jeevita
-
రాజశేఖర్ ఆరోగ్యంపై శివాత్మీక ట్వీట్స్..
-
రాజశేఖర్ ఆరోగ్యంపై శివాత్మీక ట్వీట్స్..
హీరో రాజశేఖర్ కుటుంబానికి కరోనా సోకిన సంగతి తెలిసిందే. రాజశేఖర్, ఆయన భార్య జీవిత, వాళ్ల కుమార్తెలు శివానీ, శివాత్మిక కోవిడ్ బారినపడ్డారు. ప్రస్తుతం వీరంతా హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. అయితే వారి కుమార్తెలు శివాత్మిక, శివానీ వెంటనే కోలుకోగా.. రాజశేఖర్, జీవితలకు చికిత్స కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం రాజశేఖర్ ఆరోగ్య పరిస్థితి కొంత ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం. ఈ విషయంపై క్లారిటీ ఇస్తూ ఆయన కుమార్తె శివాత్మిక అరగంటలో రెండు ట్వీట్లు చేశారు. తన తండ్రి ఆరోగ్య పరిస్థితి ఇబ్బందికరంగా ఉందంటూ శివాత్మిక మొదటి ట్వీట్ చేశారు. అందరి అభిమానంతో క్షేమంగా తిరిగొస్తారని ఆశిస్తున్నానని ఆ ట్వీట్లో పేర్కొన్నారు. (చదవండి: మేం బాగానే ఉన్నాం) Dear All. Nanna's fight with covid has been difficult, yet he is fighting hard. We believe that it is your prayers love and well wishes that protect us and keep us going. I am here asking you, to pray for Nanna's speedy recovery! With your love, he'll come out stronger💖🙏 — Shivathmika Rajashekar (@ShivathmikaR) October 22, 2020 మరి కాసేపటికే.. నాన్న బాగానే ఉన్నారంటూ... మరో ట్వీట్ చేశారు శివాత్మిక. కరోనా నుంచి కోలుకుంటున్నారంటూ రెండో ట్వీట్లో పేర్కొన్నారు. ఇక జీవితకు కూడా కరోనా నెగిటివ్‌గా వచ్చినట్లు తెలిసింది. I cannot thank you all enough for your love and wishes! But please know, he is not critical.. he is stable and getting better! We just need your prayers and positivity💖 Thank you once again💖 Do not panic Please do not spread fake news💜 — Shivathmika Rajashekar (@ShivathmikaR) October 22, 2020 -
రీల్లోనే కాదు రియల్‌గాను హిట్ పెయిరే
(వెబ్‌స్పెషల్): రోజులు మారాయి.. ఇప్పుడు అమ్మాయిలు ఉద్యోగాలు చేస్తున్నారు. అబ్బాయిలు కూడా జాబ్ చేసే అమ్మాయిలనే కోరుకుంటున్నారు. పెళ్లి విషయానికి వస్తే.. ఇద్దరు ఉద్యోగం చేస్తూంటే.. అమ్మాయిది, అబ్బాయిది ఒకే ఫీల్డ్ అయితే మరీ మంచిది అంటున్నారు. డాక్టర్లు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు తమ రంగంలోని వారిని వివాహం చేసుకోవడానికే అధిక ప్రాధాన్యత ఇస్తారు. కానీ సినీ ఫీల్డులో మాత్రం ఈ సూత్రం వర్తించదు. ఇండస్ట్రీకి చెందిన వారు ఎక్కువగా బయటి వ్యక్తులను వివాహం చేసుకోవడానికే ప్రాధాన్యత ఇస్తారు. మరీ ముఖ్యంగా హీరో, హీరోయిన్లు పెళ్లి చేసుకున్న సందర్భాలు చాలా తక్కువ. అలా ఇండస్ట్రీలోని వారినే వివాహం చేసుకుని.. రీల్లోనే కాదు రియల్‌గా కూడా హిట్ పెయిర్ అనిపించుకుంటున్న వారిని ఓ సారి చూడండి.. కృష్ణ-విజయ నిర్మల 1961లో కృష్ణకు ఆయన మరదలు ఇందిరతో వివాహం అయ్యింది. ఆ తర్వాత బాపు దర్శకత్వంలో వచ్చిన ‘సాక్షి’ సినిమాలో మొదటిసారి కృష్ణ,విజయ నిర్మల కలిసి నటించారు. ఆ సినిమా సాక్షిగా వీళ్లిద్దరు ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత 1969లో విజయ నిర్మలను కృష్ణ రెండో వివాహం చేసుకున్నారు. ఇద్దరికి ఇది రెండో వివాహం అయినప్పటికి అన్యోన్య దంపతులగా గుర్తింపు తెచ్చుకున్నారు. శ్రీకాంత్-ఊహ ‘ఆమె’ సినిమా షూటింగ్ టైంలో శ్రీకాంత్, ఊహల మధ్య పరిచయం మొదలయింది. ఆ తర్వాత వీరిద్దరూ కలిసి నాలుగు సినిమాల్లో కలిసి నటించారు. ఇంట్లో జరిగే ప్రతి ఫంక్షన్‌కు ఊహను పిలిచేవాడు శ్రీకాంత్. అలా మెల్లిగా శ్రీకాంత్ కుటుంబసభ్యులకు ఊహ అలవాటయ్యారు. ఆ తరువాత ఇరువురి ఇంట్లో ఒప్పుకోవడంతో శ్రీకాంత్ - ఊహ వివాహం 1997లో జరిగింది. వీరికి రోషన్, మేధా, రోహన్ అనే ముగ్గురు పిల్లలు ఉన్నారు. (చదవండి: మొత్తం స్టూడియోలోనే?) జీవిత-రాజశేఖర్ జంట పదాలుగా తెలుగు పరిశ్రమలో ఈ భార్యాభర్తల పేర్లు ఎప్పటికీ పాపులరే. ఓ తమిళ నిర్మాత తన సినిమాకోసం రాజశేఖర్‌కు జోడీగా జీవితను తీసుకున్నారు. మొదటిసారి జీవితను చూసిన రాజశేఖర్ ‘ఈమె వద్దు తొలగించండి’ అంటూ దర్శక నిర్మాతలకు చెప్పారు. ఆయన ఇలా చెప్పడంతో దర్శకనిర్మాతలు.. రాజశేఖర్‌నే తొలగించారు. తరువాత ఈ ఇద్దరూ కలిసి ‘తలంబ్రాలు’ సినిమాలో కలిసి నటించవలసి వచ్చింది. అప్పుడే ఇద్దరి మధ్య పరిచయం పెరిగి, అది కాస్తా ప్రేమగా మారింది. ‘ఆహుతి’ సినిమాలోను కలిసి నటించారు. ఆ సినిమా షూటింగులో రాజశేఖర్ గాయపడినప్పుడు, జీవిత ఆయన దగ్గరే ఉంటూ కంటికి రెప్పలా చూసుకున్నారు. రాజశేఖర్‌పై జీవితకి ఉన్న ప్రేమని అర్థం చేసుకున్న ఆయన కుటుంబ సభ్యులు వీరిద్దరి పెళ్ళికి అంగీకరించారు. 1991 జూలై 10 చెన్నైలో వివాహం చేసుకున్న ఈ జంటకి శివానీ, శివాత్మిక అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. నాగార్జున- అమల టాలీవుడ్ సెలబ్రిటీలలో ప్రేమించి పెళ్లి చేసుకున్న వారిలో అక్కినేని నాగార్జున-అమల జంట గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. చిత్ర పరిశ్రమలో స్టార్ యాక్టర్స్‌గా వెలుగొందుతున్న సమయంలో ఒకరినొకరు అర్థం చేసుకొని వివాహ బంధంతో ఒకటయ్యారు. నాగార్జున - అమల జంట సిల్వర్ స్క్రీన్ పై 'ప్రేమయుద్ధం' 'కిరాయి దాదా' 'శివ' 'నిర్ణయం' సినిమాలలో కలిసి నటించి ప్రేక్షకులను అలరించారు. కాగా 1992 జూన్ 11న వివాహం చేసుకున్నారు. అయితే అంతకు ముందే నాగార్జునకు వెంకటేష్ సోదరితో వివాహం జరగడం.. విడాకులు తీసుకోవడం జరిగింది. (చదవండి: నో ప్యాంట్ 2020.. జీన్స్‌కి గుడ్‌బై) మహేష్‌బాబు-నమ్రత అమ్మాయిల కలల రాకుమారుడు ప్రిన్స్ మహేష్ బాబు. కానీ ఆయనకు మాత్రం భార్య నమ్రత అంటే ఎనలేని ప్రేమ. తన సక్సెస్‌కు కారణం నమ్రత అని చెప్తారు. 2000 సంవత్సరంలో వచ్చిన వంశీ చిత్రంలో వీరిద్దరూ కలిసి నటించారు. అప్పుడే ప్రేమలో పడ్డారు. ఐదేళ్లు లవ్ చేసుకున్న వీరు 2005లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. అతి దగ్గరి కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో అతి నిరాడంబరంగా వీరి వివాహం జరిగింది. వీరికి గౌతమ్, సితార అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. చై-సామ్ ప్రస్తుతం ఉన్న దంపతుల్లో చై-సామ్‌కు ప్రత్యేక క్రేజ్ ఉంది. ఏ మాయ చేశావే చిత్రంలో వీరిద్దరూ తొలిసారి కలిసి నటించారు. ఆ తర్వాత ఆటో నగర్ సూర్య, మనం, వంటి చిత్రాల్లో కలిసి నటించారు. 2017లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. పెళ్లి తర్వాత మజిలీ చిత్రంలో జంటగా నటించారు. (చదవండి: బంధుప్రీతి.. గ్యాంగ్‌వార్.. డ్రగ్స్...) షాలిని- అజిత్ చిన్నప్పుడే సినిమాల్లోకి వచ్చారు షాలిని. బేబీ షాలినిగా ఫుల్ క్రేజ్ సంపాదించుకున్నారు. తరువాత హీరోయిన్గా నటించారు. 2000 సంవత్సరంలో నటుడు అజిత్‌ని వివాహం చేసుకున్నారు షాలిని. వీరిది కూడా అన్యోన్య దాంపత్యం. సూర్య- జ్యోతిక తమిళంలోనే కాకుండా సౌత్ మొత్తం మీద పాపులారిటీ ఉన్న హీరోలలో సూర్య ఒకరు. వ్యక్తిగతంగానే కాక ప్రొఫెషనల్ లైఫ్‌లో కూడా మిస్టర్ పర్ఫెక్ట్ ఇమేజ్ ఉంది. సమయం దొరికితే చాలు ఆయన కుటుంబంతో గడిపేందుకు ఆసక్తి చూపిస్తారు. ఇక సూర్య కూడా హీరోయిన్ జ్యోతికని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 2006 లో వివాహం చేసుకున్న ఈ జంటకు ఒక పాప ఒక బాబు సంతానం. పాప పేరు దియా కాగా బాబు పేరు దేవ్. ఇక వీరే కాక శివ బాలాజీ - మధుమిత, వరుణ్ సందేశ్-వితిక, రాధిక-శరత్ కుమార్, ఆర్య-సయేషా సైగల్ ఉండగా ఇక బాలీవుడ్లో బిగ్ బీ- జయా బచ్చన్, అభిషేక్- ఐశ్వర్య, కరీనా-సైఫ్, దీపికా- రణ్వీర్ దంపతులు ప్రేమించి వివాహం చేసుకుని.. ఆనందంగా, ఆదర్శంగా జీవిస్తున్నారు. -
బ్యాక్‌గ్రౌండ్ అలా వర్కవుట్ అవుతుంది
నెపోటిజమ్ గురించి మాట్లాడాలంటే... ప్రతి ఇండస్ట్రీలోనూ వారసులు ఉన్నారు. కొత్తవారూ వస్తున్నారు. తెలుగు పరిశ్రమలో మూడు నాలుగు తరాలకు సంబంధించిన వారసులు ఉన్నారు. హిందీ పరిశ్రమలో కొందరు చెబుతున్నట్లుగా తెలుగు ఇండస్ట్రీలో ‘నెపోటిజమ్’ ఉందా? ఇదే విషయం గురించి సినిమా నేపథ్యంలేనివాళ్లను, ఉన్నవాళ్లను అడిగి తెలుసుకుందాం... ßæరో రాజశేఖర్, నటి జీవిత ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండానే వచ్చి, సక్సెస్ అయ్యారు. అయితే వారి ఇద్దరు కుమార్తెలు శివాని, శివాత్మిలకు ఈ ఇద్దరూ మంచి బ్యాక్‌గ్రౌండ్. ఈ తేడా గురించి జీవిత మాట్లాడుతూ– ‘‘బ్యాక్‌గ్రౌండ్ ఉందా? లేదా అనేది కాదు.. ఇక్కడ లక్ చాలా ముఖ్యం. ప్రతిభ చాలా చాలా ముఖ్యం. మా అప్పుడు మా అమ్మానాన్నల కష్టాలు తెలుసుకుంటూ పెరిగాం కాబట్టి కష్టాలను అధిగమించి, నిలదొక్కుకున్నాం. అయితే నాకిప్పటికీ ఏమనిపిస్తుందంటే.. బ్యాక్‌గ్రౌండ్ ఉండి ఉంటే రాజశేఖర్‌గారు ఇంకా మంచి స్థాయిలో ఉండి ఉండేవారని. అయితే బ్యాక్‌గ్రౌండ్ లేనంత మాత్రాన ఇక్కడ ఉండలేం అని కాదు. బ్యాక్‌గ్రౌండ్ ఎలా వర్కవుట్ అవుతుందంటే.. ఫస్ట్ సినిమా సక్సెస్ కాకపోయినా మూడు నాలుగు సినిమాలు చేసుకునే పరిస్థితి వాళ్లకి ఉంటుంది. డబ్బులు ఉంటాయి, సపోర్ట్ ఉంటుంది. కానీ బ్యాక్‌గ్రౌండ్ లేనివాళ్లకు ఆ చాన్స్ తక్కువ. టాలెంట్ ఉన్నా పైకి రానివ్వని పరిస్థితి ఇక్కడ లేదు. రానివ్వగలుగుతారు. ఒక్కోసారి బ్యాక్‌గ్రౌండ్ ఉన్నా అవకాశాలు ఇవ్వరు. జీవితారాజశేఖర్ కూతుళ్లు అని అవకాశాలు ఇచ్చేయడం లేదు. తెలుగమ్మాయిలు లేరంటారు. ఉన్నవారికి ఇవ్వరు. ఏ గైడ్‌లైన్స్‌తో చాన్స్ ఇస్తారన్నది చెప్పలేను. కానీ బ్యాక్‌గ్రౌండ్‌లో మా సపోర్ట్ ఉం టుంది కాబట్టి వాళ్లకి ఏ ఇబ్బందీ ఉండదు’’ అన్నారు. – నటి, దర్శక–నిర్మాత జీవితా రాజశేఖర్ శివాని, జీవిత,శివాత్మిక నా గాయాలు చాలా లోతైనవి హీరోగా కొన్ని చిత్రాలు, విలన్‌గా బోలెడన్ని చిత్రాలు, దర్శక–నిర్మాతగా కొన్ని... ఇలా ప్రకాశ్ రాజ్ ఎప్పుడూ బిజీ. ఇటు సౌత్ అటు నార్త్‌కి కావాల్సిన నటుడు. ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా స్వశక్తితో పైకొచ్చిన నటుడు. ‘‘నెపోటిజమ్ నాకు అనుభవమే. దీంతోనే నేను జీవితాన్ని కొనసాగించాను. నా గాయాలు నా రక్తమాంసాలకన్నా లోతైనవి. కానీ ఈ కుర్రాడు (సుశాంత్ సింగ్ రాజ్‌పుత్) నిలబడలేకపోయాడు. ‘మనం నేర్చుకుంటామా? కలలు కన్నవాళ్లు చనిపోకుండా వాళ్ల కోసం నిజంగా మనం నిలబడగలమా? జస్ట్ అడుగుతున్నాను’’ అని ట్వీట్ చేశారు ప్రకాశ్ రాజ్. – నటుడు, దర్శక–నిర్మాత ప్రకాశ్ రాజ్ మాకు రెడ్ కార్పెట్ ఉంటుంది కానీ... విలక్షణ నటుడు మంచు మోహన్‌బాబు కుమార్తెగా లక్ష్మీ మంచుది పెద్ద బ్యాక్‌గ్రౌండ్. మరి.. ఇది ఎంతవరకు ఉపయోగపడిందో లక్ష్మీని అడుగుదాం... అవును.. బ్యాక్‌గ్రౌండ్ ఉన్న మాకు రెడ్ కార్పెట్ ఉంటుంది. మాకు ఈజీగా అవకాశాలు వస్తాయి. వాళ్ల అభిమాన హీరో లేక హీరోయిన్ కూతురనో, కొడుకు అనో మమ్మల్ని ఆదరించడానికి ప్రేక్షకులు రెడీగా ఉంటారు. అయితే ఇవన్నీ ఉన్నా మమ్మల్ని మేం నిరూపించుకోవాలి. నెపోటిజమ్ ఉన్నప్పటికీ ఏ డైరెక్టర్ పిల్లలైనా, హీరోల పిల్లలైనా వారి సత్తా చూపించలేనప్పుడు కళామతల్లి ఆదరించదు. కళామతల్లికి అందరూ ఒకటే. బ్యాక్‌గ్రౌండ్ ఉన్న మాలాంటివాళ్లకు ఫస్ట్ చాన్స్ ఈజీగా వస్తుంది. ఆ తర్వాత మాత్రం మేం నిరూపించుకోవాలి. చెప్పాలంటే చాలా చాలా కష్టపడాలి. ఎందుకంటే అప్పటికే శిఖరాన్ని చేరుకున్న మా పెద్దలు ఉంటారు. మేం వారి స్థాయిని అందుకోవాలని ఎదురు చూస్తారు. ఏ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వచ్చేవారి మీద అంచనాలు ఉండవు. సొంత పోరాటం చేసుకుంటూ ముందుకు వెళ్లిపోవచ్చు. మేం మా తల్లిదండ్రుల పోరాటాన్ని, మా పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లాలి. బయటినుంచి వచ్చినవాళ్లకు, మాకు అదే తేడా. – నటి, నిర్మాత లక్ష్మీ మంచు బ్యాక్‌గ్రౌండ్ లేనివాళ్లూ సక్సెస్ అయ్యారు ‘అలా మొదలైంది’తో దర్శకురాలు కాకముందు నందినీ రెడ్డి సహాయ దర్శకురాలిగా చేశారు. సినిమా నేపథ్యం లేని మహిళ. స్వశక్తితో పైకి వచ్చిన నందనీ రెడ్డి ఏమంటున్నారో చూద్దాం. ఏ ఇండస్ట్రీలో అయినా బ్యాక్‌గ్రౌండ్ ఉన్నవాళ్లూ ఉంటారు.. బయటినుంచి వచ్చినవాళ్లు కూడా ఉంటారు. అయితే అవుటర్స్ కూడా ఇక్కడ స్థిరపడే పరిస్థితులు ఉన్నాయి. నానీని తీసుకుందాం. తనకు బ్యాక్‌గ్రౌండ్ లేదు. కానీ మంచి కథలు ఎన్నుకుని, నటుడిగా వాటికి న్యాయం చేయడంలో సక్సెస్ అయ్యాడు. విజయ్ దేవరకొండ కూడా అంతే. ఇంకా నిఖిల్, నాగశౌర్య.. ఇలా బ్యాక్‌గ్రౌండ్ లేనివాళ్లు హ్యాపీగా సినిమాలు చేసుకోగలుగుతున్నారు. అయితే బ్యాక్‌గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చినవారికి ఉండే లాభం ఏంటంటే.. వాళ్లకు ఈజీగా ఎంట్రీ దొరుకుతుంది. అయితే బ్యాక్‌గ్రౌండ్ ఉన్నవాళ్లంతా సక్సెస్ అవుతున్నారా? అంటే లేదు. మన కళ్లముందే బ్యాక్‌గ్రౌండ్ ఉన్న చాలామంది ఫెయిల్యూర్లో ఉన్నారు. సో.. ఇక్కడ ప్రతిభ ముఖ్యం. – దర్శకురాలు నందినీ రెడ్డి – డి.జి.భవాని -
'కొన్ని కుటుంబాలే శాసిస్తున్నాయి'
హైదరాబాద్: సినీ నటుడు రాజశేఖర్, ఆయన భార్య జీవిత గురువారం తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావును కలిశారు. ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన కేసీఆర్ కు వారు అభినందలు తెలిపారు. చిన్న సినిమాలను బతికించాలని కేసీఆర్ ను కోరినట్టు జీవిత రాజశేఖర్ తెలిపారు. రెండు రాష్ట్రాల్లో సినిమా పరిశ్రమ అభివృద్ధి చెందేలా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశామన్నారు. సినిమా పరిశ్రమను కొన్ని కుటుంబాలే శాసిస్తున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల ముగిసిన ఎన్నికల్లో జీవిత రాజశేఖర్ బీజేపీకి మద్దతు ప్రకటించారు. ఓ స్టార్ హీరో కారణంగా తాను కాంగ్రెస్ పార్టీని వీడినట్టు అంతకుముందు రాజశేఖర్ వెల్లడించారు. -
మోడీతోనే తెలంగాణ అభివృద్ధి
దౌల్తాబాద్, న్యూస్‌లైన్: బీజేపీ అధికారంలోకి వచ్చి నరేంద్రమోడి ప్రధాని అయితేనే తెలంగాణ అభివృద్ధి చెందుతుందని ప్రముఖ సినీనటులు రాజశేఖర్, జీవిత అన్నారు. ఆదివారం వారు దౌల్తాబాద్‌లో దుబ్బాక అసెంబ్లీ బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావుతో కలిసి రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా సినీనటులు మాట్లాడుతూ టీఆర్ఎస్కు ఓటేస్తే తెలంగాణకు ఎలాంటి న్యాయం జరగదన్నారు. కేవలం కేసీఆర్ కుటుంబ సభ్యులకే పదవులు వస్తాయని, అంతేగాక డబ్బుసంచులు కూడా బెట్టుకుంటారన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు ముత్యంరెడ్డికి ఓటేసినా ఫలితముండదని చెప్పారు. ఈ ప్రాంతంలో చేనేత కార్మికులతోపాటు పలువురు ఆత్మహత్యలకు పాల్పడ్డారని వాటికి ప్రభుత్వానిదే బాధ్యత అని వారు పేర్కొన్నారు. టీఆర్ఎస్, కాంగ్రెస్‌లకు ఓటేసి ఇబ్బందులు కొనితెచ్చుకోవద్దని సూచించారు. కమలం గుర్తుకు ఓటేసి రఘునందన్‌రావును గెలిపించాలని వారు కోరారు. ప్రచారంలో బీజేపీ నాయకులు రాజుగౌడ్, కుమ్మరి నర్సింలు తదితరులు పాల్గొన్నారు. -
బీజేపీతోనే తెలంగాణ పునర్నిర్మాణం : కిషన్‌రెడ్డి
చెన్నూర్/చెన్నూర్ రూరల్/మంచిర్యాల టౌన్, న్యూస్‌లైన్ : బీజేపీ మద ్దతుతోనే తెలంగాణ రాష్ర్టం ఏర్పడిందని, భవిష్యత్తులోనూ పునర్నిర్మాణం తమతోనే సాధ్యమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం మంచిర్యాల, చెన్నూర్ నియోజకవర్గాల్లో సినీనటులు రాజశేఖర్, జీవితలతో కలి పి పర్యటించారు. మంచిర్యాలలో రోడ్ షో నిర్వహించగా, చెన్నూర్‌లోని జైహింద్ ఆఫీసర్స్ క్లబ్లో ఏర్పాటు చేసిన సభలో మట్లాడారు. ఈ సందర్భంగా వారికి బీజేపీ, టీడీపీ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. తదుపరి రోడ్ షో, సభల్లో కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. కేంద్రం, రాష్ట్రంలో సుస్థిర పాలన బీజేపీతోనే సాధ్యమని పేర్కొన్నారు. పదేళ్లుగా నిత్యావసర సరకులు, పెట్రోల్, డీజిల్, ఎరువుల ధరలు పెంచి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల నడ్డి విరిచిందన్నారు. కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానలను అవలంబిస్తున్నాయని ఆరోపించారు. కేసీఆర్ ఒక కుటుంబ రాజకీయం చేస్తున్నాడని విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర, దే శ భవిష్యత్తు ప్రజల చేతిలోనే ఉందని, ఓటు ద్వారా దానిని నిరూపిం చుకనే అవకాశం వచ్చిందన్నారు. బీజేపీ పార్టీ గెలిస్తే మంచిర్యాలను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేస్తామన్నారు. చెన్నూర్ ప్రాంతాలో మూసివేసిన సింగరేణి గనులను తెరిపించి యువతకు ఉపాధి ఆవకాశాలు కల్పిస్తానని హామీ ఇచ్చారు. అంతే కాకుండా సూపర్ స్పెషలిటీ ఆస్పత్రి నిర్మాణానికి కృషి చేస్తానని చెప్పారు. అణగారిన వర్గం నుంచి వచ్చిన మోడీ ప్రధానమంత్రి అయితే మన దేశ భవిష్యత్తు బాగుంటుందన్నారు. పెద్దపెల్లి నియోజకవర్గం నుంచి బీజేపీ, టీడీపీ పార్టీల ఉమ్మడి ఎంపీ అభ్యర్థి జానపాటి శరత్‌బాబును, చెన్నూర్ నియోజవర్గం నుంచి ఎమ్మెల్యేగా బీజేపీ అభ్యర్ధి రాంవేణులను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్ గౌడ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గొనె శ్యాంసుందర్ రావు, జిల్లా నాయకులు దీక్షితులు, అందుగుల శ్రీనివాస్, తంగెడిపల్లి శ్యాంసుందర్, తెలుగు యువత నాయకులు సంజయ్‌కుమార్, రాంరెడ్డి, భాస్కర్‌రెడ్డి, మధునయ్య, కొండపాక చారి, నర్సింహులు, మోహన్, రాజన్న పాల్గొన్నారు. కేసీఆర్ విమర్శిస్తే సహించం కేసీఆర్ తమను, తమ పార్టీపై విమర్శలు చేస్తే సహించేది లేదని మంచి ర్యాల రోడ్ షోలో కిషన్‌రెడ్డి అన్నారు. తెలంగాణ కోసం పోరాడాను అంటున్న కేసీఆర్‌పై కేసులే లేవని, తనపై ఢిల్లీతోపాటు రాష్ట్రం లోనూ అనేక కేసులున్నాయన్నారు. పార్లమెంట్లో ప్రవేశపెట్టిన తెలంగాణ బిల్లుకు బీజేపీ పట్టుబట్టి మద్దతుగా నిలివడమే కాకుండా బిల్లు ఆమోదానికి సుష్మస్వరాజ్ చేసిన కృషి మరువలేనిదన్నారు. ధరల నియంత్రణ, అవినితిని రూపుమాపడం, రైతాంగ సంక్షేమం, నిరుద్యోగులకు అండ బీజేపీ పార్టీతోనే సాధ్యమని అన్నారు. సింగరేణి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని నిర్మించడం, ఆదాయ పన్నును పూర్తిగా రద్దు చేసేలా కూడా బీజేపీ సాధ్యమవుతుందని అన్నారు. మొదటి సారి పిల్లలను వదిలివచ్చాను : రాజశేఖర్ తనకు చావు అంటే భయమని ఎటు వెళ్లినా అంతా కలిసి వెళతామని అయితే మొదటిసారి ఇద్దరు పిల్లలను వదిలి మంచిర్యాలకు వచ్చానని సినీ నటుడు రాజశేఖర్ అన్నారు. చనిపోతే అంతా ఒకేసారి కలిసి చని పోవాలి అంతే కాని ఒకరు విడిచి ఒకరు ఉంటే ఆ బాధలు భరించడం కష్టమన్నారు. తెలంగాణ ప్రజల అభిమానం కోసం ఇక్కడకు వచ్చానని తెలిపారు. ఇక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశంలో కాంగ్రెస్, టీఆర్ఎస్ అనేక డ్రామాలతో తెలంగాణ ప్రజలను మోసం చేశాయని ఆరోపిం చారు. వేల మంది ఆత్మబలిదానాలను గుర్తించకుండా ఎప్పుడో ప్రకటించాల్సిన తెలంగాణ నేడు స్వార్థం కోసం ఎన్నికల సమయంలో తెలంగాణ ఇచ్చారని తెలిపారు. వేల మంది చావుకు కారణం కేసీఆర్, కాంగ్రెస్‌లేనని అన్నారు. బీజేపీ ద్వారానే తెలంగాణ నవ నిర్మాణం సాధ్యమని తెలిపారు. బీజేపీ వల్లే మహిళా సంక్షేమం : జీవిత నేడు మహిళలపై పెరుగుతున్న ఆకృత్యాలు అన్నీఇన్నీ కాదని, మహిళా సంక్షేమం, సాధికారత బీజేపీతోనే సాధ్యమని సినీ నటి జీవిత రాజశేఖర్ అన్నారు. రోడ్ షోలో బీజేపీ మంచిర్యాల ఎమ్మెల్యే అభ్యర్థి ముల్కల్ల మల్లారెడ్డి, పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి శరత్‌బాబు, నాయకులు గోనె శ్యాంసుందర్‌రావు, కెవి ప్రతాప్, పురుషోత్తంజాజు, కృష్ణమూర్తి, మున్నారాజసిసోధ్య, జీవీఆనంద్కృష్ణ, గోళిరాము, తులా ఆంజనేయులు, బోకుంట ప్రభ, ముల్కల్ల సునీతారెడ్డి పాల్గొన్నారు.