రాష్ట్ర అడ్వకేట్ జనరల్ సుదర్శన రెడ్డి తీరుపై అసెంబ్లీ అంచనాల కమిటీ అసంతృప్తి వ్యక్తం చేసింది.
హైదరాబాద్: రాష్ట్ర అడ్వకేట్ జనరల్ సుదర్శన రెడ్డి తీరుపై అసెంబ్లీ అంచనాల కమిటీ అసంతృప్తి వ్యక్తం చేసింది. అసెంబ్లీ కమిటీ హాలులో గత రెండు రోజులుగా ఈ కమిటీ సమావేశాలు జరుగుతున్నాయి. వ్యవసాయ రంగానికి చెందిన పలు అంశాలను సమీక్షించారు.
ప్రతి మార్కెట్ యార్డులో బహిరంగ షెడ్లు నిర్మించాలని కమిటీ ప్రభుత్వానికి సూచన చేసింది. వివిధ ప్రభుత్వ శాఖలలో కేసుల పెండింగ్‌లో ఉండటానికి పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ వైఫల్యమే కారణమని అసెంబ్లీ అంచనాల కమిటీ చైర్మన్ ముత్యంరెడ్డి చెప్పారు.
ఇదిలా ఉండగా, ఆంధ్రప్రదేశ్ అవతరణ తర్వాత తొలిసారిగా తెలంగాణ ప్రాంతానికి చెందిన సుదర్శన్ రెడ్డి అడ్వొకేట్ జనరల్‌గా ఉన్నారు. 1956లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అడ్వకేట్ జనరల్ పదవి తొలిసారిగా సుదర్శన్ రెడ్డికి దక్కింది. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నాయకులు, తెలంగాణ న్యాయవాదులు పదే పదే విమర్సలు చేయడంతో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన సుదర్శన్ రెడ్డిని 2011లో అడ్వొకేటే జనరల్‌గా నియమించారు.