Mutyam Reddy
-
నేనేం తప్పు చేశా!
సాక్షి, సిద్దిపేట: ‘నా నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితంలో ఏనాడూ ప్రజాభిప్రాయాలకు వ్యతిరేకంగా పని చేయలేదు. ప్రజల పక్షాన ఉంటూ వారి సమస్యలను పరిష్కరించడమే ధ్యేయంగా పని చేస్తున్నా. దానికి గుర్తింపుగా నాలుగు పర్యాయాలు నన్ను ఎమ్మెల్యేగా ఈ ప్రాంత ప్రజలు గెలిపించారు. టీడీపీ ప్రభుత్వంలో.. కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా, అంచనాల కమిటీ చైర్మన్‌గా ఉన్నత పదవులను చేపట్టాను. ప్రజలకు చేరువయ్యాను. నా సేవలను గుర్తించి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పిలిచి మరీ పార్టీ టికెట్ ఇచ్చారు. ఆయన ఆశీస్సులతో మరోసారి ఈ ప్రాంత ఎమ్మెల్యేగా గెలుపొందాను. ఇంతటి ప్రజాదరణ ఉన్న నేను ఏం తప్పు చేశానని నాకు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వలేదు’ అని మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి గద్గద స్వరంతో అంటూ కంటతడి పెట్టారు. దొమ్మాట, దుబ్బాక నియోజకవర్గాలకు 3 పర్యాయాలు టీడీపీ నుంచి, 2009లో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ద్వారా మొత్తం నాలుగు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలుపొందారు. అప్పట్లో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రిగా, అంచనాల కమిటీ చైర్మన్, టీటీడీ బోర్డు సభ్యుడిగా పలు పదవులను అలంకరించారు. 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట రామలింగారెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. అప్పటి నుండి ఇప్పటివరకు ప్రతిపక్ష నాయకుడిగా నియోజకవర్గంలో పనిచేస్తూ పార్టీ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకున్నారు. ఈ ఎన్నికల్లో పార్టీ తనకే టికెట్ ఇస్తుందని భావించి భంగపడ్డారు. మహాకూటమి పొత్తుల్లో భాగంగా దుబ్బాక స్థానాన్ని టీజేఎస్‌కు అప్పగించారు. దీనిపై కలత చెందిన ఆయన ఆదివారం కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తీరుపై అసహనం వ్యక్తం చేశారు. మహనీయులు స్థాపించిన కాంగ్రెస్ పార్టీలో నైతిక విలువలు లేకుండా పోతున్నాయని తొగుటలోని తన నివాసంలో ఆవేదన వ్యక్తం చేశారు. ఆయనను ఓదార్చేందుకు వచ్చిన మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు, మాజీ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి ఎదుట తన బాధను వ్యక్తం చేస్తూ కంటతడి పెట్టారు. విభిన్న ధ్రువాలు ఒక్కటవుతున్నాయి.. గతంలో తెలుగుదేశం పార్టీలో సీఎం కేసీఆర్, ముత్యంరెడ్డిలు ఎమ్మెల్యేలుగా కలిసి పనిచేశారు. ఒకే జిల్లాతో పాటు ఒకే రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉన్న దొమ్మాట, సిద్దిపేటలలో ఎమ్మెల్యేలుగా ఉ న్న ఇరువురిలో ఒక్కరికే మంత్రి పదవి ఇవ్వాలన్న సమీకరణాలతో ముత్యంరెడ్డికి పౌరసరఫరాల శాఖ మంత్రి పదవి ఇచ్చారు. దీంతో అప్పట్లో కేసీఆర్‌కు మంత్రి పదవి దక్కలేదు. ఆ సమయంలో వీరిరువురికి మధ్య విభేదాలు తలెత్తాయి. అనంతరం కేసీఆర్ తెలంగాణ నినాదంతో టీఆర్ఎస్ పార్టీని స్థాపించారు. నాడు ఒకే పార్టీలో విరోధులుగా ఉన్న కేసీఆర్, ముత్యంరెడ్డిలు ఇప్పుడు తిరి గి మిత్రులుగా మారనున్నారు. ఇదిలా ఉంటే మూడేళ్ల క్రితం అనారోగ్యంతో బాధపడిన ముత్య ంరెడ్డికి కేసీఆర్ చికిత్స కోసం సాయం అందించారు. రాజకీయపరంగా శత్రువులుగా ఉన్నా సాయం అడిగిన వెంటనే కేసీఆర్ ఏమాత్రం ఆలోచించకుండా అందించడంతోపాటు ఇప్పుడు కాం గ్రెస్ టికెట్ దక్కక నిరాశతో ఉన్న సమయంలోనూ ఆయన్ను టీఆర్ఎస్లోకి ఆహ్వానించి పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే ఆయనను హరీశ్‌రావు, రామలింగారెడ్డిలు కలిసి విషయాన్ని వెల్లడించారు. ఎప్పుడు కూటమి ఏర్పడినా ‘ముత్యం’కు మొండిచేయి.. సార్వత్రిక ఎన్నికల సమయంలో ఎప్పుడు కూట మి ఏర్పడినా మాజీ మంత్రి ముత్యంరెడ్డికి మా త్రం మొండిచేయి చూపుతూ వచ్చారు. 2009 సాధారణ ఎన్నికల సమయంలో టీఆర్ఎస్, టీడీపీ, సీపీఐ, సీపీఎంలు మహాకూటమిగా ఏర్పడ్డాయి. ఆ సమయంలో దుబ్బాక స్థానం కూటమి నుంచి టీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న సోలిపేట రామలింగారెడ్డికి దక్కింది. దీంతో టీడీపీలో ఉన్న ముత్యంరెడ్డికి చుక్కెదురైంది. కాగా అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి.. ముత్యంరెడ్డిని పార్టీలో చేర్చుకుని కాంగ్రెస్ టికెట్ ఇవ్వడంతో ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందారు. కాగా ప్రస్తుత ఎన్నికల్లోనూ కాంగ్రెస్, టీజేఎస్, సీపీఐలు మహాకూటమిగా ఏర్పడడంతో దుబ్బాక టికెట్ ముత్యంరెడ్డికి కాకుండా టీజేఎస్‌కు కేటాయించడంతో మరోసారి ఆయనకు కూటమిలో ఎదురుదెబ్బ తగిలినట్టయింది. -
టీఅర్ఎస్లో చేరనున్న మాజీ మంత్రి ముత్యంరెడ్డి
-
ఎమ్మెల్యే సోదరుడినంటూ వీరంగం
బస్సు డ్రైవర్‌పై దాడి ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు మెహిదీపట్నంలో ఘటన గోల్కొండ: ‘ఎమ్మెల్యే సోదరుడిని.. నాకే సైడ్ ఇయ్యవా?’ అని దూషిస్తూ ఓ యువకుడు మరో యువకుడితో కలిసి ఆర్టీసీ డ్రైవర్‌ను చితకబాదారు. బస్సు అద్దాలు సైతం ధ్వంసమయ్యాయి. బస్సు డ్రైవర్ పోలీసులను ఆశ్రయించాడు. ఈ ఘటన మంగళవారం రాత్రి ఆసిఫ్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. బస్సు డ్రైవర్, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం..ఉప్పల్ డిపోకు చెందిన (రూట్ నం.113ఎం) బస్సు (ఏపీ29జెడ్-3680) మంగళవారం రాత్రి ఉప్పల్ నుంచి మెహిదీపట్నం వచ్చింది. మెహిదీపట్నం ప్రధాన బస్టాప్‌లోని పాయింట్లో ఆపడానికి డ్రైవర్ ముత్యంరెడ్డి పీవీ ఎక్స్‌ప్రెస్‌వే పిల్లర్ నంబర్ 22 వద్ద బస్సును యూటర్న్ తీసుకుంటున్నాడు. అదే సమయంలో స్కూటీపై ఉన్న ఓ ఇద్దరు వ్యక్తులు యూటర్న్ తీసుకుంటున్నారు. పూర్తిగా బస్సు ముందుకు వచ్చి స్కూటీని ఆపారు. షాహెద్, జాహెద్ అనే ఈ ఇద్దరు బస్సులోకి చొచ్చుకెళ్లి డ్రైవర్‌ను దుర్భాషలాడుతూ పిడి గుద్దులు కురిపించారు. వారిలో ఒకరు ‘నేను ఎమ్మెల్యే సోదరుడిని’ అంటూ బెదిరించి బస్సు దిగిపోయాడు. బస్సు పాయింట్ వద్దకు వచ్చి ఆగగానే మళ్లీ బస్సులోకి వచ్చిన ఆ యువకులు డ్రైవర్ ముత్యంరెడ్డిని చితకబాదారు. ఈ క్రమంలో బస్సు అద్దాలు ధ్వంసమయ్యాయి. దీంతో డ్రైవర్ ముత్యంరెడ్డి హుమాయూన్‌నగర్ పోలీస్‌స్టేషన్ ముందు బస్సు ఆపి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సంఘటన జరిగింది ఆసిఫ్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోనిది అంటూ హుమాయూన్‌నగర్ పోలీసులు ముత్యంరెడ్డితో అన్నారు. దీంతో ముత్యంరెడ్డి బస్సు కండక్టర్ రామలింగంతో కలిసి ఆసిఫ్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. డ్రైవర్‌పై దాడి చేసినవారు ఓ ఎమ్మెల్యే బంధువులు అని చెబుతుండడంతో పోలీసులు ఆచితూచి వ్యవహరించారు. దాడిచేసిన షాహెద్, జాహెద్ లు ఆసిఫ్‌నగర్ పోలీస్‌స్టేషన్ లో ఉండగా మరికొందరు అక్కడకు వచ్చి తమ వారినే ప్రశ్నిస్తారా? అంటూ ఇన్స్పెక్టర్తో వాగ్వాదానికి దిగి వీరంగం సృష్టించారు. ఇదే సమయంలో ఏసీపీ డి.శ్రీనివాస్ అక్కడకు వచ్చి పరిస్థితిని చక్కదిద్దారు. డ్రైవర్ ముత్యంరెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దాడికి పాల్పడిన షాహెద్, జాహెద్లను అదుపులోకి తీసుకున్నారు. వీరు పాతబస్తీలోని తలాబ్ కట్టకు చెందిన వారని, బట్టల వ్యాపారం చేస్తుంటారని తెలిసింది. -
అందరి దృష్టి దుబ్బాకపైనే
దుబ్బాక,న్యూస్‌లైన్: ఇటీవల జరిగిన ఎన్నికల్లో అందరి దృష్టి దుబ్బాక నియోజకవర్గంపైనే ఉంది. నియోజకవర్గంలో కాంగ్రెస్, టీఆర్ఎస్ మధ్యన నువ్వా..నేనా అన్నట్లుగా పోటీ ఉంది. ఇక్కడ ప్రధాన పార్టీలైన కాంగ్రెస్ నుంచి చెరుకు ముత్యంరెడ్డి, టీఆర్ఎస్ నుంచి సోలిపేట రామలింగారెడ్డి, బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు, వైఎస్సార్ సీపీ అభ్యర్థి శ్రవణ్‌కుమార్ గుప్తా పోటీ చేశారు. వీరితో పాటు బీఎస్పీ నుంచి రాచకట్ల లక్ష్మి, ఎంఎస్పీ నుంచి గడ్డం మోహన్‌రెడ్డితో పాటు మరో ఐదుగురు స్వతంత్ర అభ్యర్థులు పోటీ చేసిన విషయం తెలిసిందే. వీరిలో కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు ముత్యంరెడ్డి, టీఆర్ఎస్ అభ్యర్థి రామలింగారెడ్డి మధ్య పోటీ తీవ్రంగా ఉంది. వీరితో పాటు బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు చాపకింద నీరులా ప్రచారం నిర్వహించి ఓటు బ్యాంకునుపెంచుకున్నారు. అయితే కాంగ్రెస్‌తో పాటు టీఆర్ఎస్ ఓట్లను బీజేపీ భారీగానే చీల్చినట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. వైఎస్సార్ సీపీ అభ్యర్థి శ్రవణ్‌కుమార్‌కు దివంగత నేత వైఎస్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు మేలు చేయవచ్చని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చే స్తున్నారు. ఇప్పటి వరకు ఆ ఇద్దరే .. నియోజకవర్గంలో (గతంలో దొమ్మటగా ఉన్న సమయంలో నుంచి) చెరుకు ముత్యంరెడ్డి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 1989లో టీడీపీ నుంచి చెరుకు ముత్యంరెడ్డి తొలిసారిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆనంతరం 1994లో, 1999లో వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి హ్యట్రిక్ సాధించారు. అదేవిధంగా ముత్యంరెడ్డి (దుబ్బాకలో 2004 సార్వత్రిక, 2008 ఉప ఎన్నిక, 2005లో సిద్దిపేట ఉప ఎన్నికలో పోటీ చేసి ఓటమి పాలయ్యారు.) ఐదేళ్లలో వరుసగా మూడుసార్లు ఓటమి చెంది రికార్డుకెక్కారు. టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట రామలింగారెడ్డి 2004 సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి తొలిసారిగా పోటీ చేసి ప్రత్యర్థి ముత్యంరెడ్డిపై విజయం సాధించారు. ఆనంతరం 2008 ఉప ఎన్నికలో కూడా చెరుకు ముత్యంరెడ్డిపై రామలింగారెడ్డి విజయం సాధించారు. 2009 సార్వత్రిక ఎన్నికల్లో మహాకూటమి ఏర్పాటుతో ముత్యంరెడ్డికి టీడీపీ నుంచి పోటీ చేసే అవకాశం దక్కలేదు. దీంతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కాంగ్రెస్ నుంచి ముత్యంరెడ్డికి పోటీ చేసే అవకాశం కల్పించారు. ఆ ఎన్నికల్లో ముత్యంరెడ్డి టీఆర్ఎస్ అభ్యర్థి రామలింగారెడ్డిపై 2640 ఓట్లతో స్వల్ప మెజార్టీతో విజయం సాధించారు. అయితే ఈ ఎన్నికల్లో కూడా ముత్యంరెడ్డి, రామలింగారెడ్డి మధ్యనే తీవ్ర పోటీ ఉంది. 2004 నుంచి 2014 ఎన్నికల వరకు అంటే మూడు సార్వత్రిక, ఒక ఉప ఎన్నిక జరిగింది. ఈ నాలుగు ఎన్నికల్లో కూడా ముత్యంరెడ్డి, రామలింగారెడ్డి మధ్యే పోటీ ఉండడం విశేషం. ఇప్పటి వరకు 2004 సార్వత్రిక ఎన్నికల్లో, 2008 ఎన్నికల్లో ప్రత్యర్థి ముత్యంరెడ్డిపై రామలింగారెడ్డి గెలుపొందారు. 2009లో రామలింగారెడ్డిపై ముత్యంరెడ్డి విజయం సాధించారు. అయితే ఈ ఎన్నికల్లో నియోజకవర్గ ఓటర్లు ఆ ఇద్దరిలో ఎవరికి విజయాన్ని అందిస్తారో వేచి చూడాల్సిందే. ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు ఆ రెండు పార్టీల అభ్యర్థుల ఓట్లను చీల్చి తనకంటూ ప్రత్యేకత సాదించుకున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. -
మోడీతోనే తెలంగాణ అభివృద్ధి
దౌల్తాబాద్, న్యూస్‌లైన్: బీజేపీ అధికారంలోకి వచ్చి నరేంద్రమోడి ప్రధాని అయితేనే తెలంగాణ అభివృద్ధి చెందుతుందని ప్రముఖ సినీనటులు రాజశేఖర్, జీవిత అన్నారు. ఆదివారం వారు దౌల్తాబాద్‌లో దుబ్బాక అసెంబ్లీ బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావుతో కలిసి రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా సినీనటులు మాట్లాడుతూ టీఆర్ఎస్కు ఓటేస్తే తెలంగాణకు ఎలాంటి న్యాయం జరగదన్నారు. కేవలం కేసీఆర్ కుటుంబ సభ్యులకే పదవులు వస్తాయని, అంతేగాక డబ్బుసంచులు కూడా బెట్టుకుంటారన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు ముత్యంరెడ్డికి ఓటేసినా ఫలితముండదని చెప్పారు. ఈ ప్రాంతంలో చేనేత కార్మికులతోపాటు పలువురు ఆత్మహత్యలకు పాల్పడ్డారని వాటికి ప్రభుత్వానిదే బాధ్యత అని వారు పేర్కొన్నారు. టీఆర్ఎస్, కాంగ్రెస్‌లకు ఓటేసి ఇబ్బందులు కొనితెచ్చుకోవద్దని సూచించారు. కమలం గుర్తుకు ఓటేసి రఘునందన్‌రావును గెలిపించాలని వారు కోరారు. ప్రచారంలో బీజేపీ నాయకులు రాజుగౌడ్, కుమ్మరి నర్సింలు తదితరులు పాల్గొన్నారు. -
ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు
మెదక్ రూరల్, న్యూస్‌లైన్: ప్రజాస్వామ్య పద్దతుల్లోనే ఎన్నికలు నిర్వహించాలని సిద్దిపేట, మెదక్ ఆర్డీఓలు ముత్యంరెడ్డి, వనజాదేవీలు అన్నారు. మెదక్, నర్సాపూర్, ఆందోల్ డివిజన్లోని ఎన్నికల అధికారులతో సోమవారం మెదక్ మండల పరిధిలోని హవేళిఘణపూర్ శివారులోగల వైపీఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముఖ్య అథితులుగా హాజరై వారు మాట్లాడారు. 2014లో జరగబోయే సాధారణ ఎన్నికలను ప్రజాస్వామ్య విలువలను పెంపొందించే విదంగా నిర్వహించాలని వారు తెలిపారు. ఎన్నికల్లో అలసత్వం వహిస్తే అధికారులపై చట్టప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రభుత్వాదేశాను సారం ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థి, రూ. 20 లక్షలు ఖర్చు చేయాల్సి ఉండగా ఎంపి అభ్యర్థి రూ. 70 లక్షలు మాత్రమే ఖర్చు చేయాల్సి ఉందని వారు తెలిపారు. నిర్ణీత వ్యయంకన్నా పైసా ఖర్చు ఎక్కువ చేసినట్లు తేలితే సదరు అభ్యర్థి గెలుపును సైతం నిలిపివేసే అధికారం ఎన్నికల కమిషన్‌కు ఉందన్నారు. అంతేకాకుండా పోస్టర్లు, ప్రభుత్వ కార్యాలయాలకు, విద్యుత్ స్తంభాలు ఎట్టిపరిస్థితిలో కట్టకూడదన్నారు. ప్రవేట్ ఇళ్లకు కట్టినా సంబంధిత ఇంటి యజమాని అనుమతి పొందాకనే కట్టాలన్నారు. ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు ర్యాలీలు, మోటర్‌సైకిల్ ర్యాలీలు, సభలు, సమావేశాలు, నిర్వహించిన సంబంధిత అధికారుల నుంచి అనుమతులు పొందాకనే నిర్వహించాలన్నారు. ఇందుకోసం ఎప్పటికప్పుడు ప్రభుత్వం నియమించిన వ్యక్తులు వీడియో తీయాలన్నారు. అభ్యర్థులు ప్రచారానికి వెళ్లినప్పుడు ఎన్ని వాహనాలను ర్యాలీలో ఉపయోగిస్తున్నారు, అందుకయ్యేఖర్చు ఎంత ఎప్పటికప్పుడు స్పష్టంగా లెక్కలను అభ్యర్థులనుంచి సేకరించాలన్నారు. ఒకవేళ ఎవరైనా అభ్యర్థి అక్రమంగా ఓటర్లకు డబ్బులు పంచినా, డబ్బులు దొరికినా వెంటనే ఆ విషయాన్ని ఐటీ అధికారులకు సమాచారం ఇస్తే సంబంధిత అభ్యర్థిపై కేసులు నమోదు చేస్తారన్నారు. కార్యక్రమంలో మెదక్ డీఎస్పీ గోధ్రుతోపాటు మెదక్, నర్సాపూర్, ఆందోల్ నియోజకర్గాల అధికారులు పాల్గొన్నారు. -
అధికార పార్టీ ఎమ్మెల్యేలకు లభించని కలెక్టర్ దర్శనం
సాక్షి, సంగారెడ్డి: జిల్లా కలెక్టర్ స్మితా సబర్వాల్ వ్యవహార శైలి ఇద్దరు అధికార పార్టీ ఎమ్మెల్యేలను ఖంగు తినిపించింది. కలెక్టర్‌ను కలవడానికి గురువారం ఆమె కార్యాలయానికి వచ్చిన దుబ్బాక, పటాన్చెరు ఎమ్మెల్యేలు చెరుకు ముత్యంరెడ్డి, నందీశ్వర్ గౌడ్లకు పరాభవం ఎదురైంది. ఇద్దరిలో ఓ ఎమ్మెల్యే కలెక్టర్‌ను కలుసుకోలేకే వెనుతిరిగిపోగా.. మరో ఎమ్మెల్యే దాదాపు రెండు గంటలకు పైగా ఎదురు చూడాల్సి వచ్చింది. ఇంతకీ ఏం జరిగిందంటే...జిల్లా కలెక్టర్ స్మితా సబర్వాల్ గురువారం మధ్యాహ్నం తన కార్యాలయ సమావేశ మందిరంలో విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల వరకు ఈ సమావేశం జరిగింది. సమావేశం ప్రారంభమైన కొద్ది సేపటి తర్వాత ఎమ్మెల్యేలు చెరుకు ముత్యంరెడ్డి ముత్యం రెడ్డి, నందీశ్వర్ గౌడ్లు కలెక్టర్‌ను కలవడానికి ఆమె కార్యాలయానికి వచ్చారు. ఎమ్మెల్యేలు వచ్చిన విషయాన్ని కార్యాలయ సిబ్బంది సమావేశంలో ఉన్న కలెక్టర్‌కు చేరవేశారు. అయితే, కలెక్టర్ స్మితా సబర్వాల్ సమావేశంలో పాల్గొనడానికే మొగ్గు చూపడంతో ఎమ్మెల్యేలు వేచి చూడక తప్పని పరిస్థితి ఏర్పడింది. దాదాపు అర్ధగంటకు పైగా వేచి చూసిన పటాన్చెరు ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ కలెక్టర్‌ను కలుసుకోకుండానే వెనుతిరిగారు. ఎమ్మెల్యే చెరుకు ముత్యం రెడ్డి మాత్రం మధ్యాహ్నం 3 గంటల వరకు వేచి చూసి కలెక్టర్‌ను రాగానే ఆమెతో కాసేపు మాట్లాడి వెళ్లిపోయారు. ఈ అంశంపై ముత్యంరెడ్డి ‘సాక్షి’తో ఫోన్లో మాట్లాడుతూ .. మొక్కజొన్న కొనుగోళ్లు పూర్తై రైతులకు మార్క్‌ఫెడ్ ఇంకా డబ్బులు చెల్లించలేదనే విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకురావడానికి వచ్చినట్లు తెలిపారు. ఇదిలా ఉండగా.. ఈ నేతలిద్దరూ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీలో సభ్యులైనప్పటికీ సమావేశంలో పాల్గొనకుండా కలెక్టర్‌ను కలవడానికే మొగ్గు చూపడం విశేషం. -
అడ్వకేట్ జనరల్‌పై అసెంబ్లీ అంచనాల కమిటీ అసంతృప్తి
హైదరాబాద్: రాష్ట్ర అడ్వకేట్ జనరల్ సుదర్శన రెడ్డి తీరుపై అసెంబ్లీ అంచనాల కమిటీ అసంతృప్తి వ్యక్తం చేసింది. అసెంబ్లీ కమిటీ హాలులో గత రెండు రోజులుగా ఈ కమిటీ సమావేశాలు జరుగుతున్నాయి. వ్యవసాయ రంగానికి చెందిన పలు అంశాలను సమీక్షించారు. ప్రతి మార్కెట్ యార్డులో బహిరంగ షెడ్లు నిర్మించాలని కమిటీ ప్రభుత్వానికి సూచన చేసింది. వివిధ ప్రభుత్వ శాఖలలో కేసుల పెండింగ్‌లో ఉండటానికి పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ వైఫల్యమే కారణమని అసెంబ్లీ అంచనాల కమిటీ చైర్మన్ ముత్యంరెడ్డి చెప్పారు. ఇదిలా ఉండగా, ఆంధ్రప్రదేశ్ అవతరణ తర్వాత తొలిసారిగా తెలంగాణ ప్రాంతానికి చెందిన సుదర్శన్ రెడ్డి అడ్వొకేట్ జనరల్‌గా ఉన్నారు. 1956లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అడ్వకేట్ జనరల్ పదవి తొలిసారిగా సుదర్శన్ రెడ్డికి దక్కింది. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నాయకులు, తెలంగాణ న్యాయవాదులు పదే పదే విమర్సలు చేయడంతో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన సుదర్శన్ రెడ్డిని 2011లో అడ్వొకేటే జనరల్‌గా నియమించారు.