ఆదాయం పెరిగితే రుణమాఫీ చేయరెందుకు!
పేదలకు కాదు.. పెట్టుబడిదారుల బడ్జెట్: రేవంత్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం పెరిగితే రైతులకు రుణమాఫీ ఎందుకు చేయడంలేదని టీటీడీఎల్పీనేత ఎ.రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యతో కలిసి సోమవారం అసెంబ్లీ మీడియా పాయింట్‌లో మాట్లాడుతూ... ‘రూ.1.09 లక్షల ఆదాయం వస్తే రుణమాఫీ చేయకుండా రైతులను ఎందుకు వేధిస్తున్నారు.
కేసీఆర్ అబద్ధాలకు, అంకెలు, మాటల గారడీకి ఈ బడ్జెట్ పరాకాష్ట. ఫీజు రీయింబర్సుమెంటుకు రూ.4,300 కోట్లు అవసరమైతే రూ.1,900 కోట్లు మాత్రమే కేటాయించారు. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లకు కేటాయింపుల్లేవు. దళితులకు మూడెకరాల భూమి ఇవ్వాల్సి ఉండగా.. ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. ఇది పేదల కోసం కాదు.. పెట్టుబడిదారుల కోసం రూపొందించిన బడ్జెట్.