మోడీతోనే తెలంగాణ అభివృద్ధి | telangana develop with narendra modi | Sakshi
Sakshi News home page

మోడీతోనే తెలంగాణ అభివృద్ధి

Published Mon, Apr 28 2014 12:14 AM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM

telangana develop with narendra modi

దౌల్తాబాద్, న్యూస్‌లైన్: బీజేపీ అధికారంలోకి వచ్చి నరేంద్రమోడి ప్రధాని అయితేనే తెలంగాణ అభివృద్ధి చెందుతుందని ప్రముఖ సినీనటులు రాజశేఖర్, జీవిత అన్నారు. ఆదివారం వారు దౌల్తాబాద్‌లో దుబ్బాక అసెంబ్లీ బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావుతో కలిసి రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా సినీనటులు మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌కు ఓటేస్తే తెలంగాణకు ఎలాంటి న్యాయం జరగదన్నారు. కేవలం కేసీఆర్ కుటుంబ సభ్యులకే పదవులు వస్తాయని, అంతేగాక డబ్బుసంచులు కూడా బెట్టుకుంటారన్నారు.

 కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు ముత్యంరెడ్డికి ఓటేసినా ఫలితముండదని చెప్పారు. ఈ ప్రాంతంలో చేనేత కార్మికులతోపాటు పలువురు ఆత్మహత్యలకు పాల్పడ్డారని వాటికి ప్రభుత్వానిదే బాధ్యత అని వారు పేర్కొన్నారు. టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లకు ఓటేసి ఇబ్బందులు కొనితెచ్చుకోవద్దని సూచించారు. కమలం గుర్తుకు ఓటేసి రఘునందన్‌రావును గెలిపించాలని వారు కోరారు. ప్రచారంలో బీజేపీ నాయకులు రాజుగౌడ్, కుమ్మరి నర్సింలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement