పేదల జీవితాలతో ప్రభుత్వం చెలగాటం: కిషన్ రెడ్డి
పేదల జీవితాలతో ప్రభుత్వం చెలగాటం: కిషన్ రెడ్డి
Published Mon, Oct 13 2014 5:39 PM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM
హైదరాబాద్: పేదల జీవితాలతో తెలంగాణ ప్రభుత్వం చెలగాటమాడుతోందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి విమర్శించారు. అదనపు విద్యుత్ కోసం కేసీఆర్ ప్రభుత్వం కేంద్రాన్ని సంప్రదించడం లేదని ఆయన అన్నారు. వాస్తవాలకు విరుద్ధంగా ప్రభుత్వ కార్యాచరణ నడుస్తోందని కిషన్ రెడ్డి విమర్శించారు.
సమగ్ర సర్వే చేసిన తర్వాత వృద్ధులు, వికలాంగుల నుంచి కొత్త దరఖాస్తులు ఎందుకు కోరుతున్నారని ఆయన ప్రశ్నించారు. వృద్ధులు, వికలాంగుల పాపం కేసీఆర్ కు తగులుతుందని కిషన్ రెడ్డి అన్నారు.
Advertisement
Advertisement