బీసీ సబ్‌ప్లాన్ ప్రస్తావన ఏదీ?
సాక్షి, హైదరరాబాద్: బడ్జెట్‌లో బీసీ సబ్‌ప్లాన్ గురించి ఎక్కడా ప్రస్తావిం చలేదని టీడీపీ ఎమ్మెల్యే, బీసీ సంఘం నేత ఆర్.కృష్ణయ్య విమర్శిం చారు. సోమవారం ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్ దగ్గర మాట్లాడుతూ.. బీసీ సంక్షేమా నికి కేటాయింపులు ఏమూలకూ సరిపోవన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంటు కోసం కేటాయించిన నిధులు పాతబకాయిలకే సరిపోవన్నారు. ఎంబీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామంటున్న ప్రభుత్వం, ఏయే కులాలు ఎంబీసీ పరిధిలోకి వస్తాయో చెప్పడంలేదన్నారు.
బీసీ కార్పొరేష న్‌కు రూ.1000 కోట్లు కేటాయించి, ఉపాధి కోసం రుణాలను ఇవ్వాలని డిమాండ్ చేశారు. 45వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నా, ఉద్యోగాల భర్తీ ప్రస్తావన లేదన్నారు. ఖాళీగా ఉన్న 2లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయా లని కోరారు. అంకెల్లో భారీగా ఉన్నా అభివృద్ధి, సంక్షేమంలో రాష్ట్రం అడుగున ఉందన్నారు.