చెన్నూర్/చెన్నూర్ రూరల్/మంచిర్యాల టౌన్, న్యూస్‌లైన్ : బీజేపీ మద ్దతుతోనే తెలంగాణ రాష్ర్టం ఏర్పడిందని, భవిష్యత్తులోనూ పునర్‌నిర్మాణం తమతోనే సాధ్యమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం మంచిర్యాల, చెన్నూర్ నియోజకవర్గాల్లో సినీనటులు రాజశేఖర్, జీవితలతో కలి పి పర్యటించారు. మంచిర్యాలలో రోడ్ షో నిర్వహించగా, చెన్నూర్‌లోని జైహింద్ ఆఫీసర్స్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన సభలో మట్లాడారు.
ఈ సందర్భంగా వారికి బీజేపీ, టీడీపీ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. తదుపరి రోడ్ షో, సభల్లో కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. కేంద్రం, రాష్ట్రంలో సుస్థిర పాలన బీజేపీతోనే సాధ్యమని పేర్కొన్నారు. పదేళ్లుగా నిత్యావసర సరకులు, పెట్రోల్, డీజిల్, ఎరువుల ధరలు పెంచి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల నడ్డి విరిచిందన్నారు. కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానలను అవలంబిస్తున్నాయని ఆరోపించారు. కేసీఆర్ ఒక కుటుంబ రాజకీయం చేస్తున్నాడని విమర్శించారు.
తెలంగాణ రాష్ట్ర, దే శ భవిష్యత్తు ప్రజల చేతిలోనే ఉందని, ఓటు ద్వారా దానిని నిరూపిం చుకనే అవకాశం వచ్చిందన్నారు. బీజేపీ పార్టీ గెలిస్తే మంచిర్యాలను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేస్తామన్నారు. చెన్నూర్ ప్రాంతాలో మూసివేసిన సింగరేణి గనులను తెరిపించి యువతకు ఉపాధి ఆవకాశాలు కల్పిస్తానని హామీ ఇచ్చారు. అంతే కాకుండా సూపర్ స్పెషలిటీ ఆస్పత్రి నిర్మాణానికి కృషి చేస్తానని చెప్పారు. అణగారిన వర్గం నుంచి వచ్చిన మోడీ ప్రధానమంత్రి అయితే మన దేశ భవిష్యత్తు బాగుంటుందన్నారు.
పెద్దపెల్లి నియోజకవర్గం నుంచి బీజేపీ, టీడీపీ పార్టీల ఉమ్మడి ఎంపీ అభ్యర్థి జానపాటి శరత్‌బాబును, చెన్నూర్ నియోజవర్గం నుంచి ఎమ్మెల్యేగా బీజేపీ అభ్యర్ధి రాంవేణులను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్ గౌడ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గొనె శ్యాంసుందర్ రావు, జిల్లా నాయకులు దీక్షితులు, అందుగుల శ్రీనివాస్, తంగెడిపల్లి శ్యాంసుందర్, తెలుగు యువత నాయకులు సంజయ్‌కుమార్, రాంరెడ్డి, భాస్కర్‌రెడ్డి, మధునయ్య, కొండపాక చారి, నర్సింహులు, మోహన్, రాజన్న పాల్గొన్నారు.
కేసీఆర్ విమర్శిస్తే సహించం
కేసీఆర్ తమను, తమ పార్టీపై విమర్శలు చేస్తే సహించేది లేదని మంచి ర్యాల రోడ్ షోలో కిషన్‌రెడ్డి అన్నారు. తెలంగాణ కోసం పోరాడాను అంటున్న కేసీఆర్‌పై కేసులే లేవని, తనపై ఢిల్లీతోపాటు రాష్ట్రం లోనూ అనేక కేసులున్నాయన్నారు. పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన తెలంగాణ బిల్లుకు బీజేపీ పట్టుబట్టి మద్దతుగా నిలివడమే కాకుండా బిల్లు ఆమోదానికి సుష్మస్వరాజ్ చేసిన కృషి మరువలేనిదన్నారు. ధరల నియంత్రణ, అవినితిని రూపుమాపడం, రైతాంగ సంక్షేమం, నిరుద్యోగులకు అండ బీజేపీ పార్టీతోనే సాధ్యమని అన్నారు. సింగరేణి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని నిర్మించడం, ఆదాయ పన్నును పూర్తిగా రద్దు చేసేలా కూడా బీజేపీ సాధ్యమవుతుందని అన్నారు.
మొదటి సారి పిల్లలను వదిలివచ్చాను : రాజశేఖర్
తనకు చావు అంటే భయమని ఎటు వెళ్లినా అంతా కలిసి వెళతామని అయితే మొదటిసారి ఇద్దరు పిల్లలను వదిలి మంచిర్యాలకు వచ్చానని సినీ నటుడు రాజశేఖర్ అన్నారు. చనిపోతే అంతా ఒకేసారి కలిసి చని పోవాలి అంతే కాని ఒకరు విడిచి ఒకరు ఉంటే ఆ బాధలు భరించడం కష్టమన్నారు. తెలంగాణ ప్రజల అభిమానం కోసం ఇక్కడకు వచ్చానని తెలిపారు. ఇక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశంలో కాంగ్రెస్, టీఆర్‌ఎస్ అనేక డ్రామాలతో తెలంగాణ ప్రజలను మోసం చేశాయని ఆరోపిం చారు. వేల మంది ఆత్మబలిదానాలను గుర్తించకుండా ఎప్పుడో ప్రకటించాల్సిన తెలంగాణ నేడు స్వార్థం కోసం ఎన్నికల సమయంలో తెలంగాణ ఇచ్చారని తెలిపారు. వేల మంది చావుకు కారణం కేసీఆర్, కాంగ్రెస్‌లేనని అన్నారు. బీజేపీ ద్వారానే తెలంగాణ నవ నిర్మాణం సాధ్యమని తెలిపారు.
బీజేపీ వల్లే మహిళా సంక్షేమం : జీవిత
నేడు మహిళలపై పెరుగుతున్న ఆకృత్యాలు అన్నీఇన్నీ కాదని, మహిళా సంక్షేమం, సాధికారత బీజేపీతోనే సాధ్యమని సినీ నటి జీవిత రాజశేఖర్ అన్నారు. రోడ్ షోలో బీజేపీ మంచిర్యాల ఎమ్మెల్యే అభ్యర్థి ముల్కల్ల మల్లారెడ్డి, పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి శరత్‌బాబు, నాయకులు గోనె శ్యాంసుందర్‌రావు, కెవి ప్రతాప్, పురుషోత్తంజాజు, కృష్ణమూర్తి, మున్నారాజసిసోధ్య, జీవీఆనంద్‌కృష్ణ, గోళిరాము, తులా ఆంజనేయులు, బోకుంట ప్రభ, ముల్కల్ల సునీతారెడ్డి పాల్గొన్నారు.
బీజేపీతోనే తెలంగాణ పునర్‌నిర్మాణం : కిషన్‌రెడ్డి
Published Sat, Apr 26 2014 4:04 AM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM
Advertisement