేందుకు ప్రభుత్వ పెట్టుబడి. రజకులకు వాషింగ్ మెషీన్లు, డ్రైయర్లు, ఐరన్ బాక్సుల పంపిణీ. దోబీఘాట్ల నిర్మాణం ♦ విశ్వకర్మలుగా పిలిచే ఔసల, కమ్మరి, కంచరి, వడ్రంగి, శిల్పకారులకు అవసరమైన ఆర్థిక సహకారం. రూ.200 కోట్లు కేటాయింపు. బట్టలు కుట్టే మేర, గీత కార్మికులకు, కుమ్మరి పనివారికి పరికరాల పంపిణీ ♦ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్‌కు రూ.100 కోట్లు ♦ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలకు మూడు విడతలుగా మొత్తం రూ.12 వేల ప్రోత్సాహకం. ఆడపిల్లను కన్న మహిళలకు ప్రత్యేకంగా మరో రూ.వెయ్యి ప్రోత్సాహకం ♦ పుట్టిన బిడ్డల సంరక్షణకు అవసరమయ్యే 16 వస్తువులతో ‘కేసీఆర్ కిట్’ పంపిణీ. తల్లీబిడ్డకు ఉపయోగపడే సబ్బులు, బేబీ ఆయిల్, చిన్న పిల్లల పరుపు, దోమ తెర, డ్రెస్సులు, చీరలు, హ్యాండ్ బ్యాగ్, టవళ్లు, నాప్కిన్స్, పౌడర్, డైపర్లు, షాంపు, పిల్లల ఆట వస్తువులు ఇందులో ఉంటాయి. ‘కేసీఆర్ కిట్’కు బడ్జెట్లో రూ.605 కోట్లు కేటాయింపు ♦ అంగన్వాడీ కేంద్రాలకు సన్నబియ్యం పంపిణీ ♦ ఒంటరి మహిళలకు నెలకు వెయ్యి రూపాయల ఆసరా ఫించన్లు. ఏప్రిల్ నుంచి అమలు ♦ సైనికుల సంక్షేమ చర్యలకు సంక్షేమ నిధి ♦ జర్నలిస్టుల సంక్షేమానికి రూ.30 కోట్లు ♦ మూసీ నదీ తీర ప్రాంత అభివృద్ధికి రూ.350 కోట్లు ♦ ఉస్మానియా శతాబ్ది ఉత్సవాలు.. సెంటినరీ బ్లాక్ నిర్మాణానికి రూ.200 కోట్లు ♦ వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఏడు ఎస్సీ కాలేజీలు, కొత్త స్టడీ సర్కిళ్లు. ఒక్కో ♦ నియోజకవర్గానికి ఒకటి చొప్పున 119 బీసీ గురుకుల పాఠశాలల ప్రారంభం. మైనారిటీలకు 130 రెసిడెన్షియల్ స్కూళ్లు ♦ వ్యవసాయ ఉత్పత్తుల నిల్వలకు 330 గోదాంల నిర్మాణం ♦ కరీంనగర్ లోయర్ మానేర్ డ్యాం దిగువన రూ.506 కోట్లతో రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు. ఈ ఏడాది రూ.193 కోట్ల కేటాయింపు ♦ వరంగల్‌లో టెక్స్టైల్ పార్కు, సిరిసిల్లలో అపరెల్ పార్కు ఏర్పాటుకు నిర్ణయం. నేత కార్మికులకు రూ.1,200 కోట్లు . ♦ ఇమామ్‌లు, మౌజాములకు ఇచ్చే రూ.వెయ్యి గౌరవ వేతనం రూ.1500కు పెంపు ♦ అంగన్వాడీ టీచర్ల జీతం రూ.10,500కు పెంపు. హెల్పర్ల జీతం రూ.6,000కు పెంపు ♦ వీఆర్ఏల జీతం రూ.10,500కు పెంపు. దీనికి అదనంగా రూ.200 తెలంగాణ ఇంక్రిమెంట్. విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్లకు రూ.5 వేల జీతం ♦ కొత్త జిల్లాల్లో కలెక్టరేట్ల నిర్మాణానికి రూ.600 కోట్లు. కొత్త సచివాలయం నిర్మాణానికి రూ.50 కోట్లు ♦ హైదరాబాద్‌లో మూడు మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణం. కరీంనగర్లో ఒక మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మించే ప్రతిపాదన ♦ ప్రభుత్వ ఆసుపత్రుల్లో మరణించిన వారి మృతదేహాల తరలింపునకు మరో 50 వాహనాల కొనుగోలు ♦ జీహెచ్ఎంసీకి రూ.వెయ్యి కోట్లు. గ్రేటర్ వరంగల్‌కు రూ. 300 కోట్లు. మిగతా మున్సిపల్ కార్పొరేషన్లకు రూ.400 కోట్లు. -
అతికినట్లు సరిపోయింది
బడ్జెట్‌పై ముఖ్యమంత్రి కేసీఆర్ సాక్షి, హైదరాబాద్: బడ్జెట్ పేదల సంక్షేమానికి, రాష్ట్ర ఆర్థిక ప్రగతికి దోహదపడేలా ఉందని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. సంప్రదాయ బడ్జెట్‌కు భిన్నంగా వాస్తవిక కోణంలో, తెలంగాణ రాష్ట్రానికి అతికినట్లు బడ్జెట్ ఉందని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టికి బడ్జెట్ ఎంతగానో ఉపయోగపడుతుందని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు. అన్ని రంగాలకు తగిన ప్రాధాన్యత ఇచ్చారని, పూర్తి సమతౌల్యతతో బడ్జెట్ రూపొందించారని ప్రశంసించారు. నిరుపేదలు, మహిళలు, చిరుద్యోగుల జీవన ప్రమాణాలు పెంచేలా బడ్జెట్లో కేటాయింపులున్నాయన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల అభ్యున్నతి, కులవృత్తుల ప్రోత్సాహకానికి అత్యధిక నిధులు కేటాయించడంపై ముఖ్యమంత్రి సంతోషం వ్యక్తం చేశారు. సమైక్య పాలనలో విస్మరణకు గురైన అనేక రంగాలు, వర్గాలకు ఈసారి బడ్జెట్లో ఎక్కువ కేటాయింపులు చేశారని అభినందించారు. ఆర్థిక వనరులను సరిగ్గా అంచనా వేయడంతోపాటు రాష్ట్రావసరాలను సరిగ్గా అర్థం చేసుకుని తెలంగాణలోని మానవవనరులను సంపూర్ణంగా వినియోగించుకునేలా బడ్జెట్ రూపకల్పన జరిగిందన్నారు. బడ్జెట్ రూపకల్పన విషయంలో కేంద్ర ప్రభుత్వం మార్పులు చేసినప్పటికీ ఆర్థిక శాఖ అత్యంత సమర్థంగా నిర్వహణ, ప్రగతి పద్దుల కింద నిధులు కేటాయించిందన్నారు సీఎంకు అభినందనల వెల్లువ... గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టికి దోహదపడే విధంగా బడ్జెట్ ప్రవేశపెట్టినందుకు సీఎం కేసీఆర్‌ను పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు అసెంబ్లీలోని సీఎం చాంబర్లో కలసి అభినందనలు తెలిపారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నేతృత్వంలో యాదవులు, కుర్మలు సీఎంకు గొర్రెలు బహుకరించగా మత్య్యకారులు చేపలు, వలను బహుకరించారు. కళ్యాణలక్ష్మి/షాదీ ముబారక్ కింద ఆర్థిక సాయాన్ని పెంచినందుకు, గర్భిణుల ప్రసవాలకు ప్రత్యేక నగదు ప్రోత్సాహం ప్రకటించినందుకు మహిళా ఎమ్మెల్యేలు సీఎంను కలసి కృతజ్ఞతలు తెలిపారు. -
నిధుల పరవళ్లు
బడ్జెట్లో ఈసారీ అగ్రతాంబూలమే.. ►రూ.25 వేల కోట్ల కేటాయింపు ►కాళేశ్వరానికి గరిష్టంగారూ.6,681 కోట్లు ►పాలమూరు ఎత్తిపోతలకు రూ.4,000కోట్లు ►మహబూబ్‌నగర్ ప్రాజెక్టులకు రూ.1,720 కోట్లు హైదరాబాద్ బడ్జెట్లో గతేడాది మాదిరే ఈసారీ సాగునీటి ప్రాజెక్టులకు అగ్రతాంబూలం దక్కింది. ప్రాజెక్టుల నిర్మాణానికి రూ.25 వేల కోట్లు కేటాయించారు. ఇందులో ప్రగతి పద్దు కింద రూ.23,675.73 కోట్లు, నిర్వహణ పద్దు కింద రూ. 1,324.27 కోట్లు కేటాయించారు. ఈ ఏడాది ఆయకట్టుకు నీరందించేందుకు సిద్ధంగా ఉన్న ప్రాజెక్టులకు పూర్తిస్థాయిలో నిధులిచ్చారు. దీర్ఘకాలంలో పూర్తయ్యే ప్రాజెక్టులకూ çభారీగానే కేటాయించారు. మహబూబ్‌నగర్‌లోని నెట్టెంపాడు (22 టీఎంసీలు), కల్వకుర్తి(25 టీఎంసీలు), భీమా(20టీఎంసీలు), కోయిల్‌సాగర్(3.90 టీఎంసీ) ప్రాజెక్టు పనులు చివరి దశలో ఉన్నందున ఈ నాలుగు ప్రాజెక్టులకే బడ్జెట్లో రూ.1,633.36 కోట్లు కేటాయించారు. ఈ ఏడాది జూలై నాటికి వీటిని పూర్తిచేసి జిల్లాలో సుమారు 8 లక్షల ఎకరాల మేర ఆయకట్టు సాగులోకి తెచ్చేందుకు ఈ కేటా యింపులు చేసినట్లు తెలుస్తోంది. ఇక వీటితో పాటు కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.6,681 కోట్లు, పాలమూరు ఎత్తిపోతలకు రూ.4 వేల కోట్లు కేటాయించారు. దేవాదుల, డిండి, సీతారామ ఎత్తిపోతల, కంతనపల్లి, దిగువ పెన్‌గంగ వంటి ప్రాజెక్టులకు కేటాయింపులు భారీగా పెరిగాయి. ఆదిలాబాద్ జిల్లాలోని సాత్నాల, మత్తడివాగు, సుద్దవాగు, స్వర్ణ, గొల్లవాగు, నీల్వాయి తదితర ప్రాజెక్టులకు అవసరమైన నిధులు కేటాయించారు. నిధులు సరే.. ఖర్చు ఏది? సాగునీటి రంగానికి భారీగా నిధులు కేటాయిస్తున్నా ఖర్చు అంతంతే ఉంటోంది. గత ఏడాది సాగునీటికి రూ.25 వేల కోట్లు కేటాయించినా ఖర్చు చేసింది రూ.14,918.19 కోట్లే! ఇందులోనూ ఇప్పటివరకు రూ.11,500 కోట్ల మేర బిల్లులు చెల్లింపు కాగా.. మరో రూ.3 వేల కోట్ల మేర పెండింగ్‌లో ఉన్నాయి. పాలమూరు–రంగారెడ్డి పరిధిలో కొలిక్కి రాని భూసేకరణ, సహాయ పునరావాసం, కోర్టు కేసుల కారణంగా ప్రాజెక్టు పరిధిలో అనుకున్న మేర పనులు జరగలేదు. ఈ ప్రాజెక్టుకు ఏకంగా రూ.7,860 కోట్లు కేటాయించినా.. చివరికి దాన్ని రూ.2,851.88 కోట్లకు సవరించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సైతం రూ.6,280 కోట్లు కేటాయించినా.. రూ.2,280 కోట్లకే పరిమితం చేశారు. దేవాదుల, కంతనపల్లి వంటి ప్రాజెక్టుల పరిధిలోనూ ఇదే జరిగింది. ఈ ఏడాది సైతం అదే స్థాయిలో కేటాయింపులు జరిగినా.. ఏమాత్రం ఖర్చు చేస్తారన్నది వేచి చూడాల్సిందే! సింహభాగం కాళేశ్వరానికే.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ఎత్తిపోతలకు బడ్జెట్లో భారీగా నిధులు కేటాయించారు. ఈ ఏడాది ప్రాజెక్టుకు రూ.6,681.87 కోట్లు కేటాయించారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పనుల్లో వేగం పెరగడం, మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్, గంధమల, బస్వాపూర్, రంగనాయక్‌సాగర్ వంటి రిజర్వాయర్లకు రూ.12 వేల కోట్లతో పరిపాలనా అనుమతులు ఇచ్చిన నేపథ్యంలో ఈ ఏడాది పనులు వేగం పుంజుకుంటాయని సాగునీటి శాఖ భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే దీనికి కేటాయింపులను భారీగా పెంచారు. చిన్ననీటికి యథాతథం మైనర్ ఇరిగేషన్‌కు రూ.2,000 కోట్లు హైదరాబాద్: బడ్జెట్లో చిన్న నీటి పారుదలకు ప్రభుత్వం ఈ ఏడాది రూ.2 వేల కోట్లు కేటాయించింది. గతేడాది సవరించిన అంచనాలతో పోలిస్తే ఇది సుమారు రూ.250 కోట్ల మేర ఎక్కువ. ఇందులో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మిషన్ కాకతీయకు రూ.1,283 కోట్లు కేటాయించింది. ఈ నిధులతో దాదాపు 7 వేలకు పైగా చెరువులను పునరుద్ధరించే అవకాశం ఉంది. ఇందులో గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధి నిధి (ఆర్ఐడీఎఫ్) నుంచి సుమారు రూ.242.78 కోట్లు, సాగునీటి స్తవర ప్రాయోజిత పథకం (ఏఐబీపీ) కింద మరో రూ.20 కోట్లు వస్తాయని అంచనా వేసింది. ఇప్పటిరవకు మిషన్ కాకతీయ కింద తొలి విడతో 9 వేలు, రెండో విడతలో 8 వేల చెరువుల పునరుద్ధరణను చిన్న నీటి పారుదల శాఖ పూర్తి చేసింది. మైనర్ ఇరిగేషన్‌కు 2016– 17లో బడ్జెట్లో రూ.2,253 కోట్లు కేటాయిం చింది. అయితే ఈ బడ్జెట్‌ను రూ.1,745.09 కోట్లకు సవరించారు. కాగా ఈ ఏడాది మాత్రం పెండింగ్‌లో ఉన్న చెరువుల పనులను పూర్తి చేయడం, వరదల ధాటికి దెబ్బతిన్న వాటికి మరమ్మతులు, మినీ ట్యాంక్‌బండ్ కింద చేపట్టిన చెరువుల పనులను పూర్తి చేయడం లక్ష్యంగా బడ్జెట్ కేటాయింపులు చేశారు. వివిధ ప్రాజెక్టులకు గతేడాది, ఈసారి కేటాయింపులు ఇలా.. (రూ.కోట్లలో) -
బడ్జెట్‌కు తగ్గట్లే.. ఖరీఫ్ టార్గెట్!
►17 ప్రాజెక్టుల కింద 8.73 లక్షల ఆయకట్టు లక్ష్యం ►ఈ ఖరీఫ్‌లోనే 12 ప్రాజెక్టులు పూర్తిగా.. మరో ఐదు పాక్షికంగా పూర్తి ►వీటికి రూ.11 వేల కోట్ల కేటాయింపులు జరిపిన ప్రభుత్వం హైదరాబాద్: కోటి ఎకరాల తెలంగాణ లక్ష్యంగా చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులకు ఈ ఏడాది బడ్జెట్ కేటాయింపులు ఎంత భారీగా ఉన్నాయో.. ఆ ప్రాజెక్టుల కింద ఖరీఫ్ ఆయకట్టు లక్ష్యాలు కూడా అంతే భారీగా ఉన్నాయి. ఈ ఏడాది చివరి నాటికి 12 ప్రాజెక్టులను 100 శాతం పూర్తి చేయడం, మరో 5 ప్రాజెక్టులను పాక్షికంగా పూర్తి చేసి సుమారు 8.73 లక్షల ఎకరాల మేర ఆయకట్టుకు పూర్తిస్థాయి సాగు నీరివ్వడం నీటి పారుదల శాఖకు కత్తిమీద సాము కానుంది. రాష్ట్రంలో సాగుకు యోగ్యమైన ప్రతి ఎకరాకి నీటిని అందించేందుకు 2004–05లో రూ.1.37 లక్షల కోట్లతో 34 భారీ, మధ్య తరహా ప్రాజెక్టులను చేపట్టారు. అనంతరం తెలంగాణ ప్రభుత్వం పాలమూరు–రంగారెడ్డి, కాళేశ్వరం, భక్తరామదాస ప్రాజెక్టులను చేపట్టింది. ఈ మొత్తం ప్రాజెక్టుల ద్వారా 60 లక్షల ఎకరాల మేర నీరివ్వాలని సంకల్పించగా ఇప్పటివరకు కొత్తగా 11,36,108 ఎకరాల ఆయకట్టు వృద్ధిలోకి వచ్చింది. ఇందులో తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక 5,21,211 ఎకరాల కొత్త ఆయకట్టుకు నీరందించగలిగారు. కల్వకుర్తి కింద 1.60 లక్షలు, నెట్టెంపాడు కింద 1.20 లక్షలు, భీమాలో 1.40 లక్షల ఎకరాల ఆయకట్టు వృద్ధిలోకి వచ్చింది. దేవాదుల కింద కూడా 60 వేల ఎకరాల నుంచి 1,22,670 ఎకరాలకు ఆయకట్టు పెరిగింది. సింగూరు కింద 40 వేల ఎకరాలకు నీరందించారు. మరోవైపు ఈ ఏడాది జూన్, జూలై నాటికి కొత్తగా మరో 8.73 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగు నీరిచ్చేలా ప్రణాళిక తయారైంది. ఇందులో 12 ప్రాజెక్టులను పూర్తిగా, మరో 5 ప్రాజెక్టులను పాక్షికంగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. పాలమూరులో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులతో పాటు, ఎస్సారెస్పీ స్టేజ్–2, ఎల్లంపల్లి, లోయర్ పెన్‌గంగ, ఎస్ఎల్బీసీ వంటి ప్రాజెక్టులున్నాయి. తక్షణ ఆయకట్టునిచ్చే ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇచ్చిన ప్రభుత్వం ఈ 17 ప్రాజెక్టులకే బడ్జెట్లో రూ.11,022 కోట్ల మేర కేటాయింపులు చేసింది. -
అప్పు చేస్తేనే ‘డబుల్’ ఇళ్లు!
బడ్జెట్ కేటాయింపులు రూ.500 కోట్లే హైదరాబాద్: రెండు పడక గదుల ఇళ్లను అప్పు చేసి కట్టనున్నట్టు బడ్జెట్ గణాంకాల ద్వారా ప్రభుత్వం చెప్పకనే చెప్పింది. ఇప్పటిదాకా కేటాయించిన 2.6 లక్షల ఇళ్లగాను ఇప్పటికి 1,426 ఇళ్లను మాత్రమే పూర్తి చేసింది. మరో 16 వేల ఇళ్ల నిర్మాణం మొదలైంది. మిగతావాటికి పునాది కూడా పడలేదు. ఈ ఆర్థిక సంవత్సరంలో వేగంగా పనులు జరిపి వాటిని పూర్తి చేయాలని నిర్ణయించింది. కేటాయించిన ఇళ్ల పరిపూర్తికే దాదాపు రూ.29 వేల కోట్లు కావాలి. కానీ తాజా బడ్జెట్లో రూ.500 కోట్లే కేటాయించారు. రూ.27 వేల కోట్లు హడ్కో నుంచి రుణంగా పొందాలని, మిగతా మొత్తాన్ని బడ్జెట్లో కేటాయించాలని అధికారుల చేసిన ప్రతిపాదనలకు తగ్గట్టుగా రూ.500 కోట్లతోనే ప్రభుత్వం సరిపుచ్చింది. ప్రధాని ఆవాస్ యోజన (పట్టణ)కు రూ.292 కోట్లు, గ్రామీణ ఇళ్లకు రూ.1,149 కోట్లను కేంద్ర ప్రాయోజితం కింద చూపారు.